S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/25/2017 - 00:52

విజయవాడ (స్పోర్ట్స్), సెప్టెంబర్ 24: న్యూజిలాండ్ ‘ఎ’తో జరుగుతున్న నాలుగు రోజుల అనధికార టెస్టులో భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. కివీస్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులకే కుప్పకూల గా, భారత్ ‘ఎ’ 320 పరుగులు సాధించి, 173 పరుగుల ఆధిక్యాన్ని సంపా దించింది. ఆదివారం నాటి ఆటలో శ్రేయాస్ అయ్యర్ (108) సెంచరీ సాధిం చగా, రిషభ్ పంత్ (57) అర్ధ శతకాన్ని నమోదు చేశాడు.

09/24/2017 - 00:17

ఇండోర్, సెప్టెంబర్ 23: ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో ఇప్పటికే 2-0 ఆధిక్యాన్ని సంపాదించిన విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఆదివారం ఇక్కడి హోల్కర్ స్టేడియంలోనూ ఆస్ట్రేలియాను ఓడించి, సిరీస్‌ను 3-0 కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది.

09/24/2017 - 00:15

విజయవాడ (స్పోర్ట్స్), సెప్టెంబర్ 23: విజయవాడ సమీపంలోని మూలపాడు ఎసిఎ క్రికెట్ మైదానం వేదికగా శనివారం న్యూజిలాండ్ ‘ఎ’తో మొదలైన నాలుగు రోజుల అనధికార టెస్టు తలి రోజు భారత్ ‘ఎ’ బౌలర్లు ఆధిపత్యాన్ని కనబరిచారు. వీరిని సమర్థంగా ఎదుర్కోలేకపోయన కివీస్ ‘ఎ’ 147 పరుగులకే కుప్పకూలింది.

09/24/2017 - 00:14

టోక్యో, సెప్టెంబర్ 23: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్ పోరు ముగిసింది. ఇప్పటికే మహిళలు, పురుషుల సింగిల్స్‌లో పరాజయాలను ఎదుర్కొన్న భారత్ మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ ఓటమిపాలై, టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రణవ్ జెర్రీ చోప్రా, సిక్కీ రెడ్డి జోడీ సెమీ ఫైనల్‌లో తీవ్రంగా పోరాడినప్పటికీ, టకురో హొకీ, సయాకా హిరొటా జోడీ చేతిలో 21-14, 15-21, 19-21 తేడాతో పరాజయాన్ని చవిచూసింది.

09/24/2017 - 00:14

ఢిల్లీ, సెప్టెంబర్ 23: ప్రో కబడ్డీలో భాగంగా శనివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌పై బెం గాల్ వారియర్స్ జటుట 33-29 పా యంట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. ఆరంభంలో విఫలమైన బెం గళూరు చివరిలో ఎదురుదాడి చేసినా ఫలితం లేకపోయంది. మరో మ్యాచ్ లో పునేరీ పల్టన్ 34-29 తేడాతో దబాంగ్ ఢిల్లీని ఓడించింది.

09/22/2017 - 23:30

కొచ్చి చేరిన ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ ట్రోఫీ. జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం కన్నుల పండుగా జరిగిన ఒక కార్యక్రమంలో కేరళ క్రీడాశాఖ మంత్రి ఎసి మోయిదీన్ ఈ ట్రోఫీని ఆవిష్కరించాడు. పలువురు అభిమానులు, క్రీడాకారులు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దేశంలోని వివిధ నగరాల్లో ఈ ట్రోఫీని ఫుట్‌బాల్ అభిమానుల కోసం ప్రదర్శిస్తారు.

09/22/2017 - 23:28

కోల్‌కతా, సెప్టెంబర్ 22: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ‘్ఫఫా’ ఆధ్వర్యంలో జరిగే అండర్-17 వరల్డ్ కప్ తర్వాత భారత జట్టుకు ఐ-లీగ్‌లో చోటు కల్పించడమేగాక, ఢిల్లీని హోం గ్రౌండ్ చేసే అవకాశాలున్నాయి. వచ్చేనెల మొదటి వారంలో జరిగే సమావేశంలో ఈ విషయంపై అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్‌ఎఫ్) ఒక నిర్ణయాన్ని తీసుకుంటుంది. ఈ ఏడాది అండర్-17 వరల్డ్ కప్ టోర్నీకి భారత్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే.

09/22/2017 - 23:27

కోల్‌కతా, సెప్టెంబర్ 22: విదేశాల్లో ఆస్ట్రేలియా గత పది మ్యాచ్‌ల్లోనూ పరాజయాలను ఎదుర్కోవడం ఆ జట్టు పతనానికి నిదర్శనం. మ్యాచ్‌లకు ముందు వేసుకున్న వ్యూహాలుగానీ, తీసుకున్న నిర్ణయాలుగానీ సక్రమంగా అమలు కావడం లేదని భారత్‌తో జరిగిన రెండు వనే్డలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయాన్ని ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా అంగీకరిస్తున్నాడు.

09/22/2017 - 23:26

కరాచీ, సెప్టెంబర్ 22: ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు ఆడకుండా మొండి చేయి చూపిస్తున్న భారత్ నుంచి కనీసం మిలియన్ డాలర్ల నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ వివాదాల పరిష్కార కమిటీ (డిఆర్‌సి)కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అప్పీల్ చేసింది. ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య 2015 నుంచి 2023 మధ్య కాలానికి ఒక ఒప్పందం కుదిరింది.

09/22/2017 - 23:25

టోక్యో, సెప్టెంబర్ 22: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ సింగిల్స్ విభాగాల్లో భారత్ పోరుకు తెరపడింది. అయితే, మిక్స్‌డ్ డబుల్స్‌లో మాత్రం భారత్ టైటిల్ వేట కొనసాగుతున్నది. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, పివి సింధు పరాజయాలను ఎదుర్కొగా, శుక్రవారం పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్ కూడా వారి దారినే అనుసరించారు.

Pages