S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/10/2016 - 04:12

కింగ్‌స్టన్, జూలై 9: ముచ్చటగా మూడోసారి ఒలింపిక్స్‌లో 100, 200 మీటర్ల పరుగుతోపాటు 400 మీటర్ల రిలే టైటిల్‌ను కూడా సాధించాలన్న ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ కల నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమైకా నిబంధనల ప్రకారం ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో పాల్గొని అతను అర్హత సంపాదించాలి. కానీ, 100 మీటర్ల స్ప్రింట్‌లో పరిగెడుతున్నప్పుడు కాలి కండరాలు బెణకడంతో అతను క్వాలిఫయర్స్ నుంచి వైదొలిగాడు.

07/10/2016 - 04:10

లండన్, జూలై 9: పురుషుల సింగిల్స్‌లో విజేత ఎవరన్నది ఆసక్తిని రేపుతోంది. బ్రిటన్ ఆటగాడు ఆండీ ముర్రే, కెనడాకు చెందిన మిలోస్ రవోనిక్ ఫైనల్ చేరడంతో, ఫలితం ఎవరికి అనుకూలంగా ఉంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కెనడా తరఫున ఒక గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నీలో మొట్టమొదటిసారి ఫైనల్ చేరిన రవోనిక్ సెమీఫైనల్‌లో సీనియర్ ఆటగాడు రోజర్ ఫెదరర్‌ను 6-3, 6-7, 4-6, 7-5, 6-3 తేడాతో ఓడించి సంచలనం సృష్టించాడు.

07/10/2016 - 04:07

పాట్నా, జూలై 9: ప్రో కబడ్డీ టోర్నమెంట్‌లో భాగంగా శనివారం ఏకపక్షంగా జరి గిన మ్యాచ్‌లో ఢిల్లీ దబాంగ్ జట్టు పటిష్టమైన పాట్నా పైరేట్స్‌ను 18 పాయంట్ల తే డాతో చిత్తుచేసింది. ఢిల్లీ 33 పాయంట్లు సంపాదించగా, పాట్నా అనూహ్యంగా 15 పాయంట్లకే పరిమితమైంది. ఢిల్లీకి నాయకత్వం వహించిన మిరాజ్ షేక్ ఆరు పా యంట్లు చేయగా, సచిన్ షింగాడే నాలుగు పాయంట్లు సాధించాడు.

07/10/2016 - 04:05

న్యూఢిల్లీ, జూలై 9: క్రికెట్ అంటేనే కాదు.. బైకులన్నా, సైనిక దుస్తులన్నా ధోనీకి చాలా ఇష్టం. అయితే, ధోనీ ఫ్లూటు వాయిస్తాడని చాలా మందికి తెలియదు. ఈ విషయం అతని సన్నిహితుడు, టీమిండియా సభ్యుడు సురేష్ రైనా ద్వారా ప్రపంచానికి తెలిసింది. ధోనీ ఫ్లూటు వాయిస్తున్న ఫొటోను రైనా ట్వీట్ చేశాడు. ఇటీవలే 35వ జన్మదినోత్సవాన్ని జరుపుకొన్న ధోనీని ఫ్లూటిస్టుగా పరిచయం చేశాడు.

07/10/2016 - 04:03

న్యూఢిల్లీ, జూలై 9: భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్ రితూ రాణిపై వేటు పడింది. రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే జట్టులో సెలక్టర్లు ఆమెకు స్థానం కల్పించలేదు. భారత మహిళలు 36 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత రితూ నాయకత్వంలోనే ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించారు. జట్టుకు స్ఫూర్తిదాయకమైన మార్గదర్శకాన్నిచ్చిన రితూను జట్టు నుంచి తొలగిస్తారని ఎవరూ ఊహించలేదు.

07/10/2016 - 04:01

లండన్, జూలై 9: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో మిలోస్ రవోనిక్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైన సీనియర్ ఆటగాడు, ప్రపంచ మాజీ నంబర్ వన్ రోజర్ ఫెదరర్ వచ్చే ఏడాది ఈటోర్నీకి మళ్లీ వస్తానని, టైటిల్‌ను సాధిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, వచ్చే ఏడాది కూడా సెంటర్ కోర్టులో మ్యాచ్ ఆడాలన్నదే తన లక్ష్యమని అన్నాడు.

07/09/2016 - 08:25

భారత్ పోరాటానికి తెర

07/09/2016 - 08:23

సెయింట్ కిట్స్, జూలై 8: వెస్టిండీస్‌లో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు వెళ్లిన భారత క్రికెటర్లు అక్కడ బీచ్ వాలీబాల్‌లో తమ ప్రావీణ్యాన్ని చాటుకున్నారు. ఆటవిడుపుగా వారంతా బీచ్ వాలీబాల్ ఆడారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంతో ఉత్సాహంగా కనిపించగా, మిగతా వారు కూడా అతనితో జత కలిశారు. కరేబియాలోని అత్యంత సుందరమైన దీవుల్లో సెయింట్ కీట్స్ ఒకటి. దీనిని ‘సుగర్ సిటీ’గా పిలుస్తారు.

07/09/2016 - 08:22

సెయింట్ కిట్స్, జూలై 8: భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే తన క్రికెట్ సరంజామా (కిట్) లేకుండానే సెయింట్ కిట్స్‌కు చేరాడు. టీమిండియా సభ్యులతో కలిసి అతను ఇక్కడి విమానాశ్రయంలో దిగి, హోటల్ గదికి బయలుదేరినప్పుడు చూసుకుంటే కిట్ లేదన్న విషయం తెలిసింది. బ్రిటిష్ ఎయిర్‌వేస్ దానిని గాట్విక్‌లోనే వదిలివేసిందని సమాచారం అందింది.

07/09/2016 - 08:22

లండన్, జూలై 8: పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్‌పై బిబిసి చేసిన అనుచిత వ్యాఖ్య వివాదం రేపుతున్నది. ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లినప్పుడే, అప్పటి కెప్టెన్ సల్మాన్ బట్, ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆసిఫ్‌తో కలిసి అమీర్ కూడా ఫిక్సింగ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. తన నేరాన్ని అంగీకరించిన అమీర్ ఇంగ్లాండ్‌లోనే జైలు శిక్షను అనుభవించాడు.

Pages