S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/13/2017 - 00:32

అహ్మదాబాద్, ఆగస్టు 12: ప్రో కబడ్డీ లీగ్‌లో తెలు గు టైటాన్స్ మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. శనివారం యుపి యోద్ధతో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 32-39 తేడాతో ఓడింది. రాహుల్ చౌదరి 12 పాయంట్లతో రాణించగా, రక్షిత్ 6 పాయంట్లు చేశాడు. యుపి యోద్ధ తరఫున నితన్ తోమర్ 10 పాయంట్లు సాధించి, తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషిం చాడు. రిషాంక్ దేవాంగ్ ఆరు, రాజేష్ నర్వాల్ ఐదు చొ ప్పున పాయంట్లు సాధించారు.

08/13/2017 - 00:31

న్యూఢిల్లీ, ఆగస్టు 12: అమెరికా బాస్కెట్‌బాల్ స్టార్ కెవిన్ డ్యూరాంట్ వెనక్కు తగ్గాడు. భారత్ 20 సంవత్సరాలు వెనుకబడి ఉందని చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణలు తెలిపాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో డ్యూరాంట్ మాట్లాడుతూ బాస్కెట్‌బాల్ క్రీడలో మిగతా దేశాలతో పోలిస్తే భారత్ రెండు దశాబ్దాలు వెనుకబడిందని ఎద్దేవా చేశాడు.

08/13/2017 - 00:31

పల్లేకల్, ఆగస్టు 12: ఓపెనర్ శిఖర్ ధావన్ శతకాన్ని, మరో ఓపెనర్ లోకేష్ రాహుల్ హాఫ్ సెంచరీ నమోదు చేయగా, మిడిల్ ఆర్డర్ విఫలం కావడంతో, శ్రీలంకతో శనివారం ఇక్కడ ప్రారంభమైన చివరి, మూడో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లకు 329 పరుగులు సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ధావన్, రాహుల్ చక్కటి ఆరంభాన్నిచ్చారు.

08/12/2017 - 00:45

లండన్, ఆగస్టు 11: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో ఫైనల్ చేరిన తొలి భారతీయుడిగా దవీందర్ సింగ్ కాంగ్ రికార్డు సృష్టించాడు. ఇదే ఈవెంట్‌లో అద్భుతాలు సృష్టిస్తాడనుకున్న నీరజ్ చోప్రా క్వాలిఫయింగ్ రౌండ్ నుంచే వెనుదిరిగాడు. ఫైనల్ చేరేందుకు కనీసం దూరాన్ని 83 మీటర్లుగా నిర్ధారించారు.

08/12/2017 - 00:44

చిత్రం.. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ పురుషుల 400 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించి సంచలనం సృష్టించిన టర్కీ అథ్లెట్ రమిల్ గలియెవ్

08/12/2017 - 00:42

లండన్, ఆగస్టు 11: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ పురుషుల 200, 400 మీటర్ల విభాగాల్లో స్వర్ణ పతకాలను సాధించిన రెండో అథ్లెట్‌గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాలనుకున్న దక్షిణాఫ్రికా రన్నర్ వేడ్ వాన్ నికెర్క్ ఆశలపై టర్కీకి చెందిన రమిల్ గలియెవ్ నీళ్లు చల్లాడు. ఇప్పటికే 200 మీటర్ల పరుగులో టైటిల్ సాధించిన వాన్ నికెర్క్, 400 మీటర్ల పోరులో ఫేవరిట్‌గా బరిలోకి దిగాడు.

08/12/2017 - 00:39

లండన్, ఆగస్టు 11: ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన అత్లెట్ డిబొరా జాన్ గాయపడింది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ మహిళల 100 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్ హీట్స్‌లో పాల్గొన్న 27 ఏళ్ల ఈ సూపర్ అథ్లెట్ బ్యాలెన్స్ తప్పడంతో కిందపడింది. కాలికి బలమైన గాయం కావడంతో, ఆమెను స్ట్రెచర్‌పై తీసుకెళ్లారు. ఆమె మెడ భాగంలోనూ గాయాలు తగినట్టు వైద్యులు ప్రకటించారు.

08/12/2017 - 00:38

నువరా ఎలియా, ఆగస్టు 11: భారత క్రికెటర్లు ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ, ఇశాంత్ శర్మ తదితరులు అశోక వనంలో సందడి చేశారు. రామాయణంలో సీతను చెరబట్టిన రావణుడు ఇదే ప్రాంతంలో ఉంచాడని అంటారు. కుటుంబాలతో సహా ఉమేష్, షమీ, ఇశాంత్ అశోక వాటిను సందర్శించారు. వారి వెంట కుల్దీప్ యాదవ్, లోకేష్ రాహుల్ కూడా ఉన్నారు. సీతా ఎలియా గ్రామంలో ఉన్న ఈ అశోక వనంలోనే సీతా దేవి ఆలయం ఉంది.

08/12/2017 - 00:36

న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఐరోపా పర్యటనలో ఉన్న భారత హాకీ జట్టు వరుసగా రెండో పరాజయాన్ని ఎదుర్కొంది. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం బూమ్‌లో జరిగిన మ్యాచ్‌లో బెల్జియం 3-1 తేడాతో భారత్‌ను ఓడించింది. ఈ టూర్‌లో తొలి మ్యాచ్‌లో ఇదే జట్టు చేతిలో 0-1 తేడాతో పరాజయాన్ని చవిచూసిన భారత జట్టు మరోసారి పేలవమైన ఆటతో అభిమానులను నిరాశపరచింది. మ్యాచ్ ప్రారంభం దూకుడుగా ఆడిన భారత్ ఆతర్వాత నీరసపడింది.

08/12/2017 - 00:36

అహ్మదాబాద్, ఆగస్టు 11: ప్రో కబడ్డీ లీగ్‌లో భాగంగా హోం టౌన్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చ్యూన్‌జెయింట్స్ జట్టు బోణీ చేసింది. ఈ జట్టు 39 పాయింట్లు సంపాదించగా, బలమైన యు ముంబా జట్టు 21 పాయింట్లకే పరిమితమైంది. గుజరాత్ తరఫున రోహిత్ గులియా 9, సచిన్ 8 పాయింట్లతో రాణించారు. అబొజర్ మిధానీ 5, సుకేష్ హెగ్డే 4 చొప్పున పాయింట్లు చేశారు.

Pages