S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/18/2018 - 01:27

సెంచూరియన్, జనవరి 17: భారత్‌తో సెంచూరియన్ మైదానంలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ సందర్భంగా దక్షిణాఫ్రికా జట్టు స్లో ఓవర్ రేటు కారణంగా ఆ జట్టుకు అపరాధ రుసుం విధించారు. ఐసీసీ మ్యాచ్‌కు సంబంధించిన క్రిస్ బోర్డు ఆఫ్ ది ఎమిరేట్స్ ఎలైట్ ప్యానల్ దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ డిప్లిసెస్ మ్యాచ్ చివరిలో నిర్ణీత సమయంలో రెండు ఓవర్లు తక్కువగా వేయడంతో ఫైన్ విధించినట్టు పేర్కొంది.

01/18/2018 - 01:25

విశాఖపట్నం (స్పోర్ట్స్), జనవరి 17 : రెండవ ఆంధ్రా బ్యాడ్మింటన్ లీగ్ (ఎబిఎల్) పోటీలు ఈనెల 20 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ లీగ్ ప్రారంభ పోటీలకు విశాఖ నగరం స్వర్ణ్భారతి ఇండోర్ స్టేడియం వేదిక కానుంది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ లీగ్ పోటీలు ఆంధ్రప్రదేశ్‌లోని 8 ప్రధాన పట్టణాలలో నిర్వహిస్తున్నారు.

01/18/2018 - 01:25

లండన్, జనవరి 17: వివాదాస్పద ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఆలౌరౌండర్ బెన్‌స్టోక్స్‌ను మళ్లీ ఆ దేశ జట్టులోకి తీసుకోకున్నారు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) బుధవారం వెల్లడించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఒక నైట్‌క్లబ్‌లో జరిగిన ఒక వివాదాస్పద సంఘటనలో ప్రమేయం ఉందన్న కారణంతో స్టోక్స్‌పై ఈసీబీ నిషేధం విధించింది.

01/18/2018 - 01:24

న్యూఢిల్లీ, జనవరి 17: భారత క్రికెట్ జట్టు ఆటగాడు హార్ధిక్ పాండ్య ఆటలో ఎలాంటి తప్పులు చేసినా అతనిని తనతో పోల్చవద్దని మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ అన్నాడు. దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ మైదానంలో జరిగిన టెస్ట్‌మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో హార్ధిక్ పాండ్య ఆట తీరుపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల పాండ్య భారత్‌కు మరో ఆల్‌రౌండర్ దొరికాడని కపిల్ ప్రశంసలు గుప్పించిన విషయం తెలిసిందే.

01/17/2018 - 01:07

సెంచూరియన్, జనవరి 16: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు జరిగిన రెండవ ఇన్నింగ్స్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్లు బ్యాటింగ్ ఝళిపించడంలో తడబడ్డారు. 287 పరుగుల లక్ష్యఛేదనలో బ్యాటింగ్ ప్రారంభించినప్పటినుంచే తడబడ్డారు. తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఓపెనర్ మురళీ విజయ్ 8వ ఓవర్‌లో 9 పరుగులకే ఔటయ్యాడు.

01/17/2018 - 01:06

మెల్‌బోర్న్, జనవరి, 16: ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నెంబర్ 2 ఆటగాడు రోజర్ ఫెదరర్, ఆరుసార్లు చాంపియన్‌గా అవతరించిన నవోక్ జుకోవిక్ తమ మొదటిరౌండ్లలో విజయం సాధించడం ద్వారా రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. జుకోవిక్ అమెరికన్ ఆటగాడు డొనాల్డ్ యంగ్‌పై మార్గ్‌రెట్ కోర్టు అరెనాలో గంట 51 నిమిషాల వ్యవధిపాటు జరిగిన పోటీలో 6-1, 6-2, 6-4 తేడాతో విజయం సాధించాడు.

01/17/2018 - 01:05

విక్ ఆన్ జీ, జనవరి 16: చెస్‌లో ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్ సాధించిన భారత ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ టాటా స్టీల్ మాస్టర్ చెస్ టోర్నీలో మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. అమెరికాకు చెందిన ఫాబినో కెర్వానా జరిగిన పోటీలో ఆయన 2.5 పాయింట్లు సాధించడం ద్వారా మూడో రౌండ్‌లోకి చేరాడు. మూడురోజుల్లో రెండోసారి ఈ విజయం సాధించడం ద్వారా ఆనంద్ ఆరోసారి కూడా విజయం సాధించాలని ఆశిస్తున్నాడు.

01/17/2018 - 01:04

సెంచూరియన్, జనవరి 16: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్‌మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్‌లో సోమవారం జరిగిన పోటీలో కోహ్లీ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్‌మన్ రికార్డుతో సమానంగా టెస్ట్‌మ్యాచ్‌లలో 150 పరుగులు చేశాడు.

01/17/2018 - 01:00

తౌరంగ (న్యూజిలాండ్), జనవరి 16: నాలుగు జాతీయ ఇన్విటేషనల్ టోర్నమెంట్లలో భాగంగా భారత్ హాకీ జట్టు తొలిరోజు బుధవారంనాడు జపాన్ జట్టుతో తలపడుతుంది. జపాన్‌తో జరిగిన పోటీ అనంతరం బెల్జియం, న్యూజిలాండ్‌తో జరిగే ఐదు రోజుల సిరీస్‌లలో భారత్ ఆడుతుంది. నాలుగు రోజులపాటు జపాన్‌తో జరిగే పోటీలో భాగంగా భారత్ ఇక్కడి బ్లేక్ పార్క్‌లో వాతావరణ పరిస్థితులను అంచనా వేసింది.

01/17/2018 - 01:09

వౌంట్ వౌంగనూయి, జనవరి 16: ప్రతిష్టాత్మక అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో భారత జట్టు క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. సోమవారం పపువా న్యూజెనియాతో గ్రూప్-బి విభాగంలో జరిగిన పోటీలో భారత్ ఆటగాళ్లు 10 వికెట్ల తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించారు.

Pages