S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/15/2018 - 00:57

మెల్బోర్న్: గత సీజన్ నుంచి చక్కటి ప్రతిభతో రాణిస్తున్న భారత ఆటగాడు యుకీ భంబ్రీ ఆస్ట్రేలియా ఓపెన్ మెయిన్ డ్రాకు క్వాలిఫై అయ్యాడు. చివరిదైన మూడో క్వాలిఫయర్‌లో అతను కెనడాకు చెందిన పీటర్ పొలాన్‌స్కీని 1-6, 6-3, 6-3 తేడాతో ఓడించాడు. మొదటి సెట్‌ను చేజార్చుకున్నప్పటికీ, ఆతర్వాత రెండు సెట్లలో అతను ఎదురుదాడికి దిగి, విజయాన్ని నమోదు చేశాడు.

01/15/2018 - 00:56

టి-20 ఫార్మాట్‌లో అత్యంత వేగవంతమైన శతకాన్ని నమోదు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన రిషభ్ పంత్. ముస్తాక్ అలీ టీ-20 ట్రోఫీలో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న అతను న్యూఢిల్లీలో ఆదివారం హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 32 బంతుల్లోనే సెంచరీ చేశాడు. అతను మొత్తం 38 బంతుల్లో 116 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

01/15/2018 - 00:54

వౌంట్ మాంగనుయ్, జనవరి 14: అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్‌లో భారత యువ జట్టు శుభారం చేసింది. ఆస్ట్రేలియాతో ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌ని 100 పరుగుల భారీ తేడాతో గెల్చుకొని, టైటిల్ వేటను మొదలుపెట్టింది.

01/14/2018 - 02:48

హైదరాబాద్, జనవరి 13: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)లో సభ్యత్వంపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని ప్రముఖ క్రికెటర్, మాజీ భారత జట్టు కెప్టెన్ అజారుద్దీన్ స్పష్టం చేశాడస.

01/14/2018 - 02:55

జెడ్డా, జనవరి 13: స్టేడియంలో మ్యాచ్‌లను తిలకించాలన్న సౌదీ అరేబియా మహిళా సాకర్ అభిమానుల చిరకాల స్వప్నం ఎట్టకేలకు సాకారమైంది. కింగ్ అబ్దుల్లా స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో స్థానిక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కి అధికారులు మహిళలను అనుమతించారు. యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ పట్ట్భాషేకం సందర్భంగా సౌదీ అరేబియా పలు సంస్కరణలను ప్రకటించింది.

01/14/2018 - 01:30

మెల్బోర్న్‌లో కిడ్స్ టెన్నిస్ డే సందర్భంగా శనివారం కాసేపు సరదాగా పిల్లలతో కలిసి టెన్నిస్ ఆడిన తర్వాత ఫొటోలకు ఫోజులిస్తున్న టెన్నిస్ స్టార్లు (ఎడమ నుంచి కుడికి) మిలోస్ రోనిక్, రోజర్ ఫెదరర్, కరోలిన్ వొజ్నియాకి, నొవాక్ జొకోవిచ్. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌కు వీరంతా సిద్ధమవుతున్నారు.

01/14/2018 - 01:28

సెంచూరియన్, జనవరి 13: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారం ఇక్కడ మొదలైన రెండో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటలో ఇరు జట్లు సమాన ప్రతిభ కనబరిచాయి. మొదటి రెండు సెషన్లలో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం కొనసాగితే, మూడో సెషన్ చివరిలో, ఆతర్వాత నాలుగో సెషన్‌లో భారత బౌలర్లు సత్తా చాటారు.

01/14/2018 - 01:26

సెంచూరియన్, జనవరి 13: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండవ టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు ఎంపికపై మాజీ కెప్టెన్, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత్ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో కేఎల్ రాహును ఎంపిక చేయడంతోపాటు భువనేశ్వర్ కుమార్ స్థానంలో ఇషాంత్ శర్మను జట్టులోకి తీసుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించాడు.

01/14/2018 - 01:24

వాంగరెల్ (న్యూజిలాండ్), జనవరి 13: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆధ్వర్యంలో శనివారం ఇక్కడ ప్రారంభమైన అండర్-19 వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో అఫ్గానిస్తాన్ బోణీ చేసింది. పాకిస్తాన్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి సత్తా చాటింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 47.4 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైంది. రొహైల్ నజీర్ 81 పరుగులు సాధించగా, అలీ జర్యాబ్ ఆసిఫ్ 30 పరుగులు చేశాడు.

01/14/2018 - 01:23

వౌంట్ వౌంగనూయి, జనవరి 13: మళ్లీ ఎన్నో సంవత్సరాల తర్వాత జరుగనున్న ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ క్రికెట్ సందర్భంగా తమ సత్తా చూపాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. వాస్తవానికి శనివారంనాడే ఈ పోటీ ప్రారంభమైనా ఆస్రేలియాతో ఆదివారం జరిగే పోటీలో గెలుపొందడం ద్వారా భవిష్యత్తు బాటలు వేయాలని భారత్ భావిస్తోంది. అందుకు కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో జట్టు ఇప్పటికే అన్నివిధాల సిద్ధమైంది.

Pages