S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/31/2017 - 00:42

మెల్బోర్న్, డిసెంబర్ 30: మెల్బోర్న్‌లో ఏమాత్రం జీవం లేని పిచ్ కారణంగానే నాలుగో టెస్టు డ్రాగా ముగిసిందని ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ విమర్శించాడు. యాషెస్ సిరీస్‌ను కోల్పోయినప్పటికీ, నాలుగో టెస్టులో గెలిచే అవకాశాలు తమకు మెరుగ్గానే ఉన్నాయని, కానీ, పిచ్ ఆటకు అనువుగా లేకపోవడం, ఆపై జల్లులు పడడం ఈ మ్యాచ్ డ్రాగా ముగిసేందుకు కారణమయ్యాయని విలేఖరులతో మాట్లాడుతూ రూట్ చెప్పాడు.

12/30/2017 - 01:17

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: కామనె్వల్త్ గేమ్స్ క్వాలిఫయింగ్ రెజ్లింగ్ పోటీ బౌట్ అభిమానుల మధ్య ఘర్షణకు దారి తీసింది. గోదాలో రెజ్లర్లు తలపడితే, స్టేడియంలో ఇరువురి అభిమానులు కొట్టుకున్నారు. ఒకరిపై మరొకరు కుర్చీలతో దాడులు చేసుకున్నారు.

12/30/2017 - 01:15

ఇండోర్, డిసెంబర్ 29: ఇక్కడి హోల్కర్ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమైన రంజీ ట్రోఫీ ఫైనల్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఢిల్లీ ఆరు వికెట్లకు 271 పరుగులు సాధించింది. ధృవ్ శౌరి అజేయ శతకం (123)తో రాణించడంతో ఢిల్లీకి ఈ స్కోరు సాధ్యమైంది. టాస్ గెలిచిన విదర్భ ఫీల్డింగ్ ఎంచుకోగా, మొదటి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఢిల్లీ ఓపెనర్లు కుణాల్ చండీలా (0), గౌతం గంభీర్ (15) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు.

12/30/2017 - 01:14

రంజీ ట్రోఫీ ఫైనల్ తొలి రోజు ఆటలో రెండు వికెట్లు పడగొట్టిన రజనీష్ గుర్బానీకి సహచరుల అభినందన. విదర్భను ఫైనల్ చేర్చడంలో గుర్బానీ కీలక పాత్ర పోషించాడు

12/30/2017 - 01:12

చెన్నై, డిసెంబర్ 29: వరుస పరాజయాలు, వైఫల్యాల కారణంగా చోటు చేసుకున్న తీవ్రమైన ఒత్తిడితోనే తాను ప్రపంచ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ ఆడి టైటిల్ సాధించానని భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ అన్నాడు. రియాద్‌లో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆనంద్ ఒక్క గేమ్‌ను కూడా కోల్పోకుండా నిలకడగా ఆడాడు.

12/30/2017 - 01:11

మెల్బోర్న్, డిసెంబర్ 29: ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌ను 0-3 తేడాతో చేజార్చుకున్నప్పటికీ, చివరి రెండు మ్యాచ్‌లను గెల్చుకోవడం ద్వారా పరువు నిలబెట్టుకోవాలన్న ఇంగ్లాండ్ ఆశలకు నాలుగో మ్యాచ్‌లో వర్షం గండి కొట్టింది. ఓపెనర్‌గా దిగిన మాజీ కెప్టెన్ అలస్టర్ కుక్ చివరి వరకూ నాటౌట్‌గా నిలవడంతో, రెండో ఇన్నింగ్స్‌లో 491 పరుగుల భారీ స్కోరు సాధించిన ఇంగ్లాండ్ ఆతర్వాత ఆస్ట్రేలియాపై దాడికి ఉపక్రమించింది.

12/30/2017 - 01:09

మెల్బోర్న్, డిసెంబర్ 29: ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా దిగి, జట్టులో ఆలౌటయ్యే సమయానికి నాటౌట్‌గా నిలిచిన 52వ బ్యాట్స్‌మన్‌గా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలస్టర్ కుక్ రికార్డు పుస్తకాల్లోకి చేరాడు. 1997లో మైఖేల్ ఆథర్టన్ తర్వాత ఈ ఫీట్‌ను ప్రదర్శించిన తొలి ఇంగ్లాండ్ క్రికెటర్‌గా అతను గుర్తింపు సంపాదించాడు. మొత్తం మీద ఆ జట్టు తరఫున తొమ్మిదోసారి టెస్టుల్లో ‘క్యారియింగ్ ది బ్యాట్’ నమోదైంది.

12/30/2017 - 01:09

నెల్సన్, డిసెంబర్ 29: వెస్టిండీస్‌తో ప్రారంభమైన టీ-20 ఇంటర్నేషనల్స్ సిరీస్‌లో న్యూజిలాండ్ బోణీ చేసింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మొదటి మ్యాచ్‌ని ఈ జట్టు 47 పరుగుల తేడాతో గెల్చుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 187 పరుగులు సాధించింది. కొలిన్ మున్రో (53), గ్లేన్ ఫిలిప్స్ (55) అర్ధ శతకాలు సాధించగా, రాస్ టేలర్ 20, మిచెల్ సాంట్నర్ 23 (నాటౌట్) చొప్పున పరుగు చేశారు.

12/30/2017 - 01:09

తిరువనంతపురం, డిసెంబర్ 29: ఏస్ షూటర్ జీతూ రాయ్ ఇక్కడ జరుగుతున్న 61 జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్స్ పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో కొత్త రికార్డును నెలకొల్పి, స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మొత్తం 233 పాయింట్లు సంపాదించిన అతను టైటిల్‌ను దక్కించుకోగా, ఓంకార్ సింగ్ 222.4 పాయింట్లతో రజతాన్ని అందుకున్నాడు. జై సింగ్‌కు కాంస్య పతకం లభించింది.

12/30/2017 - 01:08

దుబాయ్, డిసెంబర్ 29: రియల్ మాడ్రిడ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పోర్చుగీస్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు ఈ ఏడాది మరో అవార్డు లభించింది. ప్రతిష్ఠాత్మక బాలాన్ డిఆర్ అవార్డును ఇటీవలే సొంతం చేసుకున్న అతనికి తాజాగా గ్లోబ్ సాకర్స్ ఉత్తమ క్రీడాకారుడి అవార్డును ఇచ్చింది. దీనిని అతను గెల్చుకోవడం వరుసగా రెండోసారి. మొత్తం మీద నాలుగో పర్యాయం అతను అవార్డును స్వీకరించాడు.

Pages