S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/16/2017 - 00:57

చెన్నై, సెప్టెంబర్ 15: అనారోగ్యంతో బాధపడుతున్న భార్యకు సేవలు అందించేందుకు ఆస్ట్రేలియాతో జరిగే మొదటి మూడు వనే్డల నుంచి వైదొలగిన ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో అజింక్య రహానే ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని మరో ఓపెనర్, జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ పిటిఐతో మాట్లాడుతూ సూచన ప్రాయంగా తెలిపాడు.

09/16/2017 - 00:54

డెన్ బొచ్ (నెదర్లాండ్స్), సెప్టెంబర్ 15: యూరోప్ టూర్‌లో ఉన్న భారత మహిళల జట్టు లేడీస్ డెన్ బొచ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో 1-3 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఇరీన్ వాన్ డెన్ అసెమ్ రెండు గోల్స్ చేసి డెన్ బొచ్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇమ్కే హొయేక్ ద్వారా ఆ జట్టుకు మూడో గోల్ లభించింది. భారత్ తరఫున నవ్‌దదీప్ కౌర్ మాత్రమే గోల్ చేయగలిగింది.

09/16/2017 - 00:54

చెన్నై, సెప్టెంబర్ 15: సుమంత్ (77 నాటౌట్), రోహిత్ రాయుడు (47 నాటౌట్) సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో, తమిళనాడు క్రికెట్ సంఘం (టిఎన్‌సిఎ) ప్రెసిడెంట్స్ ఎలెవెన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచిన హైదరాబాద్ బుచ్చిబాబు టోర్నమెంట్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

09/16/2017 - 00:53

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: తనకు ఎవరూ గాడ్ ఫాదర్ లేడని, అందుకే టీమిండియా కోచ్ పదవి రాలేదని భారత మాజీ ఓపెనర్ వీరేందర్ సెవాగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇకపై ఎప్పుడూ కోచ్ పదవికి దరఖాస్తు చేయనని ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెవాగ్ స్పష్టం చేశాడు. అనిల్ కుంబ్లే స్థానంలో కొత్త కోచ్‌ని ఎంపిక చేయడానికి బిసిసిఐ దరఖాస్తులు ఆహ్వానించినప్పుడు సెవాగ్ తొలుత ఆసక్తి చూపలేదు.

09/16/2017 - 00:52

లాహోర్, సెప్టెంబర్ 15: చాలాకాలం తర్వాత స్వదేశంలో జరిగిన టి-20 ఇంటర్నెషనల్ సిరీస్‌ను పాకిస్తాన్ కైవసం చేసుకుంది. వరల్డ్ ఎలెవెన్‌తో శుక్రవారం జరిగిన చివరి, మూడో మ్యాచ్‌లో ఈ జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. 20 ఓవర్లలో 4 వికెట్లకు 183 పరుగులు సాధించిన పాక్ ఆతర్వాత ప్రత్యర్థిని 20 ఓవర్లలో 8 వికెట్లకు 150 పరుగుల వద్ద కట్టడి చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది.

09/16/2017 - 00:52

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: టోక్యో ఒలింపిక్స్‌తోపాటు ఆసియా క్రీడలు, కామనె్వల్త్ గేమ్స్‌కు ప్రత్యేక శిక్షణ పొందుతున్న అథ్లెట్లకు ఖర్చుల కింద నెలకు 50,000 రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం’ (టాప్) పేరుతో వివిధ రంగాల్లో సమర్థులైన క్రీడాకారులను ఎంపిక చేసి, వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్న విషయం తెలిసిందే.

09/16/2017 - 00:51

ముంబయి, సెప్టెంబర్ 15: మహారాష్ట్ర మిషన్ వన్ మిలియన్ కార్యక్రమం శుక్రవారం ఉత్సాహంగా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మంది విద్యార్థులు ఫుట్‌బాల్ ఆడే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించారు. ముంబయ జింఖానాలో ‘డబ్బావాలా’లు ఉత్సాహంగా ఫుట్‌బాల్ ఆడి అందరినీ ఆకట్టుకున్నారు.

09/16/2017 - 00:49

ఎడ్మాంటన్ (కెనడా), సెప్టెంబర్ 15: కెనడాతో జరిగే డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్‌లో భారత్‌కు కఠిన పరీక్ష తప్పేటట్టు లేదు. 18 ఏళ్ల సంచలన ఆటగాడు డెనిస్ షపొవలోవ్‌ను తొలి పరీక్షలో యుకీ భంబ్రీ ఎంత వరకూ నిలువరిస్తాడరన్నది అనుమానమే. రాంకుమార్ రామనాథన్ తన తొలి మ్యాచ్‌లో 22 ఏళ్ల బ్రేడన్ షనర్‌తో తలపడతాడు. ఈ మ్యాచ్‌లో రాంకుమార్ గెలిచినా, రివర్స్ సింగిల్స్‌లో అతను షపొవలోవ్‌ను ఎదుర్కోవాలి.

09/16/2017 - 00:49

రాంచీ, సెప్టెంబర్ 16: ప్రో కబడ్డీ లీగ్‌లో భాగంగా శుక్రవారం ఇక్కడి హరివంశ్ తానా భగత్ ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పాట్నా పైరేట్స్ అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించి, తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. ఆ జట్టు 46 పాయింట్లు సంపాదించగా, టైటాన్స్‌కు 30 పాయింట్లు దక్కాయి.

09/14/2017 - 23:23

సియోల్, సెప్టెంబర్ 14: ఇటీవల జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రజత పతకాన్ని సాధించిన తెలుగు తేజం పివి సింధు ఇక్కడ జరుగుతున్న కొరియా సూపర్ సిరీస్ మహిళల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్స్ చేరింది. పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. రెండో రౌండ్‌లో సింధు 22-20, 21-17 తేడాతో థాయిలాండ్‌కు చెందిన నిచవోన్ జిందాపోల్‌ను ఓడించింది.

Pages