S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/06/2017 - 00:29

నాగపూర్, ఆగస్టు 5: ప్రో కబడ్డీ లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన మొదటి మాయచ్‌లో దబాంగ్ ఢిల్లీని యు ముంబా జట్టు 14 పాయింట్ల తేడాతో ఓడించింది. షబీర్ బప్పు, అనూప్ కుమార్ చెరి ఏడు పాయింట్లు సాధించడంతో ఆ జట్టు 36 పాయింట్లను అందుకోగలిగింది. సురేష్ కుమార్ నాలుగు పాయింట్లతో రాణించాడు. కాగా, దబాంగ్ ఢిల్లీ 22 పాయింట్లకు పరిమితమైంది.

08/06/2017 - 00:29

న్యూఢిల్లీ, ఆగస్టు 5: భారత టెన్నిస్ స్టార్ రోహన్ బొపన్న తన పేరు ఈసారి కూడా అర్జున్ అవార్డుకు ప్రతిపాదించిన పేర్లలో లేకపోవడంతో ఆగ్రహానికి గురయ్యాడు. ఇదేం న్యాయమంటూ వాపోయాడు. అఖిల భారత టెన్నిస్ సమాఖ్య (ఎఐటిఎ) తనకు అన్యాయం చేసిందని ఆరోపించాడు. ఏ ప్రాతిపదికపై ప్రతిపాదనలు పంపించారో అర్థం కావడం లేదని శనివారం ఒక ప్రకటనలో బొపన్న తెలిపాడు.

08/05/2017 - 02:32

కొలంబో, ఆగస్టు 4: ఈ సిరీస్‌లో టీమిండియా వరుసగా రెండోసారి ఆరు వందల పరుగుల మైలురాయిని అధిగమించింది. శ్రీలంకతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌ను తొమ్మిది వికెట్లకు 622 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆతర్వాత మొదటి ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన శ్రీలంక రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లకు 50 పరుగులు చేసింది.

08/05/2017 - 02:30

కొలంబో: అసాధారణ బ్యాటింగ్ నైపుణ్యాన్ని కనబరుస్తూ, అరుదైన మైలురాళ్లను చేరుకుంటున్న బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా టీమిండియా టెస్టు జట్టులో తన స్థానాన్ని ఇప్పటికే పదిలం చేసుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీతో కదం తొక్కిన పుజారా రెండో రోజు ఆటలో తన ఓవర్‌నైట్ స్కోరు 128 పరుగులకు కేవలం ఐదు పరుగులు జోడించి, దిముత్ కరుణరత్నే బౌలింగ్‌లో ఎల్‌బిగా అవుటయ్యాడు.

08/05/2017 - 02:30

కొలంబో: టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆల్‌రౌండర్‌గా తనను తాను మరోసారి నిరూపించుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో అర్ధ శతకంతో రాణించాడు. కెరీర్‌లో 51వ టెస్టు ఆడుతున్న అతనికి ఇది 11వ హాఫ్ సెంచరీ. ఈ క్రమంలోనే అతను టెస్టుల్లో 2,000 పరుగులు పూర్తి చేశాడు.

08/05/2017 - 02:29

నాగపూర్, ఆగస్టు 4: ప్రో కబడ్డీ టోర్నమెం ట్‌లో భాగంగా గురువారం చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో తమి ళ్ తలైవాస్‌ను బెంగళూరు బుల్స్ జట్టు ఒక పాయంట్ తేడాతో ఓడించింది. బెంగళూరు 32 పాయంట్లు సాధించగా, తలైవాస్ 31 పా యంట్లు సంపాదించగలిగింది. బెంగళూరు తరఫున రోహిత్ కుమార్ (11), అమిత్ కు మార్ (6), మహేందర్ సింగ్ (5) రాణించ గా, తలైవాస్ నుంచి ప్రపంజన్ (6), అజయ్ ఠాకూర్ (6) పాయంట్లు రాణించారు.

08/05/2017 - 02:29

అక్లాండ్, ఆగస్టు 4: న్యూజిలాండ్ ఓపెన్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో నాలుగో సీడ్ హెచ్‌ఎస్ ప్రణయ్, సౌరభ్ వర్మ తమతమ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌ల్లో పరాజయాలను ఎదుర్కోవడంతో భారత్ పోరాటానికి తెరపడింది. ప్రణయ్ 10-21, 22-20, 21-23 తేడాతో 11వ సీడ్ లిన్ యూ సీన్ చేతిలో ఓటమిపాలయ్యాడు. సౌరభ్‌ను లీ చుక్ ఇయూ (హాంకాంగ్) 21-19, 21-16 తేడాతో ఓడించాడు.

08/05/2017 - 02:28

న్యూఢిల్లీ, ఆగస్టు 4: టాంపెర్ (్ఫన్లాండ్)లో జరుగుతున్న ప్రపంచ జూనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ మంజూ కుమారి కాంస్య పతకాన్ని సాధించింది. మహిళల 59 కిలోల విభాగంలో పోటీపడిన ఆమె క్లాసిఫికేషన్ ప్లే ఆఫ్ బౌట్‌లో లొనా ప్రొకొపెనుక్ (ఉక్రెయిన్)ను 2-0 తేడాతో ఓడించింది. ఆరంభం నుంచి ప్రత్యర్థిపై విరుచుపడిన మంజు చివరి వరకూ ఆదే ఆధిపత్యాన్ని కొనసాగించి, విజయం సాధించింది.

08/04/2017 - 00:58

న్యూఢిల్లీ, ఆగస్టు 3: క్రీడారంగంలో అద్భుత ప్రదర్శనకు గాను ఇచ్చే దేశ అత్యున్నత పురస్కారమైన ‘ఖేల్ రత్న’ అవార్డు కోసం పారాలింపియన్ దేవేంద్ర ఝజరియా, ప్రముఖ హాకీ క్రీడాకారుడు సర్దార్ సింగ్ పేర్లను సిఫార్సు చేశారు. పారాలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో రెండు స్వర్ణ పతకాలు సాధించిన ఝజారియా ఈ అవార్డుకోసం తమ తొలి చాయిస్ అని కూడా రిటైర్డ్ న్యాయమూర్తి సికె ఠక్కర్ నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీ తెలిపింది.

08/04/2017 - 00:55

కొలంబో, ఆగస్టు 3: శ్రీలంకతో మూడు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా గురువారం ఇక్కడ ప్రారంభమైన రెండో మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మన్ ఛటేశ్వర్ పుజారా వరుసగా మరో సొగసైన అజేయ శతకంతో విజృంభించి ఎర్ర బంతి క్రికెట్ పట్ల తనకు గల మక్కువను చాటుకున్నాడు.

Pages