S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/23/2017 - 01:57

న్యూఢిల్లీ, ఆగస్టు 22: భారత మహిళా ఫుట్‌బాల్ జట్టుకు ఎనలేని సేవలందించి రెండు దశాబ్దాలు పైగా ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించిన ఒయినమ్ బెంబెం దేవి మంగళవారం తనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అర్జున అవార్డును దేశంలో సామాజిక సమస్యలపై పోరాడేందుకు ప్రయత్నిస్తున్న మహిళలకు అంకితమిచ్చింది.

08/22/2017 - 01:10

దంబుల్లా, ఆగస్టు 21: కెరీర్‌లో ఎదుర్కొన్న వైఫల్యాలే తనకు ఎన్నో పాఠాలు నేర్పాయని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు.

08/22/2017 - 01:08

గ్లాస్గో, ఆగస్టు 21: గతం కంటే ఈసారి ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో మెరుగైన ఫలితాన్ని సాధించడమే లక్ష్యమని, ఇందు కోసం పోరాటం సాగిస్తానని తెలుగు తేజం, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పివి సింధు అన్నది. మహిళల సింగిల్స్ మొదటి రౌండ్‌లో సైనా నెహ్వాల్‌తోపాటు బై లభించిన సింధు సోమవారం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ మెగా టోర్నీలో రెండు పర్యాయాలు కాంస్య పతకాలను సాధించిన విషయాన్ని గుర్తుచేసింది.

08/22/2017 - 01:07

గ్లాస్గో, ఆగస్టు 21: ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ మొదటి రౌండ్‌ను సులభంగా అధిగమించి, ముందడుగు వేశాడు. పురుషుల సింగిల్స్‌లో రష్యాకు చెందిన సెర్గీ సిరాంత్‌ను ఢీకొన్న అతను 21-13, 21-12 తేడాతో విజయం సాధించాడు. ఇటీవల మంచి ఫామ్‌ను కొనసాగిస్తున్న అతను టైటిల్‌ను అందుకునే సత్తా తనకు ఉందని తొలి రౌండ్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచడం ద్వారా నిరూపించుకున్నాడు.

08/22/2017 - 01:05

దంబుల్లా, ఆగస్టు 21: జట్టు వ్యవహారాల్లో బయటి వ్యక్తుల జోక్యం విపరీతంగా ఉందని, భారత్‌తో ఆదివారం జరిగిన మొదటి వనే్డలో తొమ్మిది వికెట్ల తేడాతో పరాజయాన్ని ఎదుర్కోవడానికి ఇదే ప్రధాన కారణమని శ్రీలంక తాత్కాలిక కోచ్ నిక్ పోథాస్ అన్నాడు.

08/22/2017 - 01:03

న్యూఢిల్లీ, ఆగస్టు 21: అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు కోచ్‌గా కొనసాగేందుకు ప్రాణాలను పణంగా పెట్టలేనని భారత మాజీ క్రికెటర్ లాల్‌చంద్ రాజ్‌పుత్ వ్యాఖ్యానించాడు. గత ఏడాది జూన్ మాసంలో ఇంజమాముల్ హక్ నుంచి అతను అఫ్గాన్ చీఫ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఆ తర్వాతే ఆ జట్టుకు టెస్టు హోదా లభించింది. రాజ్‌పుత్ కాంట్రాక్టు ఈనెలతో ముగుస్తుంది.

08/22/2017 - 01:02

పారిస్, ఆగస్టు 21: సాకర్ చరిత్రలోనే అత్యధిక ఫీజుకు బార్సిలోనా నుంచి పారిస్ సెయింట్ జెర్మెయిన్ (పిఎస్‌జి)కి తరలివెళ్లిన నేమార్ ఇప్పుడు తన పాత జట్టు డైరెక్టర్లపైనే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాడు. లీగ్-1 టోర్నమెంట్‌లో భాగంగా టౌలోస్‌తో జరిగిన మ్యాచ్‌లో నేమార్ రెండు గోల్స్ సాధించి, 6-2 తేడాతో పిఎస్‌జి విజయం సాధించడంలో ప్రధాన భూమిక పోషించాడు.

08/22/2017 - 01:01

బార్సిలోనా, ఆగస్టు 21: స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్ లా లిగాలో 25వ టైటిల్ కోసం పోటీపడుతున్న బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్ శుభారంభం చేసింది. రియల్ బెటిస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ని 2-0 తేడాతో గెల్చుకుంది. ఆరంభంలో ఎంతో జాగ్రత్తగా ఆడుతూ, ప్రత్యర్థికి దాడిచేసే అవకాశం ఇవ్వని బార్సిలోనాకు 36వ నిమిషంలో తొలి గోల్ లభించింది. బెటిస్ ఆటగాడు అలిన్ టోస్కా సెల్ఫ్ గోల్ చేసి, బార్సిలోనా ఖాతాను తెరిచాడు.

08/21/2017 - 01:26

దంబుల్లా, ఆగస్టు 20: మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో శ్రీలంకపై 3-0 తేడాతో క్లీన్ స్వీప్ సాధించిన విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా వనే్డ సిరీస్‌లో బోణీ చేసింది. ఆదివారం జరిగిన మొదటి వనే్డను మరో 127 బంతులు మిగిలి ఉండగానే, తొమ్మిది వికెట్ల తేడాతో సొంతం చేసుకుంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో, తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 43.2 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది.

08/21/2017 - 01:23

గ్లాస్గో, ఆగస్టు 20: స్కాట్‌లాండ్‌లోని గ్లాస్గోలో సోమవారం నుంచి జరగనున్న ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో భారత సూపర్ స్టార్ సైనా నెహ్వాల్ కోసం సంక్లిష్టమైన డ్రా ఎదురుచూస్తున్నది. బలమైన ప్రత్యర్థులను ఆమె ఎదుర్కోనుంది. మరో స్టార్ క్రీడాకారిణి పివి సింధుతోపాటు సైనాకు కూడా మొదటి రౌండ్‌లో బై లభించింది.

Pages