S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/28/2017 - 23:49

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఆరోన్ ఫించ్ సి హార్దిక్ పాండ్య బి ఉమేష్ యాదవ్ 94, డేవిడ్ వార్నర్ సి అక్షర్ పటేల్ బి కేదార్ జాధవ్ 124, ట్రావిస్ హెడ్ సి అజింక్య రహానే బి ఉమేష్ యాదవ? 29, స్టీవెన్ స్మిత్ సి విరాట్ కోహ్లీ బి ఉమేష్ యాదవ్ 3, పీటర్ హ్యాండ్స్‌కోమ్ బి ఉమేష్ యాదవ్ 43, మార్కస్ స్టొయినిస్ 15 నాటౌట్, మాథ్యూ వేడ్ 3 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 23, మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 334.

09/28/2017 - 23:47

ఢిల్లీ, సెప్టెంబర్ 28: ప్రో కబడ్డీలో గురువారం ద బాంగ్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌ని తెలుగు టైటాన్స్ జట్టు 22 పాయంట్ల భారీ తేడాతో సొంతం చేసు కుంది. టైటాన్స్ 44 పాయంట్లు సంపాదించగా, ఢి ల్లీ 22 పాయంట్లకు పరిమితమైంది. రెండో విడద అంతర్ మండల చాలెంజ్‌లో నాలుగు విజయాలు సాధించిన తొలి జట్టుగా టైటాన్స్ అవతరించింది. సూపర్ స్టార్ ఇమేజ్‌తో అభిమానులను ఆకట్టు కుంటున్న రాహుల్ చౌదరి మరోసారి విశ్వరూపా న్ని చూపాడు.

09/28/2017 - 23:47

లండన్, సెప్టెంబర్ 28: ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో వనే్డలో ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలుకావడం వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలగ్గా, డక్‌వర్త్ లూయిస్ విధానంలో మ్యాచ్ ఫలితాన్ని ఇంగ్లాండ్‌కు అనుకూలంగా అధికారులు నిర్ణయించారు. అయితే, ఏఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఈ ఫలితాన్ని ప్రకటించారో అర్థం కావడం లేదని హోల్డర్ వాపోతున్నాడు.

09/28/2017 - 23:46

మాస్కో, సెప్టెంబర్ 28: రొమెలూ లుకాకు దూకుడును కొనసాగిస్తూ, రెండు గోల్స్ సాధించడంతో, సిఎస్‌కెఎ మాస్కో జట్టుతో జరిగిన చాంపియన్స్ లీగ్ గ్రూప్ మ్యాచ్‌లో మాంచెస్టన్ యునైటెడ్ జట్టు 4-1 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ నాలుగో నిమిషంలోనే తొలి గోల్ చేసిన లుకాకు 27వ నిమిషంలో మరో గోల్‌ను సంపాదించాడు. మార్షల్ 19వ నిమిషంలో, మిఖితర్యాన్ 57వ నిమిషంలో గోల్స్ నమోదు చేసి, యునైటెడ్‌ను ఆధిక్యంలో నిలిపారు.

09/28/2017 - 23:44

లక్నో, సెప్టెంబర్ 28: ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో అద్వితీయ ప్రతిభ కనబరచడంతో, ఇండియా బ్లూను 163 పరుగుల తేడతో ఓడించిన ఇండియా రెడ్ దులీప్ ట్రోఫీ టైటిల్‌ను సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రెడ్ 127.2 ఓవర్లలో 483 పరుగుల వద్ద ఆలౌటైంది. పృథ్వీ షా 154, కెప్టెన్ దినేష్ కార్తీక్ 111 పరుగులు చేయగా, సుందర్ 88 పరుగులు సాధించాడు.

09/28/2017 - 01:25

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బిబిసి) ఎంపిక చేసిన పవర్‌ఫుల్ ఉమెన్ జాబితాలో భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌కు చోటు దక్కింది. స్ఫూర్తిదాయకమైన 100 మంది మహిళల జాబితాను బిబిసి విడుదల చేసింది. అందులో మిథాలీకి స్థానం లభించడం విశేషం. క్రికెట్‌లో లింగ వివక్షపై మిథాలీ చాలాకాలంగా పోరాటం సాగిస్తున్న విషయం తెలిసిందే.

09/27/2017 - 22:54

లోధా కమిటీకి సుప్రీం కోర్టు స్పష్టీకరణ

09/27/2017 - 22:54

హైదరాబాద్, సెప్టెంబర్ 27: హైదరాబాద్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంవి శ్రీ్ధర్ భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) క్రికెట్ వ్యవహారాల జనరల్ మేనేజర్ పదవికి రాజీనామా చేశాడు. పరస్పర ప్రయోజనాలు చేకూర్చే రీతిలో అతనికి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సిఎ) పరిధిలో కొన్ని క్లబ్‌లు ఉన్నాయని భారత మాజీ స్పిన్నర్ అర్షద్ అయూబ్ ఆరోపణలు చేయడంతో బిసిసిఐ పాలనాధికారుల బృందం (సిఒఎ) జోక్యం చేసుకుంది.

09/27/2017 - 22:52

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పిచ్‌పై బంతి నింపాదిగా కదులుతుందని గతంలో జరిగిన మ్యాచ్‌ల స్పష్టం చేస్తున్నాయి. అయితే, సుమారు నాలుగు సంవత్సరాలుగా ఈ పిచ్‌పై వనే్డ ఇంటర్నేషనల్ జరగలేదు. చివరిసారి ఇక్కడ ఆడిన వనే్డలో ఆస్ట్రేలియాపై భారత్ 57 పరుగుల తేడాతో విజయం సాధించింది.

09/27/2017 - 22:51

బెంగళూరు, సెప్టెంబర్ 27: ఆస్ట్రేలియాపై ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే 3-0 తేడాతో గెల్చుకున్న టీమిండియా ఇప్పుడు వైట్‌వాష్‌పై కనే్నసింది. శ్రీలంకను చిత్తుచేసిన విధంగానే ఆసీస్‌ను కూడా 5-0 తేడాతో ఓడించడం ద్వారా ‘పర్‌ఫెక్ట్ టెన్’ను నమోదు చేయడమే లక్ష్యంగా ఎంచుకుంది.

Pages