S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

10/31/2017 - 00:46

సిడ్నీ, అక్టోబర్ 30: వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ వేసిన పరువు నష్టం కేసుపై సిడ్నీ కోర్టు సానుకూలంగా స్పందించింది. ఒక పాత్రికేయురాలితో అసభ్యంగా ప్రవర్తించాడని, ఆమెకు మర్మాంగాన్ని చూపుతూ వెకిలిగా మాట్లాడాడని గేల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఫెయిర్ ఫాక్స్ వార్తా సంస్థ ఇచ్చిన ఈ సమాచారాన్ని ఆస్ట్రేలియాలోని వివిధ వార్తా పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి.

10/30/2017 - 01:29

పారిస్‌లో ఆదివారం జరిగిన ఫైనల్‌లో కెన్టా నిషిమొటోను ఓడించి ఫ్రెంచ్ ఓపెన్ బాడ్మింటన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ కైవశం చేసుకున్నాడు. శ్రీకాంత్‌కు ఇది వరుసగా రెండో టైటిల్‌కాగా, మొత్తం మీద ఈ ఏడాది నాలుగో సూపర్ సిరీస్ టైటిల్. అద్భుత విజయాన్ని సాధించిన శ్రీకాంత్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు అభినందించారు.

10/30/2017 - 01:14

కాన్పూర్, అక్టోబర్ 29: కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ శతకాలతో కదంతొక్కి, ఆదివారం ఉత్కంఠ భరితంగా జరిగిన చివరి వనే్డలో న్యూజిలాండ్‌పై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. భారత్ నిర్దేశించిన 338 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు చివరి వరకూ హోరాహోరీగా పోరాడిన కివీస్ చివరికి ఏడు వికెట్లు కోల్పోయి 331 పరుగులు చేయగలిగింది.

10/30/2017 - 01:10

భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ సి టిమ్ సౌథీ బి మిచెల్ సాంట్నర్ 147, శిఖర్ ధావన్ సి కేన్ విలియమ్‌సన్ బి టిమ్ సౌథీ 14, విరాట్ కోహ్లీ సి కేన్ విలియమ్‌సన్ బి టిమ్ సౌథీ 113, హార్దిక్ పాండ్య సి టిమ్ సౌథీ బి మిచెల్ సాంట్నర్ 8, మహేంద్ర సింగ్ ధోనీ సి కొలిన్ మున్రో బి ఆడం మిల్నే 25, కేదార్ జాధవ్ సి మార్టిన్ గుప్టిల్ బి ఆడం మిల్నే 18, దినేష్ కార్తీక్ 4 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 8, మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు

10/30/2017 - 01:08

జొహర్ బహ్రూ (మలేసియా)లో జరిగిన సుల్తాన్ ఆఫ్ జొహర్ హాకీ కప్ చాంపియన్‌షిప్ క్లాసిఫికేషన్ మ్యాచ్‌లో మలేషియాను 4-0 తేడతో ఓడించి కాంస్య పతకం సాధించిన భారత జూనియర్స్ జట్టు. ఈ టోర్నీలో బ్రిటన్‌పై గెలిచిన ఆస్ట్రేలియా టైటిల్ గెల్చుకుంది

10/30/2017 - 01:07

లాహోర్, అక్టోబర్ 29: శ్రీలంకపై మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌ను పాకిస్తాన్ 3-0 తేడాతో గెల్చుకుంది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌ని 36 పరుగుల తేడాతో కైవసం చేసుకొని, ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లకు 180 పరుగు లు సాధించింది. అనంతరం శ్రీలంక తొమ్మిది వికెట్లు చేజార్చుకొని 144 పరుగులు చేయగలిగింది.

10/30/2017 - 01:06

పారిస్, అక్టోబర్ 29: ఎనిమిదో సీడ్‌గా ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నీలో బరిలోకి దిగిన హైదరాబాదీ కిడాంబి శ్రీకాంత్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఇక్కడ జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో కెన్టా నిషిమొటోను 21-14, 21-13 తేడాతో ఓడించి వరుసగా రెండో టైటిల్ అందుకున్నాడు. గత వారం ఒడెన్స్‌లో జరిగిన డెన్మార్క్ ఓపెన్‌ను శ్రీకాంత్ సాధించాడు.

10/30/2017 - 01:04

కార్డ్ఫి (యునైటెడ్ కింగ్‌డమ్), అక్టోబర్ 29: నాకౌట్లతో ప్రత్యర్థులను ఓడించడంలో నూరు శాతం మార్కులను కొట్టేసిన ఆంథోనీ జాషువా మరోసారి సత్తా చాటాడు. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఐబిఎఫ్), ప్రపంచ బాక్సింగ్ సంఘం (డబ్ల్యుబిఎ) సంయుక్త హెవీవెయిట్ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. చాలెంజర్ కార్లొస్ టకామ్‌ను 10 రౌండ్లలో చిత్తుచేశాడు. కెరీర్‌లో అతనికి ఇది వరుసగా 20వ టైటిల్ కావడం విశేషం.

10/30/2017 - 00:59

మాడ్రిడ్, అక్టోబర్ 29: స్పానిష్ సాకర్ లీగ్ లా లిగాలో బార్సిలోనా తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నది. అథ్లెటికో బిల్బావోతో జరిగిన మ్యాచ్‌ని 2-0 తేడాతో సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ ఈ సీజన్‌లో 13 లా లిగా మ్యాచ్‌లు ఆడిన బార్సిలోనాకు ఇది 12వ విజయం. ఒక మ్యాచ్‌ని డ్రా చేసుకుంది. 36వ నిమిషంలో మెస్సీ గోల్ సాధించగా, ఆతర్వాత దాదాపు చివరి వరకూ బార్సిలోనా రక్షణాత్మక విధానాన్ని అనుసరించింది.

10/29/2017 - 04:07

ప్రో కబడ్డీని 2014లో మొదలుపెట్టినప్పుడు, జైపూర్ పింక్ పాంథర్స్ తొలి విజేతగా అవతరించింది. 2015లో యు ముంబా టైటిల్ దక్కించుకుంది. గత ఏడాది జనవరిలో మూడవ, తిరిగి జూన్‌లో నాలుగవ టోర్నీలను నిర్వహించారు. జనవరిలో డిఫెండింగ్ చాంపియన్ యు ముంబాను 36-30 ఆధిక్యంతో ఓడించి, పాట్నా మొదటిసారి టైటిల్ సాధించింది. జూన్‌లో ఇదే జట్టు జైపూర్ పింక్ పాంథర్స్‌పై 37-29 తేడాతో గెలిచింది.

Pages