S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/28/2017 - 00:55

బ్రిస్బేన్, నవంబర్ 27: తాజా యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా బోణీ చేసింది. మొదటి టెస్టులో ఇంగ్లాండ్‌ను 10 వికెట్ల తేడాతో చిత్తుచేసి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ సులభంగానే లక్ష్యాన్ని ఛేదించారు.

11/28/2017 - 00:54

నాగపూర్, నవంబర్ 27: ఇటీవల కాలంలో టీమిండియా చిరస్మరణీయ విజయాలు సాధించడానికి ప్రధాన కారణం ఏమిటి? కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడు స్వభావమే జట్టులోని మిగతా ఆటగాళ్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కోహ్లీ కూడా ఇదే విషయాన్ని స్వయంగా వెల్లడించాడు.

11/28/2017 - 00:53

దోహా, నవంబర్ 27: భారత స్టార్ పంకజ్ అద్వానీ తన ఖాతాలో మరో ప్రపంచ టైటిల్‌ను చేర్చుకున్నాడు. ఇక్కడ జరిగిన ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఇరాన్‌కు చెందిన అమీర్ సర్కోష్‌ను తను 8-2 తేడాతో చిత్తుచేశాడు. ఆద్యంతం ఆధిపత్యాన్ని కనబరచిన అద్వానీకి అమీర్ ఏ దశలోనూ గట్టిపోటీని ఇవ్వలేకపోయాడు.

11/28/2017 - 00:52

ముంబయి, నవంబర్ 27: బాడ్మింటన్ స్టార్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ ఉత్తమ స్పోర్ట్స్ అవార్డులను గెల్చుకున్నాడు. ఈ ఏడాది ఉత్తమ క్రీడాకారిణిగా సింధు, ఉత్తమ క్రీడాకారుడిగా శ్రీకాంత్ ఎంపికకాగా, టీం ఈవెంట్స్‌లో భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌కు అవార్డులు లభించాయి.

11/28/2017 - 00:51

న్యూఢిల్లీ, నవంబర్ 27: అండర్-23 వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు రజత పతకాలు లభించాయి. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం, పోలాండ్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో 65 కిలోల విభాగంలో బరిలోకి దిగిన బజరంగ్ తన ప్రత్యర్థి నాచిన్ సెర్గీవిచ్ కులార్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొని, రజత పతకంతో సంతృప్తి చెందారు.

11/28/2017 - 00:51

న్యూఢిల్లీ, నవంబర్ 27: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్ష పదవికి నరీందర్ బాత్రా నామినేషన్ దాఖలు చేశాడు. అంతర్జాతీయ హాకీ సమాఖ్యకు అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్న అతను వచ్చేనెల 14న జరిగే ఐఓఏ పాలక మండలి ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాడు. తగినంత మెజారిటీ లేని కారణంగా ప్రస్తుత అధ్యక్షుడు రామచంద్రన్ మరోసారి పోటీ చేయకూడదని నిర్ణయించుకోవడంతో, ఆ పదవిపై బాత్రా కనే్ననశాడు.

11/27/2017 - 02:10

నాగపూర్, నవంబర్ 26: కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డు డబుల్ సెంచరీ శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాను పటిష్టమైన స్థితిలో నిలబెట్టింది. రెండు వికెట్లకు 312 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మ్యాచ్ మూడో రోజు, ఆదివారం ఆటను కొనసాగించిన భారత్ ఆరు వికెట్లకు 610 పరుగుల భారీ స్కోరు వద్ద మొదటి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

11/27/2017 - 00:17

డబుల్ సెంచరీ హీరో విరాట్ కోహ్లీ. వైఫల్యాలు ఎదురైన ప్రతిసారీ, పట్టుదలతో మళ్లీ ఫామ్‌లోకి రావడం కోహ్లీ అలవాటు. ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లినప్పుడు, బార్డర్-గవాస్కర్ ట్రోఫీలో మూడు టెస్టులు ఆడి కేవలం 46 పరుగులు చేశాడు. అయితే, ఆ వెంటనే తనదైన శైలిలో బ్యాటింగ్ చేసి, శ్రీలంకలో శ్రీలంకపై అజేయంగా 104 పరుగులు చేశాడు.

11/27/2017 - 00:16

నాగపూర్, నవంబర్ 26: తక్కువ ఇన్నింగ్స్‌లోనే 19 టెస్టు సెంచరీలు సాధించిన భారత బ్యాట్స్‌మెన్ జాబితాలో ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ తెండూల్కర్ మూడో స్థానానికి పడిపోయాడు. ఇప్పటి వరకూ అతను ఉన్న రెండో స్థానాన్ని విరాట్ కోహ్లీ ఆక్రమించాడు. అతను 114 ఇన్నింగ్స్‌లో 19 టెస్టు శతకాలను నమోదు చేయగా, సచిన్ 115 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు.

11/27/2017 - 00:14

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 116.4 ఓవర్లలో 302 ఆలౌట్ (మార్క్ స్టోన్‌మన్ 53, జేమ్స్ విన్స్ 83, దావీద్ మలాన్ 56, మోయిన్ అలీ 38, మిచెల్ స్టార్క్ 3/77, పాట్ కమిన్స్ 3/95, నాథన్ లియాన్ 2/78).
ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్: 130.3 ఓవర్లలో 328 ఆలౌట్ (డేవిడ్ వార్నర్ 26, స్టీవెన్ స్మిత్ 141 నాటౌట్, షాన్ మార్ష్ 51, పాట్ కమిన్స్ 42, స్టువర్ట్ బ్రాడ్ 3/49, జేమ్స్ ఆండర్సన్ 2/50, మోయిన్ అలీ 2/74).

Pages