S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/05/2018 - 01:12

న్యూఢిల్లీ, జనవరి 4: భారత హాకీ గోల్‌కీపర్ శ్రీజేష్‌ను ఏడాది పాటు ప్రొబేషన్‌లో ఉంచాలని హాకీ ఇండియా (హెచ్‌ఐ) నిర్ణయించింది. అంతేగాక, అతనిపై 15 రోజుల సస్పెన్షన్ వేటు వేసింది. మోకాలి గాయం కారణంగా శ్రీజేష్ సుమారు ఎనిమిది నెలలుగా వైద్య చికిత్స పొందుతున్నాడు.

01/05/2018 - 01:11

ముంబయి, జనవరి 4: రెండేళ్ల సస్పెన్షన్‌ను పూర్తి చేసుకొని, ఈ ఏడాది మళ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోకి అడుగుపెట్టనున్న చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేస్తున్న ఆటగాళ్లలో మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఉన్నాడు. కాగా, విరాట్ కోహ్లీని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రోహిత్ శర్మను డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్ వేలానికి పంపరాదని నిర్ణయించాయి.

01/03/2018 - 22:26

ఆస్ట్రేలియాతో ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టు కోసం సమాయత్తమవుతున్న ఇంగ్లాండ్ క్రికెటర్లు. ఈ మ్యాచ్ గురువారం నుంచి సిడ్నీ మైదానంలో మొదలవుతుంది

01/03/2018 - 22:23

కేప్ టౌన్, జనవరి 3: సుమారు మూడేళ్లుగా తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచిన టీమిండియా అదే ఆధిపత్యాన్ని దక్షిణాఫ్రికా టూర్‌లోనూ కొనసాగిస్తుందా లేదా అన్నది ఉత్కంఠ రేపుతున్నది. నిజానికి 2015 జనవరి ఒకటి నుంచి ఇప్పటి వరకూ భారత్ ఎదురులేని జట్టుగా పేరు సంపాదించింది. చాంపియన్స్ ట్రోఫీని మినహాయిస్తే, దాదాపుగా ఆడిన ప్రతి సిరీస్‌నూ, టోర్నీనీ గెల్చుకొని, తనకు తానే సాటి అని నిరూపించుకుంది.

01/03/2018 - 22:21

వౌంట్ మాంగనుయ్ (న్యూజిలాండ్), జనవరి 3: కొలిన్ మున్రో రికార్డు శతకం బుధవారం ఇక్కడ జరిగిన చివరి టీ-20 ఇంటర్నేషనల్‌లో వెస్టిండీస్‌పై న్యూజిలాండ్‌కు 119 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను కివీస్ 2-0 తేడాతో కైవసం చేసుకోగా, వైఫల్యాల బాటలో నడిచిన విండీస్ ఈ టూర్‌ను ఒక్క విజయం కూడా లేకుండా ముగించింది.

01/03/2018 - 22:19

సిడ్నీ, జనవరి 3: ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో కాలి మడమ గాయం కారణంగా ఆడలేకపోయిన ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ చివరిదైన ఐదో టెస్టులో ఆడనున్నాడు. అతను నెట్స్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా బౌల్ చేశాడని, చివరి టెస్టులో ఆడే ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఉంటాడని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తెలిపాడు.

01/03/2018 - 22:24

సిడ్నీ, జనవరి 3: ఫాస్ట్ బౌలర్ క్రిస్ వోక్స్ గురువారం నుంచి ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్ చివరి టెస్టులో ఆడడం లేదని ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ తెలిపాడు. బుధవారం నెట్ ప్రాక్టీస్ ముగిసిన తర్వాత అతను విలేఖరులతో మాట్లాడుతూ వోక్స్ పక్కటెముకల వద్ద కండరాలు పట్టుకున్నాయని, దీనితో అతను ఇబ్బంది పడుతున్నాడని అన్నాడు.

01/03/2018 - 22:16

న్యూఢిల్లీ, జనవరి 3: టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకం కింద ఎంపిక చేసిన 175 మంది అథ్లెట్ల ఖర్చుల కోసం 3.14 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తెలిపాడు. జాతీయ క్రీడాభివృద్ధి నిధి (ఎన్‌ఎస్‌డీఎఫ్) ద్వారా ఈ మొత్తాన్ని పంచనున్నట్టు అతను బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ చెప్పాడు.

01/03/2018 - 22:15

దుబాయ్, జనవరి 3: న్యూజిలాండ్‌లో ఈనెల 13 నుంచి ప్రారంభం కానున్న అండర్-19 వరల్డ్ కప్ టోర్నమెంట్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎంపిక చేసిన 14 మంది సభ్యులతో కూడిన అంపైర్ల ప్యానెల్‌లో ఇద్దరు భారతీయులకు చోటు దక్కింది. అనిల్ చౌదరి, సీకే నందన్ కూడా సభ్యులుగా ఉన్న ప్యానెల్ వివరాలను ఐసీసీ ప్రకటించింది. రాబర్ట్ బెయిలీ, టిమ్ రాబిన్సన్ వంటి హేమాహేమీలు ఈ జాబితాలో ఉన్నారు.

01/03/2018 - 22:15

బెంగళూరు, జనవరి 3: భారత హాకీ శిక్షణా శిబిరం గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఇందులో పాల్గొనే 33 మంది పేర్లను హాకీ ఇండియా (హెచ్‌ఐ) బుధవారం ప్రకటించింది. మోకాలి నొప్పి కారణంగా సుమారు ఎనిమిది నెలలు విశ్రాంతి తీసుకున్న గోల్‌కీపర్ శ్రీజేష్ ఈ క్యాంప్‌లో తన ఫిట్నెస్‌ను పరీక్షించుకోనున్నాడు.

Pages