S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/10/2017 - 01:09

న్యూఢిల్లీ, జూలై 9 తాను ఎవరికీ పోటీదారుడ్ని కానని టీమిండియా కోచ్ పదవి రేసులో ఉన్న మాజీ టెస్టు క్రికెటర్ లాల్ చంద్ రాజ్‌పుత్ స్పష్టం చేశాడు. ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ, తనతోపాటు ఎంతో మంది మాజీ క్రికెటర్లు ఈ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారని అన్నాడు. గతంలో జట్టుకు డైరెక్టర్‌గా సేవలు అందించిన రవి శాస్ర్తీ, మాజీ ఓపెనర్ వీరేందర్ సెవాగ్ మధ్య పోటీ తీవ్రంగా ఉందని అంటున్నారు.

07/10/2017 - 01:08

భువనేశ్వర్, జూలై 9: ఆసియా అథ్లెటిక్స్ చరిత్రలో భారత్ కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. మొ ట్టమొదటిసారి అత్యధిక పతకాలు కైవసం చేసుకొని, అగ్రస్థానంలో నిలిచింది. ప్రతిసారీ తిరుగు లేని ఆధిపత్యాన్ని కనబరచే చైనా ఈసారి భారత్ దెబ్బకు రెండో స్థానానికి పరిమితమైంది. ఈ పో టీల చివరి రోజైన ఆదివారం భారత్ ఐదు స్వర్ణాలు సహా మొత్తం 8 పతకాలు సాధించింది. వీటి లో ఒక రజతం, మూడు కాంస్య పతకాలు ఉన్నాయ.

07/10/2017 - 01:07

డెర్బీ, జూలై 9: మోయన్ అలీ స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించడంతో, దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో ఇంగ్లాండ్ 211 పరుగుల భారీ తేడాతో విజయభేరి మోగించిం ది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 458 పరుగులు సాధించగా, దక్షిణాఫ్రికా 361 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 233 పరుగులు చేసిన ఇంగ్లాండ్ తన ప్రత్య ర్థి ముందు 331 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.

07/10/2017 - 01:06

న్యూఢిల్లీ, జూలై 9: శ్రీలంక పర్యటనలో భాగంగా, మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడే టీమిండియాలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు చోటు దక్కింది. ఇటీవల కాలంలో అద్భుతంగా రాణిస్తున్న అతను వనే్డ, టి-20 ఫార్మాట్స్‌లోనేగాక, టెస్టులోనూ సత్తా చాటుతాడని సెలక్టర్లు నమ్మకం ఉంచారు. ఇలావుంటే, సీనియ ర్ ఆటగాడు రోహిత్ శర్మకు మళ్లీ టెస్టు జట్టులో స్థానం లభించింది.

07/10/2017 - 01:05

డెర్బీ, జూలై 9: మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో ఆది వారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. 230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో వి ఫలమైన్ర శ్రీలంక 48 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌటైంది. తొలు త బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు మెరిసా అగులెరెరా (46 నాటౌట్) అండగా నిలిచింది. దియేంద్ర డోటిన్ 38 పరుగులతో రాణించింది.

07/10/2017 - 01:05

బ్రిస్టల్, జూలై 9: చివరి క్షణం వరకూ హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో బలమైన ఆస్ట్రేలియా ఓటమిపాలుకాగా, ఇంగ్లాండ్ 3 ప రుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 259 పరుగులు నమోదు చేయ గా, ఆసీస్ 8 వికెట్లు కోల్పోయ 256 పరుగుల వద్ద పరిమితమైంది.

07/10/2017 - 01:04

లాసనే్న, జూలై 9: టోక్యోలో జరిగే 2020 ఒలింపిక్స్‌కు క్వాలిఫయింగ్ ఈవెంట్‌గా నిర్వహించే ప్రో లీగ్ నుంచి భారత్ వైదొలగడంపై అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) విచారం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం దురదృష్టకరమని ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. 2019 జనవరిలో హాకీ ప్రో లీగ్ మొదలై, జూన్ మాసంతో ముగుస్తుంది.

07/10/2017 - 01:04

చిత్రాలు.. ఫిట్నెస్ కోసం శ్రమిస్తున్న ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ ఆండీ ముర్రే

07/10/2017 - 01:02

వింబుల్డన్, జూలై 9: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత స్టార్ సానియా మీర్జా అటు మహిళల డబుల్స్‌లో, ఇటు మిక్స్‌డ్ డబుల్స్‌లో మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. మహిళల డబుల్స్‌లో బెల్జియం దేశానికి చెందిన కిర్‌స్టెన్ ఫ్లిప్కెన్స్‌తో కలిసి బరిలోకి దిగిన సానియా 6-3, 3-6, 6-4 తేడాతో నవోమీ బ్రాడీ, హీతర్ వాట్సన్ జోడీని ఓడించి మూడో రౌండ్ చేరింది.

07/09/2017 - 00:36

లీసెస్టర్, జూలై 8: మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో వరుసగా నాలుగు విజయాలు నమోదు చేసిన మిథాలీ రాజ్ కెప్టెన్సీలోని భారత జట్టు దూడుకుడు శనివారం బ్రేక్ పడింది. డేన్ వాన్ నికెర్క్ ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరచడంతో, దక్షిణాఫ్రికా 115 పరుగుల భారీ తేడాతో భారత్‌ను ఓడించింది. 274 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన భారత్ 158 పరుగులకే ఆలౌటైంది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో లిజెల్ లీ 92 పరుగులతో రాణించింది.

Pages