S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/03/2016 - 00:27

రియో డీ జెనిరో, ఆగస్టు 2: ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు రియో డీ జెనిరో నగరానికి చేరుకున్న భారత హాకీ జట్టు మంగళవారం సన్నాహక మ్యాచ్‌లో 2-1 గోల్స్ తేడాతో స్పెయిన్‌ను మట్టికరిపించింది. అద్భుతమైన ఫీల్డ్ గోల్‌తో ఆకాష్‌దీప్, పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచిన రూపీందర్ పాల్ సింగ్ భారత జట్టుకు ఈ విజయాన్ని అందించారు.

08/03/2016 - 00:26

ముంబయి, ఆగస్టు 2: జస్టిస్ లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయడం వల్ల ఎదురయ్యే సమస్యలను అర్థం చేసుకోవడంలో బోర్డుకు సహకరించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ నేతృత్వంలో నలుగురు సభ్యుల న్యాయ నిపుణుల కమిటీని బిసిసిఐ ఏర్పాటు చేసింది.

08/03/2016 - 00:25

ఇండోర్, ఆగస్టు 2: లోధా కమిటీ సిఫార్సులపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బిసిసిఐ) ఒక నిర్ణయం తీసుంటుందని, దానికి అనుగుణంగా మాత్రమే తాము పని చేస్తామని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ చెప్పారు.

08/02/2016 - 12:47

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని డోపింగ్‌ కేసు నుంచి బయటపడ్డ రెజ్లర్‌ నర్సింగ్‌ యాదవ్‌ మంగళవారం కలిశారు. క్లిష్ట పరిస్థితుల్గో తనకు సహాయ పడ్డ మోదీకి, భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌జీకి నర్సింగ్‌ కృతజ్ఞతలు తెలిపారు. నర్సింగ్‌ దేశానికి పతకాన్ని గెలుచుకు రావాలని ప్రధాని ఆకాంక్షించారు.

08/02/2016 - 02:14

న్యూఢిల్లీ, ఆగస్టు 1: డోపింగ్ కుంభకోణంలో రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌కు ఊరట లభించింది. గత కొద్ది రోజుల నుంచి కొనసాగుతున్న ఈ వివాదానికి జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) సోమవారం ఎట్టకేలకు తెరదించి నర్సింగ్ యాదవ్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో అతను ఈ నెల 5వ తేదీ నుంచి బ్రెజిల్‌లో ప్రారంభమయ్యే రియో ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు మార్గం సుగమమైంది.

08/02/2016 - 02:13

న్యూఢిల్లీ, ఆగస్టు 1: డోపింగ్ వ్యవహారంలో సోమవారం నాడా విచారణ కమిటీ ఇచ్చిన తీర్పు పట్ల రెజ్లర్ నర్సింగ్ యాదవ్ హర్షాన్ని వ్యక్తం చేశాడు. ఇక రియో ఒలింపిక్స్‌కు వెళ్లి దేశానికి పతకాన్ని తీసుకురావాలని ఎదురు చూస్తున్నానని అతను స్పష్టం చేశాడు. ‘నేను ఎటువంటి తప్పు చేయలేదని నాకు తెలుసు. అందుకే న్యాయం జరుగుతుందని గట్టిగా విశ్వసించా. ఇప్పుడు నాడా విచారణ కమిటీ ఇచ్చిన తీర్పుతో నాకు న్యాయం జరిగింది.

08/02/2016 - 02:17

కింగ్‌స్టన్ (జమైకా), ఆగస్టు 1: కరీబియన్లతో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా కింగ్‌స్టన్‌లోని సబీనా పార్క్‌లో జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీతో విజృంభించిన టీమిండియా ఓపెనర్ లోకేష్ రాహుల్ కెరీర్‌లోనే అత్యుత్తమ వ్యక్తిగత స్కోరుతో సత్తా చాటుకున్నాడు.

08/02/2016 - 02:10

ముంబయి, ఆగస్టు 1: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును సమూలంగా ప్రక్షాళన చేసేందుకు జస్టిస్ లోధా కమిటీ చేసిన సిఫారసులను అమలు చేయాలని స్పష్టం చేస్తూ ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చించేందుకు బిసిసిఐ పెద్దలు మంగళవారం ముంబయిలో సమావేశం కానున్నారు.

08/02/2016 - 02:16

న్యూఢిల్లీ, ఆగస్టు 1: డోపింగ్ వ్యవహారంలో నాడా విచారణ కమిటీ సోమవారం నర్సింగ్ యాదవ్‌కు అనుకూలంగా తీర్పు ఇవ్వడం పట్ల భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ తీర్పుతో నర్సింగ్ యాదవ్ రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు మార్గం సుగమమైందని డబ్ల్యుఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పేర్కొన్నాడు.

08/02/2016 - 02:17

న్యూఢిల్లీ, ఆగస్టు 1: డోపింగ్ అభియోగాల నుంచి రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌కు విముక్తి కల్పించి దేశం తరఫున అతను రియో ఒలింపిక్స్ బరిలోకి దిగేందుకు వీలుకల్పించాలని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) సోమవారం తీసుకున్న నిర్ణయాన్ని సహచర రెజ్లర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్టు సుశీల్ కుమార్ స్వాగతించాడు.

Pages