S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/11/2017 - 01:27

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ పురుషుల సింగిల్స్‌ను ఇప్పటికే తొమ్మిది పర్యాయాలు గెల్చుకొని రికార్డు సృష్టించిన స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ పదోసారి విజేతగా నిలవడంపై దృష్టి పెట్టాడు. ఆదివారం జరిగే ఫైనల్‌లో అతను స్టానిస్లాస్ వావ్రిన్కాను ఢీకొనేందుకు అన్ని విధాలా సిద్ధమయ్యాడు.

06/10/2017 - 01:05

పారిస్, జూన్ 9: ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు, టైటిల్ ఫేవరిట్ ఆండీ ముర్రేకు ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో చుక్కెదురైంది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో స్విర్జర్లాండ్ హీరో స్టానిస్లాస్ వావ్రిన్కా 6-7, 6-3, 5-7, 7-6, 6-1 తేడాతో విజయం సాధించి, ముర్రేకు షాకిచ్చాడు. 2015లో ఇక్కడ టైటిల్ గెల్చుకున్న వావ్రిన్కా కెరీర్‌లో నాలుగో గ్రాండ్ శ్లామ్ విజయాన్ని నమోదు చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు.

06/10/2017 - 01:04

పారిస్: క్లే కోర్టుపై తనకు తిరుగులేదని రాఫెల్ నాదర్ నిరూపించాడు. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో అతను డామినిక్ థియెమ్ పై 6-3, 6-4, 6-0 తేడాతో వరుస సెట్లలో చిత్తుచేశాడు. ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్‌ను ఓడించి సంచలనం సృష్టించిన థియెమ్ ఈ మ్యాచ్‌లో అదే స్థాయలో రాణించలేకపోయాడు.

06/10/2017 - 01:02

న్యూఢిల్లీ, జూన్ 9: భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్ ఎవరన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశమైంది. టీమిండియాకు మార్గదర్శకం చేసే అవకాశం ఎవరికి దక్కుతుందోని ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంటే, రేసులో ఉన్న ఆరుగురు అభ్యర్థుల మధ్య పోలిక జోరుగా సాగుతున్నది. ప్రస్తుత కోచ్ అనిల్ కుంబ్లే మరోసారి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అతను కోచ్‌గా ఉన్న కాలంగా భారత జట్టు 17 టెస్టులు ఆడి, 12 విజయాలు సాధించింది.

06/10/2017 - 00:59

పారిస్: అన్‌సీడెడ్ క్రీడాకారిణి జెలెనా ఒస్టాపెన్కోతో శనివారం జరిగే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ మహిళల సింగిల్స్ ఫైనల్‌కు మూడో ర్యాంకర్ సిమోనా హాలెప్ సిద్ధమైంది. సెమీ ఫైనల్‌లో కరొలినా ప్లిస్కోవాను 6-4, 3-6, 6-3 తేడాతో ఓడించిన హాలెప్ రెండోసారి ఈ టోర్నీలో ఫైనల్ చేరింది. ఇంతకు ముందు 2014లో ఫైనల్‌లో చోటు దక్కించుకున్నప్పటికీ టైటిల్‌ను సాధించలేకపోయింది.

06/10/2017 - 00:58

న్యూఢిల్లీ, జూన్ 9: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టోర్నీలో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ సాధించిన రోహన్ బొపన్న పేరును ఈసారి అర్జున అవార్డుకు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఎఐటిఎ) ప్రతిపాదించింది. అతనితోపాటు రుష్మీ చక్రవర్తి పేరును కూడా ప్రభుత్వానికి పంపినట్టు ఎఐటిఎ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

చిత్రం.. రోహన్ బొపన్న

06/10/2017 - 00:57

కార్డిఫ్, జూన్ 9: చాంపియన్స్ ట్రోఫీలో శుక్రవారం జరిగి న మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్, మహమ్మదుల్లా శతకాలతో రాణించడంతో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్ ఐదు వికెట్ల తేడా తో విజయభేరి మోగించింది. 266 పరుగుల లక్ష్యాన్ని ఈ జట్టు 47.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయ అందుకుంది.

06/10/2017 - 00:56

లండన్, జూన్ 9: భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ కుమారుడు అర్జున్ తెండూల్కర్ శుక్రవారం లార్డ్స్ మైదానంలో కనిపించాడు. దీనితో మీడియా ప్రతినిధులు అతని ఫొటోలు తీసేందుకు పోటీపడ్డారు. కొనే్నళ్లుగా ప్రతి వేసవిలోనూ అర్జున్ లండన్ వచ్చి, అక్కడి లార్డ్స్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. శుక్రవారం లార్డ్స్ మైదానంలో చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లేకపోవడంతో అతను ప్రాక్టీస్‌కు హాజరయ్యాడు.

06/10/2017 - 00:54

లండన్, జూన్ 9: తాము అజేయులేమీ కాదని, పోటీకి దిగిన తర్వాత జయాపజయాలు సహజమని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. టీమిండియా బ్యాటింగ్‌లో రాణించి, 50 ఓవర్లలో 6 వికెట్లకు 321 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ, ఆతర్వాత ప్రత్యర్థి శ్రీలంకను కట్టడి చేయలేకపోయిన విషయం తెలిసిందే.

06/10/2017 - 00:51

లండన్: దక్షిణాఫ్రికా ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్‌ను పరిశీలిస్తూ, వివరాలను నమోదు చేసుకుంటున్న ఆ జట్టు మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్. శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర గురువారం భారత్‌తో మ్యాచ్‌కి ముందు నెట్స్‌కు వచ్చి, ఆటగాళ్లకు కీలక సూచనలు చేశాడు. అతను అందించిన స్ఫూర్తితోనే అసాధ్యంగా కనిపించిన భారీ లక్ష్యం సులభసాధ్యమైందని లంక కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ వ్యాఖ్యానించాడు.

Pages