S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/24/2017 - 02:24

పల్లేకల్: నిర్లక్ష్యంగా షాట్లు కొట్టకుండా, జాగ్రత్తగా ఆడాలని శ్రీలంక కెప్టెన్ ఉపుల్ తరంగ తన సహచరులకు సూచించాడు. భారత్‌తో జరిగిన మొదటి వనే్డలో లంక ఒకానొక దశలో వికెట్ నష్టానికి 139 పరుగులు చేసింది. కానీ, ఆతర్వాత 77 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. బ్యాట్స్‌మెన్ క్రీజ్‌లో నిలదొక్కుకోవాలని, అనంతరం షాట్లకు ప్రయత్నించాలని బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ హితవు పలికాడు.

08/24/2017 - 02:24

గ్లాస్గో: ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో భారత స్టార్లు సైనా నెహ్వాల్, సాయి ప్రణీత్ ముందంజ వేశారు. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని, 2015 ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రజతాన్ని అందుకున్న 27 ఏళ్ల సైనా మహిళల మూడో రౌండ్‌లో స్విస్ క్రీడాకారిణి సబ్రినా జాక్వెట్‌ను 21-11, 21-12 కేవలం 33 నిమిషాల్లో ఓడించింది. మొదటి రౌండ్‌లో బై లభించిన ఆమెకు ఇది రెండో విజయం.

08/24/2017 - 02:23

లక్నో: ప్రో కబడ్డీలో బుధవారం యుపి యోద్ధ, తమిళ తలైవాస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండు జట్లు చెరి 33 పాయింట్లు చేశాయి. రిషాంక్ దేవాడిగ ఒంటరి పోరాటంతో 16 పాయింట్లు సాధించడంతో యోద్ధ జట్టు ఓటమి ప్రమాదం నుంచి బయటపడి, మ్యాచ్‌ని డ్రాగా ముగించింది. నితిన్ తోమర్ నాలుగు పాయింట్లు చేశాడు. తలైవాస్ తరఫున అజయ్ ఠాకూర్ 10, అమిత్ హూడా 6 చొప్పున పాయింట్లు సాధించారు.

08/24/2017 - 02:22

న్యూఢిల్లీ: ఐరోపా పర్యటనకు వెళుతున్న భారత మహిళల హాకీ జట్టుకు ఫార్వర్డ్ క్రీడాకారిణి రాణి నాయకత్వం వహిస్తుంది. గోల్‌కీపర్ సవిత వైస్-కెప్టెన్‌గా సేవలు అందిస్తుంది. సవితకు స్టాండ్‌బైగా రజని ఎటిమర్పును సెలక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. మిడ్‌ఫీల్డ్‌లో నమిత టొప్పో, నిక్కీ ప్రధాన్, మోనికా తదితరులు ఉంటారు. ఫార్వర్డ్ విభాగంలో రాణితోపాటు పూనమ్ రాణి, వందనా కటారియా, రీనా ఖొకర్ తదితరులు ఉన్నారు.

08/23/2017 - 02:05

న్యూఢిల్లీ, ఆగస్టు 22: కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఈ ఏడాది పారా అథ్లెట్ దేవేంద్ర జఝరియా, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్‌లను ప్రతిష్ఠాత్మక క్రీడా పురస్కారమైన ‘రాజీవ్ ఖేల్ రత్న’ అవార్డుతో సత్కరించాలని నిర్ణయించింది. మాజీ ఒలింపియన్లతో పాటు అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ అవార్డు విజేతలతో కూడిన సెలెక్షన్ కమిటీ సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

08/23/2017 - 02:03

న్యూయార్క్, ఆగస్టు 22: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన బెలారస్ క్రీడాకారిణి విక్టోరియా అజరెన్కా (28) ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభమయ్యే యుఎస్ ఓపెన్ టోర్నమెంట్ నుంచి వైదొలిగింది. కుమారుడి సంరక్షణ విషయమై మాజీ భర్తతో తలెత్తిన వివాదాన్ని ఆమె పరిష్కరించుకోలేకపోవడమే ఇందుకు కారణం.

08/23/2017 - 02:02

న్యూఢిల్లీ, ఆగస్టు 22: ప్రభుత్వం ప్రతి సంవత్సరం అర్జున అవార్డులు ప్రకటించడం ద్వారా ఆ అవార్డు గౌరవ ప్రతిష్ఠలను దిగజార్చుతోందని, గతంలో అర్జున అవార్డును అందుకున్న పలువురు మాజీ క్రీడాకారులు అభిప్రాయ పడ్డారు.

08/23/2017 - 02:01

గ్లాస్గో, ఆగస్టు 22: ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో ‘తెలుగు తేజం’ పివి.సింధు ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన సింధు మంగళవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ పోరులో కొరియా క్రీడాకారిణి కిమ్ హ్యో మిన్‌ను వరుస గేముల తేడాతో మట్టికరిపించింది.

08/23/2017 - 01:59

న్యూహెవెన్, ఆగస్టు 22: మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే యుఎస్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌కు సిద్ధమవుతున్న చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి పెట్రా క్విటోవాకు న్యూహెవెన్‌లో జరుగుతున్న కనెక్టికట్ ఓపెన్ టోర్నీలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

08/23/2017 - 01:57

పారిస్, ఆగస్టు 22: పారిస్‌లో జరుగుతున్న ప్రపంచ రెజిలింగ్ చాంపియన్‌షిప్స్‌లో మన దేశానికి చెందిన గ్యానేందర్ గ్రీకోరోమన్ విభాగంలో కాంస్య పతకంకోసం జరిగే ప్లే ఆఫ్ స్థానానికి అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. గ్రీకో రోమ్ 59 కెజిల కేటగిరీలో రెపెచేజ్ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం లభించింది. అయితే రెండో రౌండ్‌లో పరాజయం పాలవడం ద్వారా ఆ సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నాడు.

Pages