S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

10/31/2017 - 01:02

హైదరాబాద్, అక్టోబర్ 30: బిసిసిఐకి జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఎంవి శ్రీధర్ హఠాన్మరణంపై భారత మాజీ క్రికెటర్లు వివిఎస్ లక్ష్మణ్, వెంకటపతి రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన వీరిద్దరికీ శ్రీధర్‌తో ఎంతో సాన్నిహిత్యం ఉంది. అతని మృతి వార్త తనను కలచివేసిందని లక్ష్మణ్ వాపోయాడు. హైదరాబాద్ క్రికెట్‌కు గుర్తింపు తీసుకొచ్చిన క్రికెటర్లలో శ్రీధర్ ప్రముఖుడని అభివర్ణించాడు.

10/31/2017 - 01:02

సింగపూర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో వీనస్ విలియమ్స్‌ను 6-4, 6-4 తేడాతో ఓడించి, ట్రోఫీని అందుకున్న ప్రపంచ మాజీ నంబర్ వన్ కరోలిన్ వొజ్నియాకి

10/31/2017 - 00:57

బోల్పూర్, అక్టోబర్ 30: ప్రాక్టీస్ జరుగుతున్న సమయంలో ఒక ఆర్చర్ భుజానికి బాణం గుచ్చుకుంది. గాయపడిన ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నది. జెవెల్ షేక్ అనే ఆర్చర్ ప్రాక్టీస్ సమయంలో వేసిన బాణం గురితప్పి, 14 ఏళ్ల ఫైజిలా ఖటూన్ అనే మరో ఆర్చర్ భుజానికి తగిలింది. తొలుత మెడకు గాయమైందని అంతా అనుకున్నారు.

10/31/2017 - 00:57

దుబాయ్, అక్టోబర్ 30: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన వనే్డ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ పురుషులు, మహిళల బ్యాటింగ్ విభాగాల్లో భారత జట్ల కెప్టెన్లు విరాట్ కోహ్లీ, మిథాలీ రాజ్ అగ్రస్థానాన్ని ఆక్రమించారు. ఇటీవలే రెండో స్థానానికి పడిపోయిన కోహ్లీ తిరిగి నంబర్ వన్‌గా ఎదిగాడు.

10/31/2017 - 00:55

‘టాప్-10’ బ్యాట్స్‌మెన్: 1. విరాట్ కోహ్లీ (్భరత్/ 889 పాయింట్లు), 2. ఎబి డివిలియర్స్ (దక్షిణాఫ్రికా/ 872 పాయింట్లు), 3. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా/ 865 పాయింట్లు), 4. బాబర్ ఆజం (పాకిస్తాన్/ 846 పాయింట్లు), 5. క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా/ 808 పాయింట్లు), 6. జో రూట్ (ఇంగ్లాండ్/ 802 పాయింట్లు), 7. రోహిత్ శర్మ (్భరత్/ 799 పాయింట్లు), 8. ఫఫ్ డు ప్లెసిస్ (దక్షిణాఫ్రికా/ 773 పాయింట్లు), 9.

10/31/2017 - 00:52

విశాఖపట్నం (స్పోర్ట్స్), అక్టోబర్ 30: రెండో ఎలైట్ జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌ను రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు జట్టు కైవసం చేసుకుంది. ఈ పోటీల్లో రైల్వే జట్టు 5 స్వర్ణాలు, 1 కాంస్య పతకంతో మొత్తం 49 పాయింట్లు సాధించి ప్రథమ స్థానం గెలుచుకోగా, సర్వీసెస్ జట్టు 4 స్వర్ణాలు, ఒక రజతం, 2 కాంస్య పతకాలతో 40 పాయింట్లు సాధించి రన్నరప్ ట్రోఫీని గెలుచుకుంది.

10/31/2017 - 00:50

పారిస్, అక్టోబర్ 30: ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌పై తనకు ఏమాత్రం ఆందోళన లేదని, దానిని గురించి ఎక్కువగా ఆలోచించి నిద్రను పాడుచేసుకోనని భారత బాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ స్పష్టం చేశాడు. ఫ్రెంచ్ ఓపెన్ బాడ్మింటన్ టైటిల్ గెల్చుకున్న అతను ఈ ఏడాది నాలుగో సూపర్ సిరీస్ విజయాన్ని నమోదు చేయడం విశేషం. ఈ ఘనతను అందుకున్న తొలి భారతీయుడిగా, ప్రపంచంలోనే నాలుగో క్రీడాకారుడిగా అతను రికార్డులకెక్కాడు.

10/31/2017 - 00:49

న్యూఢిల్లీ, అక్టోబర్ 30: భారత్‌లో వచ్చే ఏడాది జరిగే హాకీ ప్రపంచ కప్‌కు దక్షిణాఫ్రికా అర్హత సంపాదించింది. ఇస్మాయిలాలో జరిగిన ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ ఫైనల్‌లో ఈజిప్టును ఓడించి టైటిల్‌ను సాధించడం ద్వారా వరల్డ్ కప్‌కు దక్షిణాఫ్రికా క్వాఫై అయింది. కాగా, మహిళల విభాగంలోనూ ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ టైటిల్‌ను దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. ఫైనల్‌లో ఆ జట్టు ఘనాను ఓడించింది.

10/31/2017 - 00:48

కాకమిగహరా (జపాన్), అక్టోబర్ 30: మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో చైనాను భారత్ 4-1 తేడాతో చిత్తుచేసింది. భారత్ తరఫున గుర్జిత్ కౌర్ (19వ నిమిషం), నవ్‌జోత్ కౌర్ (32వ నిమిషం), నేహా గోయల్ (49వ నిమిషం), కెప్టెన్ రాణి రాంపాల్ (58వ నిమిషం) గోల్స్ సాధించారు. చైనా తరఫున క్విజియా కూ మ్యాచ్ చివరి క్షణాల్లో ఒక గోల్ చేసింది.

10/31/2017 - 00:48

బాసెల్ (స్విట్జర్లాండ్), అక్టోబర్ 30: వచ్చే వారం జరగనున్న పారిస్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి వెటరన్ ఆటగాడు రోజర్ ఫెదరర్ వైదొలిగాడు. కెరీర్‌లో 19 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లతో రికార్డు నెలకొల్పిన 36 ఏళ్ల ఫెదరర్ స్విస్ ఇండోర్ టోర్నీ ఫైనల్‌లో జువాన్ డెల్ పొట్రోను 6-7, 6-4, 6-3 తేడాతో ఓడించి, ఎనిమిదోసారి ఆ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.

Pages