S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

10/02/2017 - 00:41

నాగపూర్, అక్టోబర్ 1: విదర్భ క్రికెట్ సంఘం (విసిఎ) మైదానంలో ఆదివారం జరిగిన చివరి వనే్డ ఇంటర్నేషనల్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా అలవోక విజయాన్ని నమోదు చేసింది. సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. అక్షర్ పటేల్ పకడ్బందిగా బంతులు వేసి, మూడు వికెట్లను పడగొట్టడంతో ఆసీస్‌ను భారత్ తొమ్మిది వికెట్లకు 242 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత లక్ష్యాన్ని భారత్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

10/02/2017 - 00:39

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ సి హార్దిక్ మనీష్ పాండే బి అక్షర్ పటేల్ 53, ఆరోన్ ఫించ్ సి జస్‌ప్రీత్ బుమ్రా బి హార్దిక్ పాండ్య 32, స్టీవెన్ స్మిత్ ఎల్‌బి కేదార్ జాధవ్ 16, పీటర్ హ్యాండ్స్‌కోమ్ సి అజింక్య రహానే బి అక్షర్ పటేల్ 13, ట్రావిస్ హెడ్ బి అక్షర్ పటేల్ 42, మార్కస్ స్టొయినిస్ ఎల్‌బి జస్‌ప్రీత్ బుమ్రా 46, మాథ్యూ వేడ్ సి అజింక్య రహానే బి జస్‌ప్రీత్ బుమ్రా 20, జేమ్స్ ఫాల్క్‌నెర్ రనౌట్

10/02/2017 - 00:43

* ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ మొత్తం ఐదు ఇన్నింగ్స్‌లో 296 పరుగులు సాధించి, అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. ఆరోన్ ఫించ్ మూడు మ్యాచ్‌ల్లో 250, డేవిడ్ వార్నర్ ఐదు మ్యాచ్‌ల్లో 245 పరుగులతో వరసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. కాగా, సగటుల్లో ఫించ్ (83.33 పరుగులు), మార్కస్ స్టొయినిస్ (76.50 పరుగులు) మొదటి రెండు స్థానాల్లో నిలవగా, రోహిత్ (59.20 పరుగులు)కు మూడో స్థానం దక్కింది.

10/02/2017 - 00:37

నాగపూర్: ఒక దశలో ఆస్ట్రేలియా జట్టు కేవలం ఒక వికెట్ కోల్పోయి వంద పరుగులకు చేరుకుంది. అదే స్కోరువద్ద రెండో వికెట్‌ను చేజార్చుకోగా, 18 పరుగుల తేడాతో మరో రెండు వికెట్లను సమర్పించుకుంది. లేకపోతే, ఆ జట్టుకు భారీ స్కోరు సాధ్యమయ్యేది. భారత బౌలర్లు, ప్రత్యేకించి అక్షర్ పటేల్ ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. పొదుపుగా బౌలింగ్ చేసిన అతను 38 పరుగులకు 3 వికెట్లు కూల్చాడు.

10/02/2017 - 00:35

కౌలాలంపూర్‌లోని సెపాంగ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో జరిగిన మలేసియా గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేస్‌ను గెల్చుకున్న రెడ్‌బుల్ డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ (ఎడమ), అతని సహచరుడు డానియల్ రిసియార్డో.

10/02/2017 - 00:34

విజయవాడ (స్పోర్ట్స్), అక్టోబర్ 1: న్యూజిలాండ్ ‘ఎ’తో జరుగుతున్న నాలుగు రోజుల అనధికార టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 360 పరుగులు సాధించిన భారత్ ‘ఎ’ జట్టు 149 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. ఇంకా ఆరు వికెట్లు చేతిలో ఉన్నాయి. అంకిత్ బావ్నే అజేయ శతకంతో కదంతొక్కగా, వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ పార్థీవ్ పటేల్ అర్ధ శతకం పూర్తిచేసి క్రీజ్‌లో ఉన్నాడు.

10/02/2017 - 00:33

నాగపూర్‌లో సోమవారం జరిగిన చివరి వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో భారత అభిమానుల కోలాహలం. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మూడు వనే్డలను కైవసం చేసుకొని, సిరీస్‌ను 3-0 తేడాతో గెల్చుకున్న టీమిండియా నాలుగో వనే్డను చేజార్చుకోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. చివరిదైన ఐదో వనే్డకు భారీగా తరలి వచ్చిన అభిమానులకు తుది ఫలితం ఆనందాన్నిచ్చింది.

10/02/2017 - 00:32

చెన్నై, అక్టోబర్ 1: ప్రో కబడ్డీ లీగ్‌లో సోమవా రం జరిగిన రెండు మ్యాచ్‌లు అత్యంత ఉత్కంఠ భరితంగా కొనసాగాయ. బెంగాల్ వారియర్స్ జ ట్టు ఒక పాయంట్ తేడాతో జైపూర్ పింక్ పాంథ ర్స్‌ను ఓడిస్తే, తమిళ్ తలైవాస్‌పై యు ముంబా మూడు పాయంట్ల తేడాతో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో బెంగాల్ 32 పాయంట్లు చేయగా, గట్టిపోటీనిచ్చిన జైపూర్ 31 పాయంట్లు చేసింది.

10/02/2017 - 00:31

లాహోర్, అక్టోబర్ 1: సెలక్టర్లు తనను ఎంపిక చేయకుండా తరచు నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆవేదనతో పాకిస్తాన్‌కు చెందిన ఓ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. లాహోర్ సిటీ క్రికెట్ సంఘం (ఎల్‌సిసిఎ) మైదానంలో ఒక మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే అతను ఈ అఘాయిత్యానికి ప్రయత్నించడం గమనార్హం.

10/02/2017 - 00:30

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: అండర్-17 ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశం తనకు లభించడం ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిందని అమర్‌జిత్ సింగ్ కియామ్ అన్నాడు. ఎఎఫ్‌సి అండర్-16 చాంపియన్స్‌లో జితేంద్ర సింగ్, బ్రిక్స్ కప్ టోర్నీలో సురేష్ సింగ్ వాంగ్‌జమ్ భారత్‌కు కెప్టెన్సీ వహించారు.

Pages