S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/27/2017 - 01:03

ముంబయి, సెప్టెంబర్ 26: ప్రపంచ మహిళల క్రికెట్‌లో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న భారత జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ జీవిత విశేషాలతో త్వరలో ఒక సినిమా తెరకెక్కబోతోంది.

09/27/2017 - 01:01

చండీగఢ్, సెప్టెంబర్ 26: భారత లెజండరీ అథ్లెట్ మిల్కా సింగ్ మంగళవారం తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించాడు. ‘్ఫ్లయింగ్ సిక్’గా ఖ్యాతి పొందిన మిల్కా సింగ్ 1958లో జరిగిన కామనె్వల్త్ క్రీడల్లో విజేతగా నిలిచినప్పుడు ఇచ్చిన స్ప్రింట్ ఫోజుతో రూపొందించిన ఈ విగ్రహాన్ని డిసెంబర్ 1వ తేదీన న్యూఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో నెలకొల్పనున్నారు.

09/27/2017 - 01:00

దుబాయ్, సెప్టెంబర్ 26: క్రికెట్‌లో అనుచితంగా ప్రవర్తించే ఆటగాళ్లను ఇక మీదట మైదానం నుంచి గెంటివేయనున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ రూపొందించిన కొత్త నిబంధనలు గురువారం నుంచి అమలులోకి రానుండటంతో ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చనుంది.

09/27/2017 - 00:59

బెంగళూరు, సెప్టెంబర్ 26: టీమిండియాతో మూడు మ్యాచ్‌ల అంతర్జాతీయ ట్వంటీ-20 క్రికెట్ సిరీస్‌లో తలపడేందుకు ఆస్ట్రేలియా ప్యాట్ కమ్మిన్స్ స్థానంలో పేసర్ ఆండ్రూ టైని జట్టులోకి తీసుకుంది. ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో భాగంగా ఇప్పటివరకూ టీమిండియాతో జరిగిన మూడు మ్యాచ్‌లలోనూ ప్యాట్ కమ్మిన్స్ ఆడిన విషయం తెలిసిందే.

09/27/2017 - 00:58

వొర్సెస్టర్, సెప్టెంబర్ 26: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కౌంటీ క్రికెట్‌లో తొలిసారి అర్ధ శతకంతో మెరిశాడు. వొర్సిస్టర్‌షైర్-డర్హమ్ జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న డివిజన్-2 మ్యాచ్ రెండో రోజు ఆటలో అశ్విన్ ఈ ఫీట్ సాధించాడు. మొత్తం 130 బంతులను ఎదుర్కొని 82 పరుగులు సాధించిన అశ్విన్ వొర్సిస్టర్‌షైర్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

09/26/2017 - 03:37

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: భారత బాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పివి సింధు పేరును పద్మ భూషణ్ అవార్డు కోసం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. దేశంలోనే మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ భూషణ్‌కు ఆమె పేరుతో ప్రతిపాదన పంపామని క్రీడా మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు పిటిఐతో మాట్లాడుతూ చెప్పాడు.

09/26/2017 - 00:58

విజయవాడ (స్పోర్ట్స్), సెప్టెంబర్ 25: న్యూజిలాండ్ ‘ఎ’తో జరిగిన అనధికార టెస్టును భారత్ ‘ఎ’ జట్టు ఇన్నింగ్స్ 312 పరుగుల భారీ తేడాతో గెల్చుకుంది. షాబాజ్ నదీం, కర్న్‌శర్మ ఒక్కో ఇన్నింగ్స్‌లో నాలుగేసి చొప్పున, చెరి ఎనిమిది వికెట్లు పడగొట్టి భారత్‌కు తిరుగులేని విజయాన్ని అందించాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమైన కివీస్ ‘ఎ’ జట్టు 142 పరుగులకు కుప్పకూలింది.

09/26/2017 - 00:56

ప్రేగ్, సెప్టెంబర్ 25: ప్రపంచ టెన్నిస్ చరిత్రలో చిరకాల ప్రత్యర్థుల జాబితాలో ముందు వరుసలో నిలిచే రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్ ఒక్కటయ్యారు. ఇద్దరూ ఒకే జట్టుగా పోటీపడ్డారు. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. ఇక్కడ జరిగిన లెవర్ కప్ టెన్నిస్ టీం వరల్డ్ పోటీల్లో వీరు డబుల్స్ భాగస్వాములుగా బరిలోకి దిగారు.

09/26/2017 - 00:54

ఒటోసెక్‌లో జరిగిన స్లొవేనియా జూనియర్ అండ్ కెడెట్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ జూనియర్ బాయిస్ సింగిల్స్ టైటిల్ సాధించిన భారత ఆటగాడు మానవ్ ఠక్కర్. ఫైనల్‌లో అతను జపాన్‌కు చెందిన తకెరూ కషివాను 11-6, 11-3, 11-5, 11-6 తేడాతో ఓడించాడు. ఈ టోర్నీలో అతను బాలుర డబుల్స్‌లో స్వర్ణం, టీం ఈవెంట్‌లో రజత పతకాలను కూడా గెల్చుకోవడం విశేషం

09/26/2017 - 00:53

ఇండోర్, సెప్టెంబర్ 25: బ్యాటింగ్ ఆర్డర్ ఏదైనా, సాధ్యమైనంత వరకూ నిలకడగా ఆడేందుకు ప్రయత్నిస్తానని భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య స్పష్టం చేశాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వనే్డలో అతను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. సహజంగా ధోనీ తర్వాత, ఏడో స్థానంలో మైదానంలోకి వచ్చే అతనికి కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రమోషన్ ఇచ్చాడు.

Pages