S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/17/2017 - 00:52

మర్దాన్: పాకిస్తాన్‌లో క్వెట్టా బేర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన జుబైర్ అహ్మద్ అనే యువ క్రికెటర్ బౌన్సర్ దెబ్బకు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. నాలుగు ‘లిస్ట్ ఎ’ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న జుబైర్ ఒక మ్యాచ్ ఆడుతూ, బంతి తలకు తలగడంతో గాయపడ్డాడని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అతనిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందాడని వివరించింది.

08/17/2017 - 00:52

అహ్మదాబాద్: ప్రో కబడ్డీ లీగ్‌లో బుధవారం హర్యానా స్టీలర్స్, తమిళ్ తలైవాస్ జట్ల మధ్య చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ ‘టై’గా ముగిసింది. ఇరు జట్లు చెరి 25 పాయింట్లు సాధించాయి. హర్యానా తరఫున సుందన్ నడా 7, సుర్జీత్ సింగ్ 4 పాయింట్లు సాధించారు. తలైవాస్‌కు ప్రభంజన్ 7, అమిత్ హూడా 6 చొప్పున పాయింట్లు అందించారు. అంతర్-మండల చాలెంజ్‌గా ఈ వారం మ్యాచ్‌లు జరుగుతున్నాయి.

08/17/2017 - 00:52

సెయిట్ లూయిస్: సుమారు దశాబ్దకాలం తర్వాత కెరీర్‌ను మళ్లీ కొనసాగించాలని నిర్ణయించుకున్న ప్రపంచ చెస్ మాజీ చాంపియన్ గారీ కాస్పరోవ్ ఇక్కడ జరుగుతున్న ర్యాపిడ్ అండ్ బ్లిడ్జ్ టోర్నమెంట్ రెండో రోజున పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. తొలి రోజు మూడు గేమ్స్ ఆడి, మూడింటినీ డ్రా చేసుకున్న అతను రెండో రోజు మొదటి గేమ్‌ను లెవాన్ అరోనియన్‌తో డ్రాగా ముగించాడు.

08/16/2017 - 00:42

దుబాయ్, ఆగస్టు 15: శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు క్రికెట్ సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించడంతో భారత ఓపెనర్లు లోకేష్ రాహుల్, శిఖర్ ధావన్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మరింత ఉన్నత స్థానాలకు దూసుకెళ్లారు.

08/16/2017 - 00:39

అబుధాబి, ఆగస్టు 15: అబూధాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్‌లో భాగంగా జరుగుతున్న మాస్టర్స్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక విజయంతో తన పోరాటాన్ని ఆరంభించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 9వ స్థానంలో కొనసాగుతున్న హారిక తొలి రౌండ్‌లో మన దేశానికే చెందిన మిథిల్ అజ్గావ్‌కర్‌పై విజయం సాధించింది.

08/16/2017 - 00:37

ప్రిటోరియా, ఆగస్టు 15: దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న భారత-ఏ జట్టు సఫారీలతో జరిగిన తొలి అనధికార టెస్టు క్రికెట్ మ్యాచ్‌లో ఘోరంగా చతికిలబడింది. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమై 235 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 447 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత-ఏ జట్టు 211 పరుగులకే ఆలౌటవడంతో ఈ పరాభవం తప్పలేదు.

08/16/2017 - 00:35

కొచ్చి, ఆగస్టు 15: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఆరో ఎడిషన్ ట్వంటీ-20 టోర్నమెంట్‌లో స్పాట్-్ఫక్సింగ్‌కు పాల్పడ్డాడన్న అభియోగాలతో అప్రతిష్ఠను మూటగట్టుకుని ఆ తర్వాత కేరళ హైకోర్టులో ఊరట పొందిన క్రికెటర్ శ్రీశాంత్ మళ్లీ బరిలోకి దిగాడు. మళయాల చిత్ర పరిశ్రమ సభ్యులతో కలసి మంగళవారం అతను అనధికార ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆడాడు.

08/16/2017 - 00:33

పల్లెకల్, ఆగస్టు 15: ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టు మంగళవారం అక్కడ దేశ 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. జట్టు సభ్యులందరి సమక్షంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశాడు. తన తండ్రి కూడా ఆగస్టు 15వ తేదీనే జన్మించారని, కనుక చిన్ననాటి నుంచే తనకు ఇది ఎంతో ప్రత్యేకమైన రోజని కోహ్లీ పేర్కొన్నాడు.

08/16/2017 - 00:32

ఆమ్‌స్టర్‌డామ్, ఆగస్టు 15: నెదర్లాండ్స్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌ను భారత పురుషుల జట్టు కైవసం చేసుకుంది. సోమవారం రాత్రి ఇక్కడ ఎంతో ఆసక్తికరంగా జరిగిన చివరి మ్యాచ్‌లో గుర్జంత్ సింగ్, మన్‌దీప్ సింగ్ చెరో గోల్‌తో రాణించి ఆతిథ్య నెదర్లాండ్స్ ఓటమిని శాసించారు.

08/15/2017 - 01:04

పల్లేకల్, ఆగస్టు 14: విరాట్ కోహ్లీ నాయకత్వంలో టీమిండియా భారత టెస్టు క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. సుమారు 85 సంవత్సరాలుగా ఊరిస్తున్న విదేశీగడ్డపై క్లీన్ స్వీప్‌ను సాకారం చేసింది. విదేశాల్లో, మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లతో కూడిన ఒక టెస్టు సిరీస్‌లో ప్రత్యర్థి జట్టుకు టీమిండియా వైట్ వాష్ వేయడం ఇదే మొదటిసారి.

Pages