S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/30/2017 - 00:35

బెంగళూరు, సెప్టెంబర్ 29: భారత మహిళా క్రికెట్ జట్టుకు చెందిన కొంత మంది క్రీడాకారిణులను కలిసి, వారితో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ముచ్చటిస్తున్న ఫొటోలను బిసిసిఐ సోషల్ మీడియాలో ఉంచింది. గురువారం చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వనే్డలో కోహ్లీ బృందం 21 పరుగులతో పరాజయాన్ని ఎదుర్కొన్న తర్వాత విమర్శలు వెల్లువెత్తుతాయేమోనన్న భయంతో బిసిసిఐ ఈ ఫొటోను అప్‌లోడ్ చేసి ఉండవచ్చు.

09/30/2017 - 00:34

బెంగళూరు, సెప్టెంబర్ 29: ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన నాలుగో వనే్డలో రిజర్వ్‌డ్ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలన్న నిర్ణయం ఏమాత్రం తప్పుకాదని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. 335 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన టీమిండియా ఆ మ్యాచ్‌ని 21 పరుగు తేడాతో చేజార్చుకున్న విషయం తెలిసిందే.

09/30/2017 - 00:32

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కు ఆస్ట్రేలియాతో టీమిండియా వనే్డ సిరీస్‌లో ఆడుతున్నదా లేక టి-20 మ్యాచ్‌లో పోటీపడుతున్నదా అనే విషయం కూడా తెలియదా? అసలు మ్యాచ్ గురించిన వివరాలే తెలియనంత మత్తులో బోర్డు అధికారులు జోగుతున్నారా? అభిమానులు ఆగ్రహంతో సంధిస్తున్న ప్రశ్నలివి.

09/30/2017 - 00:31

పారిస్, సెప్టెంబర్ 29: ఐర్లాండ్ మాజీ స్ట్రయికర్, కెవిన్ డోల్ అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. 34 ఏళ్ల డోల్ ఫుట్‌బాలర్‌గా తన 16 ఏళ్ల కెరీర్‌లో ఐర్లాండ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. క్లబ్ టోర్నీల్లో రీడింగ్, ఊల్వ్స్, క్రిస్టల్ ప్యాలెస్ తదిర జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ప్రస్తుతం అమెరికాలో కోలరాడో ర్యాపిడ్స్‌కు సేవలు అందిస్తున్నాడు.

09/30/2017 - 00:31

బెంగళూరు, సెప్టెంబర్ 29: చిన్నస్వామి స్టేడియంలో గురువారం భారత్‌తో జరిగిన నాలుగో వనే్డలో గెలుపొందడం ద్వారా, విదేశాల్లో వరుస పరాజయాల నుంచి బయటపడడమేగాక, భారత్ వరుస విజయాలకు బ్రేక్ వేసినందుకు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ డేవిడ్ సాకెర్ సంతోషం వ్యక్తం చేశాడు. జట్టు మళ్లీ గాడిలో పడిందని ఒక ఇంటర్వ్యూలో అతను వ్యాఖ్యానించాడు. అయితే, తమ జట్టుకు ఇది అసాధారణ, అద్భుత విజయమేమీ కాదని స్పష్టం చేశాడు.

09/30/2017 - 00:29

బీజింగ్, సెప్టెంబర్ 29: మహిళల డబుల్స్ విభాగంలో నంబర్ వన్ ర్యాంక్‌లో ఉన్న లూసీ సఫరోవా శనివారం నుంచి మొదలయ్యే బీజింగ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో పాల్గొనడం లేదు. చేతి మణికట్టుకు గాయమైందని, అందుకే, బీజింగ్ ఓపెన్‌కు హాజరుకాలేకపోతున్నానని ప్రేగ్‌లో విడుదల చేసిన ఒక ప్రకటనలో సఫరోవా తెలిపింది.

09/30/2017 - 00:29

చెన్నై, సెప్టెంబర్ 29: ప్రో కబడ్డీ లీగ్‌లో తమిళ్ తలైవాస్ జట్టు హోం గ్రౌండ్‌లోనే పరాజయాన్ని చవిచూసింది. అన్ని విభాగాల్లోనూ విఫలమైన ఆ జట్టు పునేరీ పల్టన్ చేతిలో 13 పాయింట్ల తేడాతో ఓడింది. దీపక్ హూడా ఆరు, రాజేష్ మోండల్ ఐదు, మోనూ 4 చొప్పున పాయింట్లతో రాణించడంతో పునేరీ పల్టన్ 33 పాయింట్లకు చేరుకోగలిగింది. తలైవాస్ తరఫున అజయ్ ఠాకూర్, సబ్‌స్టిట్యూట్ ఆటగాడు డాంగ్ లీ చెరి నాలుగు పాయింట్లు చేశారు.

09/30/2017 - 00:28

పెర్త్, సెప్టెంబర్ 29: ఆస్ట్రేలియా హాకీ లీగ్ టోర్నమెంట్‌లో భారత్ ‘ఎ’ జట్టు శుభారంభం చేసింది. వెస్టర్న్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ని 4-1 తేడాతో గెల్చుకుంది. మ్యాచ్ ఆరో నిమిషంలోనే అర్మాన్ ఖురేషి భారత్ ‘ఎ’కు తొలి గోల్‌ను అందించాడు. ఆతర్వాత అఫాన్ యూసుఫ్ 30, అమిత్ రోహిదాస్ 45, తల్వీందర్ సింగ్ 50 నిమిషాల్లో గోల్స్ సాధించి, భారత్ ఆధిక్యాన్ని పెంచారు.

09/29/2017 - 01:30

బెంగళూరు, సెప్టెంబర్ 28: భారత్ చేతిలో ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను ఇప్పటికే 0-3 తేడాతో కోల్పోయిన ఆస్ట్రేలియా ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన నాలుగో వనే్డను 21 పరుగుల తేడాతో గెల్చుకొని, భారత్ ఆధిక్యాన్ని తగ్గించింది. సిరీస్ ఫలితంపై ఎలాంటి ప్రభావం చూపకపోయినా, రానున్న యాషెస్ సిరీస్‌కు సిద్ధమయ్యేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని ఆసీస్ సంపాదించుకుంది.

09/28/2017 - 23:51

భారత ఓపెనర్లు అజింక్య రహానే, రోహిత్ శర్మ మొదటి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో ఆసీస్‌కు భారత్ దీటైన సమాధానమిచ్చే స్థితిలో నిలిచింది. జట్టు స్కోరు 106 పరుగుల వద్ద ఆరోన్ ఫించ్ క్యాచ్ అందుకోగా కేన్ రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో అవుటైన రహానే 66 బంతుల్లో 53 పరుగులు చేశాడు. అతని స్కోరులో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. తర్వాత కొద్ది సేపటికే రోహిత్ కూడా వెనుదిరిగాడు.

Pages