S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/30/2017 - 01:07

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: ఎమిరిట్స్ ఎయిర్‌లైన్స్ అధికారులు తమను ఇబ్బంది పెట్టారని, దీనితో తన భార్య, కుమారుడు దుబాయ్‌లోనే ఉండిపోవాల్సి వచ్చిందని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికా టూర్‌కు భార్య అయేషా, కుమారుడు జొరావర్‌తో కలిసి బయలుదేరిన ధావన్‌ను దుబాయ్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు సర్ట్ఫికెట్లను చూపాల్సిందిగా కోరారు.

12/29/2017 - 20:21

క్రీడా రంగంలో 2017 సంవత్సరం ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయ. కొన్ని అద్భుతాలు.. మరికొన్ని వైఫల్యాలు.. కొన్ని రికార్డులు, మైలురాళ్లు.. మరికొన్ని పరాజయాలు, నిష్క్రమణలు.. ఇలా మంచిచెడు మేలి కలయకగా ఈ ఏడాది గడిచిపోయంది. గుర్తుచేసుకోతగ్గ ఎన్నో పరిణామాల్లో ప్రముఖంగా పేర్కోదగినది టెన్నిస్‌లో రోహన్ బొపన్న తన కెరీర్‌లోనే తొలి గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను గెల్చుకోవడం.

12/29/2017 - 02:04

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని చేరుకోవడమే వచ్చే ఏడాది తన ప్రధాన లక్ష్యమని భారత బాడ్మింటన్ స్టార్, ‘తెలుగు తేజం’ పీవీ సింధు స్పష్టం చేసింది. అయితే, ర్యాంకింగ్స్ కోసం ఒత్తిడికి లోనుకానని రెండు నెలల క్రితం తన కెరీర్‌లోనే అత్యుత్తమంగా రెండో స్థానాన్ని సంపాదించి, ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్న సింధు తెలిపింది.

12/29/2017 - 02:02

దక్షిణాఫ్రికాలో భారత క్రికెట్ జట్టు మూడు టెస్టులు, ఆరు వనే్డలు, మరో మూడు టీ-20 ఇంటర్నేషనల్స్ ఆడుతుంది. మొదటి టెస్టు జనవరి 5న కేప్ టౌన్‌లో మొదలవుతుంది. శ్రీలంకతో జరిగిన వనే్డ, టీ-20 సిరీస్‌ల నుంచి విశ్రాంతి తీసుకున్న కోహ్లీ కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు స్వీకరించి, దక్షిణాఫ్రికాలో జట్టును నడిపించనున్నాడు.

12/29/2017 - 01:59

హైదరాబాద్, డిసెంబర్ 28: భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయల నగదుతో పాటు 600 గజాల ఇంటి స్థలాన్ని క్రీడలశాఖ మంత్రి టి. పద్మారావుగౌడ్ సచివాలయంలో గురువారం అందజేసారు. అలాగే మిథాలీరాజ్ కోచ్ ఆర్‌ఎస్‌ఆర్ మూర్తికి రూ. 25 లక్షల నగదు పురస్కారాన్ని మంత్రి అందజేసారు.

12/29/2017 - 01:59

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: ఏటీపీ వరల్డ్ టూర్ టైటిల్‌ను సాధించే సత్తా తనకు ఉందని భారత టెన్నిస్ ఆటగాడు యుకీ భంబ్రీ ధీమా వ్యక్తం చేశాడు. 2015లో మొదటిసారి ప్రపంచ ర్యాంకింగ్స్ ‘టాప్-100’లోకి అడుగుపెట్టిన అతను ఈ ఏడాది పుణే చాలెంజర్స్ టైటిల్ గెల్చుకున్నాడు. బెంగళూరు ఓపెన్‌లో సెమీస్ వరకూ చేరాడు.

12/29/2017 - 01:58

మెల్బోర్న్, డిసెంబర్ 28: ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. మాజీ కెప్టెన్ అలస్టర్ కుక్ డబుల్ సెంచరీతో నాటౌట్‌గా నిలవడంతో, మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొమ్మిది వికెట్లకు 491 పరుగుల భారీ స్కోరు సాధించి, 164 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.

12/29/2017 - 01:57

ఇండోర్, డిసెంబర్ 28: ఎనిమిదోసారి రంజీ ట్రోఫీ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న ఢిల్లీకి శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఫైనల్‌లో విదర్భ నుంచి పెను సవాళ్లు ఎదురుకానున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఈ జట్టు ఎవరూ ఊహించని రీతిలో విజయపరంపరలను కొనసాగించిన విషయం తెలిసిందే.

12/29/2017 - 01:56

బ్రిస్బేన్, డిసెంబర్ 28: ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. మోకాలి నొప్పితో బాధపడుతున్న కారణంగా ఈ టోర్నీకి దూరమైనట్టు అతను ట్విటర్ ద్వారా సమచారామిచ్చాడు. మోకాలి నొప్పి పూర్తిగా తగ్గలేదని, అందుకే, జనవరి 1 నుంచి 8వ తేదీ వరకు జరిగే బ్రిస్బేన్ టోర్నీకి ముందు జాగ్రత్త చర్యగా హాజరుకావడం లేదని నాదల్ తన ట్విటర్ అకౌంట్‌లో తెలిపాడు.

12/29/2017 - 01:54

మెల్బోర్న్, డిసెంబర్ 28: పూర్తిగా ఫామ్‌ను కోల్పోయిన తనపై ఎప్పుడో వేటు పడాల్సి ఉన్నదని, ఆ ప్రమాదం తప్పిందని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలస్టర్ కుక్ వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ సాధించి నాటౌట్‌గా నిలిచిన అతను గురువారం ఆట ముగిసిన తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ జట్టులో కొనసాగించడం తన అదృష్టమన్నాడు.

Pages