S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/22/2017 - 00:48

టోక్యో, సెప్టెంబర్ 21: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్స్ చేరుకోగా, మహిళల సింగిల్స్‌లో సూపర్ స్టార్లు సైనా నెహ్వాల్, పివి సింధు రెండో రౌండ్‌లో పరాజయాలను ఎదుర్కొని నిష్క్రమించారు. ప్రణయ్ తన రెండో రౌండ్ మ్యాచ్‌లో హూ జెన్ హవోను 21-16, 23-21 తేడాతో ఓడించాడు.

09/22/2017 - 00:47

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: తమ ఆదేశాలను పాటించి, వెంటనే కొత్త నిబంధనావళిపై స్పందించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)ని సుప్రీం కోర్టు హెచ్చరించింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నిబంధనావళిని మార్చక తప్పదని, దీనిపై సరైన సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నాయకత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసని స్పష్టం చేసింది.

09/20/2017 - 23:42

శ్రీలంక జట్టును అదృష్టం వరించింది. భారత్‌తో జరిగిన వనే్డ సిరీస్‌లో కనీసం రెండు మ్యాచ్‌లను గెల్చుకొని ఉంటే వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌కు నేరుగా అర్హత సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ, 0-5 తేడాతో పరాజయాన్ని చవిచూసి, పరిస్థితిని సంక్లిష్టం చేసుకున్న విషయం తెలిసిందే. దీనితో క్వాలిఫయర్స్‌లో ఆడడం ద్వారా వరల్డ్ కప్‌లో ఆడే అవకాశాన్ని దక్కించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

09/20/2017 - 23:39

అర్జెంటీనా సాకర్ స్టూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ నాలుగు గోల్స్‌తో విజృంభించడంతో, స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్ లా లిగాలో బార్సిలోనా 6-1 తేడాతో ఇబార్‌ను చిత్తుచేసింది. ఈ విజయం తర్వాత బార్సిలోనా తన సమీప ప్రత్యర్థి రియల్ మాడ్రిడ్ కంటే ఏడు పాయింట్లు ఆధిక్యంతో, నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. మ్యాచ్ 20వ నిమిషంలో మెస్సీ తొలి గోల్ చేసి, బార్సిలోనా ఖాతా తెరిచాడు.

09/20/2017 - 23:39

పెర్త్‌లో జరిగే ఆస్రేటలియా హాకీ లీగ్ (ఎహెచ్‌ఎల్)లో పాల్గొనే 18 మంది సభ్యులతో కూడిన భారత 3ఎ2 జట్టుకు గోల్‌కీపర్ వికాస్ దహియా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈనెల 28 నుంచి టోర్నీ మొదలవుతుంది. అందుబాటులో ఉన్న సమర్థులైన ఆటగాళ్లతో, బలమైన జట్టును పంపేందుకు కృషి చేసినట్టు హాకీ ఇండియా (హెచ్‌ఐ) ఒక ప్రకటనలో తెలిపింది.

09/21/2017 - 21:36

వర్షం కారణంగా అవుట్ ఫీల్డ్ బురదమయంగా మారడంతో, బుధవారం ప్రాక్టీస్ సెషన్ రద్దయింది. దీనితో ఆస్ట్రేలియా క్రికెటర్లు కొంత సేపు ఇండోర్ ప్రాక్టీస్‌ను కొనసాగించగా, భారత ఆటగాళ్లు రొటీన్ వామప్‌కు పరిమితమయ్యారు. ఇలావుంటే, గురువారం నాటి మ్యాచ్‌ని వర్షం వెంటాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చెన్నైలో జరిగిన మొదటి వనే్డకు కూడా వర్షం వల్ల ఇబ్బందులు తలెత్తిన విషయం తెలిసిందే.

మరో విజయం భారత్ లక్ష్యం

09/21/2017 - 21:57

ఇక్కడ జరుగుతున్న జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్లు ముందంజ వేశారు. సుమారు వారం విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ మ్యాచ్‌ల్లో పాల్గొంటున్న సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ తమతమ మొదటి రౌండ్ మ్యాచ్‌లను సులభంగానే గెల్చుకున్నారు. ఇటీవలే కొరియా ఓపెన్ టైటిల్‌ను అందుకున్న తెలుగు తేజం పివి సింధు కూడా మొదటి రౌండ్‌లో విజయం సాధించింది.

09/20/2017 - 23:31

బ్యాట్స్‌మన్ ఖలీద్ లతీఫ్‌పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఐదేళ్ల సస్పెన్షన్ వేటు వేసింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్‌ఎల్)లో ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న లతీఫ్‌ను పిసిబి తొలుత తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. విచారణ కమిటీ అతనిని దోషిగా తేల్చడంతో, ఐదేళ్ల వేటును పిసిబి ఖాయం చేసింది. మరో బ్యాట్స్‌మన్ షర్జీల్ ఖాన్‌ను పిసిబి ఇప్పటికే ఐదేళ్లు క్రికెట్ నుంచి నిషేధించింది.

09/20/2017 - 23:30

ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ కెరీర్‌లో వందో వనే్డ ఇంటర్నేషనల్ ఆడనున్నాడు. లెగ్ బ్రేక్ బౌలర్‌గా జట్టులోకి అడుగుపెట్టిన స్మిత్ ఇప్పటి వరకూ 99 వనే్డలు ఆడాడు. 3,188 పరుగులు సాధించాడు. అతని అత్యధిక స్కోరు 164 పరుగులు. ఎనిమిది సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు సాధించాడు. 271 ఫోర్లు, 30 సిక్సర్లు కొట్టాడు. 1,046 బంతలు వేసి, 931 పరుగులిచ్చిన అతను 27 వికెట్లు పడగొట్టాడు.

09/21/2017 - 22:23

ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ని కోల్పోయినప్పటికీ, మిగతా మ్యాచ్‌ల్లో భారత్‌కు గట్టిపోటీనిస్తామని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ ధీమా వ్యక్తం చేశాడు. అంతకు ముందు కురిసిన వర్షం కారణంగా అవుట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో, పిచ్ తీరును అతను పరిశీలించాడు. ఈడెన్ గార్డెన్స్ చీఫ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీతో కొద్దిసేపు ముచ్చటించాడు.

Pages