S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/22/2017 - 23:23

ముంబయి, సప్టెంబర్ 22: కోల్‌కతాలో వచ్చేనెల 17న అట్లాటికో డి కోల్‌కతా (ఎటికె), నిరుటి రన్నరప్ కేరళ బ్లాస్టర్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ నాలుగో సీజన్ మొదలవుతుంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం మీద 10 జట్ల మధ్య 95 మ్యాచ్‌లు జరుగుతాయి. గతం లో ఎనిమిది జట్లతోనే ఈ టోర్నమెంట్‌ను నిర్వ హించారు.

09/22/2017 - 23:22

ముంబయిలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సిసిఐ)లో బిసిసిఐ మాజీ అధ్యక్షుడు రాజ్ సింగ్ దుంగార్పూర్ పేరుతో ఒక స్టాండ్‌ను శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరిస్తున్న భారత మాజీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్

09/22/2017 - 23:20

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: ఢిల్లీ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ ఎంపికయ్యాడు. గౌతం గంభీర్ కెప్టెన్సీ నుంచి వైదొగలడంతో, రంజీ తదితర టోర్నీల్లో అతని స్థానంలో ఇశాంత్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు.

09/22/2017 - 23:20

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: ప్రో కబడ్డీ లీగ్‌లో భాగంగా శుక్రవారం హోం గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో యు ముంబాను ఢీకొన్న దబాంగ్ ఢిల్లీ పరాజయాన్ని ఎదుర్కొంది. అయితే, ఈ మ్యాచ్ చివరి వరకూ హోరాహోరీగా సాగింది. యు ముంబా 30 పాయింట్లు చేయగా, శక్తి వంచన లేకుండా పోరాడిన ఢిల్లీ 28 పాయింట్లు సాధించగలిగింది. ఢిల్లీ తరఫున అబుఫజల్ ఆరు, రోహిత్ బలియన్, మిరాజ్ షేక్, సునీల్ తలా నాలుగు చొప్పున పాయింట్లు సంపాదించారు.

09/22/2017 - 23:19

భారత క్రికెట్‌ను ఒక గొప్ప ఆటగాడిగా, కెప్టెన్‌గా శాసిస్తున్నది విరాట్ కోహ్లీ అన్నది అందరికీ తెలిసిన సత్యం. అయితే, దేశంలోని చాలా నగరాల్లో ఇప్పటికీ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంటేనే విపరీతమైన క్రేజ్ ఉంది. అతనికి ఉన్న డిమాండ్ అంతా ఇంతాకాదు. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వనే్డ ఇంటర్నేషనల్స్‌లో స్టాండ్స్ అన్నీ కిక్కిరిసిపోవడానికి ధోనీ రాకనే ప్రధాన కారణం.

09/22/2017 - 23:18

విజయవాడ, సెప్టెంబర్ 22: అర్జున అవార్డు గ్రహీత, టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్ శుక్రవారం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని వెలగపూడి సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిశాడు. సాకేత్‌ను మంత్రులు కామినేని, గంటా శ్రీనివాసరావు కలిసి సిఎం వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సాకేత్‌కు 75 లక్షల రూపాయల నజరానా ముఖ్యమంత్రి ప్రకటించారు.

09/22/2017 - 00:56

కోల్‌కతా, సెప్టెంబర్ 21: ఆస్ట్రేలియాతో గురువారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన రెండో వనే్డను కూడా కైవసం చేసుకున్న భారత జట్టు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌పై 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ‘చైనామన్’ బౌలర్ కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్‌తో రాణించి, భారత్‌కు 50 పరుగుల తేడాతో విజయాన్ని సాధించిపెట్టాడు. 253 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన ఆస్ట్రేలియా 43.1 ఓవర్లలో 202 పరుగులకే కుప్పకూలింది.

09/22/2017 - 00:51

వనే్డల్లో హ్యాట్రిక్ సాధించిన 43వ బౌలర్‌గా రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన కుల్దీప్ యాదవ్ భారత్ తరఫున ఈ ఫీట్‌ను ప్రదర్శించిన మూడో బౌలర్‌గా గుర్తింపు సంపాదించాడు. 1987 అక్టోబర్ 31న న్యూజిలాండ్‌తో నాగపూర్‌లో జరిగిన వనే్డలో చేతన్ శర్మ భారత్ తరఫున మొదటి హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు.

09/22/2017 - 00:50

కోల్‌కతా, సెప్టెంబర్ 21: భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఔట్‌పై కొంత సేపు హైడ్రామా నడిచింది. చివరికి అంపైర్ అతనిని నాటౌట్ ప్రకటించడంతో, గందరగోళానికి తెరపడింది. విషయానికి వస్తే, కేన్ రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో గుడ్‌లెన్త్‌లో వచ్చిన బంతిని ఆడడంలో పాండ్య విఫలమయ్యాడు. బ్యాట్‌ను ముద్దాడుతూ బంతి నేరుగా పాయింట్ స్థానంలో ఫీల్డింగ్ చేస్తున్న స్టీవ్ స్మిత్ చేతుల్లో పడింది.

09/22/2017 - 00:48

భారత్ ఇన్నింగ్స్: అజింక్య రహానే రనౌట్ 55, రోహిత్ శర్మ సి అండ్ బి నాథన్ కౌల్టర్ నైల్ 7, విరాట్ కోహ్లీ బి నాథన్ కౌల్టర్ నైల్ 92, మనీష్ పాండే బి అష్టన్ అగర్ 3, కేదార్ జాధవ్ సి గ్లేన్ మాక్స్‌వెల్ బి నాథన్ కౌల్టర్ నైల్ 24, మహేంద్ర సింగ్ ధోనీ సి స్టీవెన్ స్మిత్ బి కేన్ రిచర్డ్‌సన్ 5, హార్దిక్ పాండ్య సి డేవిడ్ వార్నర్ బి కేన్ రిచర్డ్‌సన్ 20, భువనేశ్వర్ కుమార్ సి గ్లేన్ మాక్స్‌వెల్ బి కేన్ రిచర్డ్‌సన్

Pages