S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/02/2018 - 01:05

ఢిల్లీ తొలి ఇన్నింగ్స్: 102.5 ఓవర్లలో 295 ఆలౌట్ (్ధృవ్ శౌరి 145, హిమ్మత్ సింగ్ 66, రజనీష్ గుర్బానీ 6/59, ఆదిత్య థాకరే 2/74).
విదర్భ తొలి ఇన్నింగ్స్: 163.4 ఓవర్లలో 547 ఆలౌట్ (ఫైజ్ ఫజల్ 67, వసీం జాఫర్ 78, అక్షయ్ వినోద్ వాడ్కర్ 123, ఆదిత్య సర్వతే 79, సిద్దేశ్ నెరాల్ 74, నవ్‌దీప్ సైనీ 5/135, ఆకాష్ సుదన్ 2/102, కుల్వంత్ ఖెజ్రోలియా 2/132).

01/02/2018 - 01:00

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కొత్త సంవత్సరం సందర్భంగా ట్వీట్ చేసిన ప్రత్యేక సెల్ఫీ. దక్షిణాఫ్రికా టూర్‌కు కోహ్లీతోపాటు అనుష్క కూడా వెళ్లింది. మొదటి టెస్టు ఈనెల ఐదు నుంచి మొదలుకానుండగా, కేప్ టౌన్ తదితర ప్రాంతాల్లో కోహ్లీ, అనుష్క దంపతులు విహార యాత్రలు చేస్తున్నారు. ఇలావుంటే, టీమిండియా క్రికెటర్లు న్యూ ఇయర్ వేడుకల్లో బిజీగా గడిపారు.

01/02/2018 - 00:58

ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌లో భీకరంగా పోరాడుతున్న చిరకాల ప్రత్యర్థులు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెటర్లు ఒకే చోట చేరడం ఆశ్చర్యం కలిగించే విషయమే. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్ ఇరు జట్ల క్రికెటర్లకు సోమవారం ఉదయం విందునిచ్చాడు. ఆ సందర్భంగా తీసిన ఫొటో ఇది.

01/02/2018 - 00:57

కరాచీ, జనవరి 1: మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో భారత అండర్-19 జట్టు అద్భుతంగా రాణించడమేగాక, జాతీయ జట్టుకు ఆటగాళ్లను అందించగలుగుతున్నదని, తమ దేశంలోనూ అలాంటి సమర్థుడైన కోచ్ అవసరమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు మాజీ కెప్టెన్ రమీజ్ రాజా సూచించాడు.

01/02/2018 - 00:56

తన భార్య జార్జినా రోడ్రిగెజ్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి
నూతన సంవత్సర వేడుకల్లో మునిగితేలిన సాకర్ స్టార్
లియోనెల్ మెస్సీ (ఎడమ) సోషల్ మీడియాలో పెట్టిన ఫొటో

01/02/2018 - 00:55

పయోంగ్యాన్, జనవరి 1: దక్షిణ కొరియాలో జరిగే వింటర్ ఒలింపిక్స్‌లో ఉత్తర కొరియా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైయాంగ్‌చాంగ్ (దక్షిణ కొరియా)లో ఈ మెగా ఈవెంట్ విజయవంతంగా జరుగుతుందని నూతన సంవత్సర వేడుకల సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. వింటర్ ఒలింపిక్స్‌కు బృందాన్ని పంపించడం సహా, ఈ దిశగా అన్ని చర్యలు తీసుకుంటామన్నాడు.

01/02/2018 - 00:53

కేప్ టౌన్, జనవరి 1: ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంపై టీమిండియా మేనేజ్‌మెంట్ ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, ఈనెల ఐదు నుంచి మొదలయ్యే మొదటి టెస్టులో అతను ఆడడం అనుమానంగానే కనిపిస్తున్నది. టీమిండియా దక్షిణాఫ్రికాకు బయలుదేరే కొన్ని గంటల ముందే ధావన్ కాలి మడమ బెణికింది. దీనితో అతను వెస్టర్న్ ప్రావీన్స్ క్రికెట్ క్లబ్‌లో శనివారం నెట్స్‌లో పాల్గొనలేదు.

01/02/2018 - 00:39

సిడ్నీ, జనవరి 1: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కంటే ఇంగ్లీష్ కౌంటీల్లో ఆడడానికే తాను ప్రాధాన్యం ఇస్తానని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ స్పష్టం చేశాడు. నిరుడు ఐపీఎల్ వేలంలో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ అతనిని 4.8 కోట్ల రూపాయలకు కొనింది.

01/02/2018 - 00:38

వౌంట్ బౌంగానుయ్ (న్యూజిలాండ్), జనవరి 1: న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య సోమవారం జరగాల్సిన రెండో టీ-20 ఇంటర్నేషనల్ వర్షం కారణంగా రద్దయింది. వర్షం మొదలుకావడానికి ముందు ఆరు ఓవర్ల ఆట జరిగింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నాలుగు వికెట్లకు 102 పరుగులు చేసింది. కొలిన్ మున్రో 23 బంతుల్లో 66 పరుగులు సాధించడం విశేషం. అయితే, ఈ దశలోనే భారీ వర్షం కురవడంతో ఆట నిలిచిపోయింది.

01/02/2018 - 00:37

షెన్‌జెన్ (చైనా), జనవరి 1: ఈ ఏడాది మొదటి రోజునే రష్యా టెన్నిస్ బ్యూటీ విజయంతో ఓ టోర్నీలో శుభారంభం చేసింది. షెన్‌జెన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ మొదటి రౌండ్‌లో ఆమె 6-4, 6-1 తేడాతో రుమేనియాకు చెందిన మిహయెలా బుజార్‌నెస్క్యూను ఓడించింది. రెండో రౌండ్‌లో ఆమె చైనా క్రీడాకారిణి డువాన్ ఇంగ్‌ఇంగ్‌ను ఢీ కొంటుంది.

Pages