S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/08/2017 - 01:29

న్యూఢిల్లీ, జూన్ 7: ‘హాకీ మాంత్రికుడు’ ధ్యాన్ చంద్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ఇవ్వాల్సిందిగా ప్రధాని కార్యాలయం (పిఎంవో)కు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ విషయాన్ని క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ ధ్రువీకరించారు. ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లినట్టు పిటిఐతో మాట్లాడుతూ చెప్పారు.

06/08/2017 - 01:28

ఎడ్జిబాస్టన్, జూన్ 7: చాంపియన్స్ ట్రోఫీలో బుధవారం పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌కి కూడా వర్షం బెడద తప్పలేదు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 219 పరుగులు చేయగలిగింది. భారత్‌తో జరిగిన పోరులో దారుణంగా విఫలమైన పాకిస్తాన్ బౌలింగ్ ఈ మ్యాచ్‌లో మెరుగుపడడం విశేషం.

06/07/2017 - 02:18

కార్డ్ఫి, జూన్ 6: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు మరో విజయం సాధించింది. కార్డ్ఫిలోని సోఫియా గార్డెన్స్ మైదానంలో జరిగిన గ్రూప్-ఎ లీగ్ మ్యాచ్‌లో ఆ జట్టు 87 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 49.3 ఓవర్లలో 310 పరుగులకు ఆలౌటవగా, న్యూజిలాండ్ 44.3 ఓవర్లలో 223 పరుగులకే ఆలౌటై కుప్పకూలింది.

06/07/2017 - 02:16

న్యూఢిల్లీ, జూన్ 6: ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ‘మణిపూర్ మణిపూస’ మేరీ కోమ్ దాదాపు ఏడాది కాలం తర్వాత మళ్లీ బాక్సింగ్ బరిలోకి దిగనుంది. మరికొద్ది రోజుల్లో మంగోలియాలో జరుగనున్న ఉలాన్‌బాటర్ కప్ ఇన్విటేషనల్ టోర్నమెంట్‌లో పాల్గొనే ముగ్గురు సభ్యుల భారత మహిళా జట్టులో ఆమెకు చోటు కల్పించారు. మేరీ కోమ్ గత ఏడాది కాలం నుంచి బాక్సింగ్ పోటీలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

06/07/2017 - 02:14

పారిస్, జూన్ 6: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి డెన్మార్క్‌కు చెందిన 11వ సీడ్ క్రీడాకారిణి కరోలిన్ వొజ్నియాకి నిష్క్రమించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 12వ స్థానంలో కొనసాగుతున్న ఆమె మంగళవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ పోరులో ఊహించని షాక్ ఎదురైంది.

06/07/2017 - 02:13

డస్సెల్‌డోర్ఫ్, జూన్ 6: మూడు దేశాల ఇన్విటేషనల్ హాకీ టోర్నమెంట్‌లో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జర్మనీ 2-0 గోల్స్ తేడాతో భారత్‌ను మట్టికరిపించింది. దీంతో జర్మనీ తన పోరాటాన్ని విజయంతో ముగించినట్లయింది.

06/07/2017 - 02:11

న్యూఢిల్లీ, జూన్ 6: వివాదాస్పద మద్యం వ్యాపారవేత్త, పార్లమెంట్ మాజీ సభ్యుడు విజయ్ మాల్యా సోమవారం ఇంగ్లాండ్‌లో విరాట్ కోహ్లీ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ‘చారిటీ డిన్నర్’లో ప్రత్యక్షమయ్యాడు. అయితే ఈ కార్యక్రమంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా భారత క్రికెట్ జట్టులోని ఇతర సభ్యులంతా మాల్యాకు దూరంగా ఉన్నారు.

06/07/2017 - 02:10

లండన్, జూన్ 6: కంగారూలపై వరుణుడు పగబట్టాడా?. చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో తొలి విజయాన్ని నమోదు చేసుకోవాలన్న కంగారూల ఆశలపై వరుణుడు మరోసారి నీళ్లు చల్లడం చూస్తుంటే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. లండన్‌లో సోమవారం బంగ్లాదేశ్‌పై కంగారూలు సునాయాస విజయాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతున్న తరుణంలో వరుణుడు మరోసారి కనె్నర్ర చేయడంతో ఆ మ్యాచ్ ఫలితం తేలకుండా నిలిచిపోయింది.

06/06/2017 - 02:34

ఇస్లామాబాద్, జూన్ 5: భారత్‌తో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ మ్యాచ్‌లో చాలా చెత్తగా ఆడారంటూ సర్ఫ్‌రాజ్ అహ్మద్ నాయకత్వం వహిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై మీడియా నిప్పులు చెరిగింది.

06/06/2017 - 02:33

ఎడ్జిబాస్టన్, జూన్ 5: పాకిస్తాన్, భారత్ జట్ల మధ్య ఆదివారం జరిగిన చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. ఈ టోర్నమెంట్‌లోనేగాక, వనే్డ ఇంటర్నేషనల్స్‌లోనే పాకిస్తాన్‌పై భారత్‌కు ఇది రెండో భారీ విజయం. 2008 జూన్ 10న ఢాకాలో జరిగిన మ్యాచ్‌లో 140 పరుగుల తేడాతో గెలిచిన భారత్, తాజా మ్యాచ్‌లో 124 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది.

Pages