S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/21/2017 - 01:20

గ్లాస్గో: మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, పివి సింధుకు మొదటి రౌండ్‌లో బై లభించడంతో, రెండో రౌండ్‌లో వారి ప్రత్యర్థులు ఖరారు కాలేదు. కాగా, ఇదే విభాగంలో సోమవారం మొదటి రోజున రితుపర్ణ దాస్ తన తొలి రౌండ్‌లో మ్యాచ్‌ని అరి మిక్కెలాతో ఆడుతుంది. చోల్ బిర్చ్‌తో తన్వీ లాడ్ తలపడుతుంది. కాగా, పురుషుల విభాగంలో స్టార్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్‌లో సెర్గీ సిరాంట్‌ను ఢీ కొంటాడు.

08/21/2017 - 01:19

సిన్సినాటి ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించిన మార్టినా హింగిస్, చాన్ జువాన్ జాన్ జోడీ. ఫైనల్‌లో వీరు హీస్ సూవెయ్, మోనికా నికలెస్క్యూ జోడీని 4-6, 6-4, 10-7 తేడాతో ఓడించారు. కాగా, పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో నిక్ కిర్గియోస్, గ్రిగర్ దిమిత్రోవ్ మధ్య జరుగుతుంది.

08/21/2017 - 01:17

ఎడ్జిబాస్టన్, ఆగస్టు 20: వెస్టిండీస్‌తో ఇక్కడ జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌ని ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 209 పరుగుల భారీ తేడాతో గెల్చుకుంది. బ్యాటింగ్‌లో ఏమాత్రం ప్రతిభ కనబరచలేకపోయిన విండీస్ రెండు ఇన్నింగ్స్‌లోనూ తక్కువ స్కోర్లకే చేతులెత్తేయడంతో, ఐదు రోజుల మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసింది.

08/21/2017 - 01:17

ఎడ్జిబాస్టన్: వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో స్టువర్ట్ బ్రాడ్ విజృంభణ ఇంగ్లాండ్ విజయంలో కీలకంగా మారింది. మొదటి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టిన బ్రాడ్ రెండో ఇన్నింగ్స్‌లో 34 పరుగులకే మూడు వికెట్లు కూల్చాడు. ఇంగ్లాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో ఇయాన్ బోథంను మూడో స్థానానికి నెట్టి, రెండో స్థానాన్ని ఆక్రమించాడు.

08/21/2017 - 01:15

పారిస్, ఆగస్టు 20: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పతకాన్ని సాధించడమే లక్ష్యంగా భారత స్టార్ రెజ్లర్, రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ పోటీలకు సిద్ధమైంది. రియోలో 58 కిలోల విభాగంలో పతకాన్ని సాధించిన సాక్షి ఆతర్వాత 60 కిలోల విభాగానికి మారింది. ఈ ఏడాది మే మాసంలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్స్‌లో 60 కిలోల విభాగంలోనే రజత పతకాన్ని కైవసం చేసుకుంది.

08/20/2017 - 01:05

భారత్, శ్రీలంక జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్ ఆదివారం మొదలుకానున్న నేపథ్యంలో, ఆధిపత్యం ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠగా మారింది. టీమిండియాను హాట్ ఫేవరిట్‌గా పేర్కొంటున్నప్పటికీ, ప్రత్యర్థిని తక్కువ అంచనా వేస్తే ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

08/20/2017 - 01:02

దంబుల్లా, ఆగస్టు 19: శ్రీలంకను మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 3-0 తేడాతో చిత్తుచేసిన విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా మరో వేటకు సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగే మొదటి వనే్డలో హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగనుంది.

08/20/2017 - 00:59

సిన్సినాటి, ఆగస్టు 19: సిన్సినాటి మాస్టర్స్ రోజర్స్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో నిక్ కిర్గియోస్ సంచలనం సృష్టించాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో అతను తాజాగా ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని అందుకున్న రాఫెల్ నాదల్‌ను 6-2, 7-5 తేడాతో ఓడించి సెమీ ఫైనల్ చేరాడు.

08/20/2017 - 00:57

లక్నో, ఆగస్టు 19: వరుస పరాజయాల తర్వాత తెలుగు టైటాన్స్ ఆట మళ్లీ గాడిలో పడింది. అంతర్-మండల చాలెంజ్ కింద శనివారం పటిష్టమైన యు ముంబాతో జరిగిన మ్యాచ్‌ని టైటాన్స్ ఐదు పాయింట్ల తేడాతో గెల్చుకుంది. రాహుల్ చౌదరి 13 పాయింట్లు సాధించి, టైటాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. సోమ్‌వీర్ 8 పాయింట్లు చేయగా, మొత్తం 37 పాయింట్లు సంపాదించిన టైటాన్స్ తన ప్రత్యర్థి యు ముంబాను 32 పాయింట్లకు కట్టడి చేసింది.

08/20/2017 - 00:55

న్యూఢిల్లీ, ఆగస్టు 19: రియో పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన హైజంపర్ తంగవేలు మరియప్పన్‌కు శిక్షనిచ్చిన కోచ్ సత్యనారాయణకు చుక్కెదురైంది. ఈసారి ద్రోణాచార్య అవార్డుకు ప్రతిపాదిత అభ్యర్థుల జాబితా నుంచి కేంద్రం అతని పేరును తొలగించింది. అతనిపై పరువునష్టం కేసు ఒకటి పెండింగ్‌లో ఉందని, అది క్రిమినల్ కేసు కాబట్టి ద్రోణాచార్య అవార్డుకు అతనిని ఎంపిక చేయడం లేదని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

Pages