S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/03/2017 - 01:10

వింబుల్డన్ టెన్నిస్ ఆవరణ 13.5 ఎకరాలు విస్తరించింది. పార్కింగ్ కోసం అదనంగా 42 ఎకరాల స్థలం ఉంది. వింబుల్డన్ కోర్టులన్నింటినీ అనుక్షణం క్షుణ్ణంగా వీక్షిస్తూ, ఏ చిన్నపాటి కదిలికనైనా రికార్డు చేయడానికి ‘హాక్ ఐ’ పరిజ్ఞానాన్ని వినియోగిస్తారు. గాల్లో తేలుతూ ఉండే ఈ కెమెరాల దృష్టిని దాటుకొని వింబుల్డన్ కోర్టులపై చీమ కూడా కదల్లేదు.

07/03/2017 - 01:08

లండన్, జూలై 2: టెన్నిస్‌లో అనధికార ప్రపంచ చాంపియన్‌షిప్‌గా వెలుగుతున్న ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టోర్నీలో ఈసారి టైటిళ్లను ఎవరు కైవసం చేసుకుంటారన్నది ఆసక్తిని రేపుతున్నది.

07/03/2017 - 01:06

లండన్: ఒకవేళ చిరుజల్లులు పడితే, తడవకుండా ఉండేందుకు ప్రేక్షకులకు 7,500 భారీ గొడుగులను అందుబాటులో ఉంచుతారు. కేవలం వింబుల్డన్ టోర్నీ సమయంలోనే ఈ ప్రత్యేక గొడుగులను విక్రయస్తారు. వీటికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది.

07/03/2017 - 01:06

లండన్: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్‌లో నలుగురు సీనియర్ ఆటగాళ్లు టైటిల్ రేసులో ముందున్నారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్, ఆండీ ముర్రే, నొవాక్ జొకోవిచ్ మధ్యే పోటీ తీవ్రంగా ఉంటుందని క్రీడా పండితులు జోస్యం చెప్తున్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌ను, ఇటీవల జరిగిన వివిధ టోర్నీల ఫలితాలను పరిగణలోకి తీసుకుంటే, వింబుల్డన్ టైటిల్ వేటలో వీరు ముందుంటారని స్పష్టమవుతుంది.

07/03/2017 - 01:04

డెర్బీ, జూలై 2: మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భారత్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లపై తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచిన మిథాలీ రాజ్ నేతృత్వంలోని భారత్ ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను 95 పరుగుల తేడాతో చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఈ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 169 పరుగులు మాత్రమే చేయగలిగింది.

07/03/2017 - 01:03

సిడ్నీ, జూలై 2: కాంట్రాక్టు వివాదానికి తెరపడకపోవడంతో, దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లేందుకు ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు నిరాకరించింది. సమస్యకు తెరపడే వరకూ ఎవరూ జాతీయ జట్ల తరఫున మ్యాచ్‌లు ఆడబోరని ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం (ఎసిఎ) ప్రకటించింది. జూన్ 30 తేదీతో పాత కాంట్రాక్టు ముగియగా, కొత్త ఒప్పందంపై తలెత్తిన వివాదం కారణంగా ఆటగాళ్లు ఎవరూ సంతకాలు చేయలేదు.

07/03/2017 - 01:02

చెన్నై, జూలై 2: గ్లాస్గోలో జరిగే బాడ్మింటన్ ప్ర పంచ చాంపియన్‌షిప్స్‌లో సర్వశక్తులు ఒడ్డుతానని భారత స్టార్ షట్లర్ పివి సింధు అన్నది. అత్యుత్తమ స్థాయ ఫిట్నెస్‌తోపాటు, ఫామ్‌ను కొనసాగిస్తేనే ఆ మెగా టోర్నీలో రాణించడం సాధ్యమవుతుందని 2013, 2014 సంవత్సరాల్లో కాంస్య పతకాలను సా ధించిన రియో ఒలింపిక్స్ విజేత సింధు స్పష్టం చే సింది.

07/03/2017 - 01:01

గాలే, జూలై 2: కెరీర్‌లో మొదటి వనే్డ ఆడిన వనిదు హసరంగ హ్యాట్రిక్ నమోదు చేయడంతో, ఆదివారం ఇక్కడ జరిగిన రెండో వనే్డలో జింబాబ్వేను శ్రీలంక కేవలం 155 పరుగులకే కట్టడి చేయగలిగింది. అనంతరం లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి అందుకోవడం ద్వారా, ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదటి వనే్డలో జింబాబ్వే గెలుపొందింది.

07/01/2017 - 23:48

నార్త్ సౌండ్ (అంటిగువా), జూలై 1: వెస్టిండీస్‌తో జరిగిన మూడో వనే్డను 93 పరుగుల తేడాతో కైవసం చేసుకున్న విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఆదివారం జరిగే నాలుగో మ్యాచ్‌ని కూడా గెల్చుకోవడం ద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకాగా, రెండో మ్యాచ్‌లో 105 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

07/01/2017 - 23:47

నార్త్ సౌండ్: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తనను తాను ‘పాత వైన్’తో పోల్చుకున్నాడు. ఎంత పాతబడితే అంత ఎక్కువ రుచికరంగా ఉండే లక్షణం వైన్‌కు ఉంది. తనలోనూ అలాంటి లక్షణమే ఉందంటూ, మీదపడుతున్న తన వయసును ఉద్దేశించి చమత్కరించాడు.

Pages