S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/06/2016 - 01:49

మాస్కో, జూలై 5: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి అనుమతించాలని కోరుతూ అభ్యర్థించిన 68 మంది అథ్లెట్ల జాబితాను రష్యా మంగళవారం ప్రచురించింది. ఉద్దేశపూర్వకంగా డోపింగ్‌ను ప్రోత్సహించారన్న ఆరోపణలపై అంతర్జాతీయ అథ్లెటిక్ ఫెడరేషన్ రష్యా ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్సపై రెండేళ్ల పాటు నిషేధం విదించిన విషయం తెలిసిందే.

07/06/2016 - 01:48

న్యూఢిల్లీ, జూలై 5: రియో ఒలింపిక్స్‌లో బెర్తును ఖరారు చేసుకునేందుకు భారత బాక్సర్, డబ్ల్యుబిసి ఆసియా చాంపియన్ నీరజ్ గోయత్ మరో అడుగు దూరంలో నిలిచాడు.

07/06/2016 - 01:46

న్యూఢిల్లీ, జూలై 5: లండన్‌లో ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో పతకాన్ని సాధించాలన్న లక్ష్యాన్ని సాధించిన తర్వాత భారత పురుషుల హాకీ జట్టు చీఫ్ కోచ్ రోలంట్ ఓల్ట్‌మన్స్ ఇప్పుడు దృష్టి అంతా రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించడంపై పెట్టారు. 1982లో కాంస్య పతకం తర్వాత చాంపియన్స్ ట్రోఫీలో రజత పతకం సాధించడం భారత జట్టు సాధించిన అత్యుత్తమ ప్రతిభ కావడం గమనార్హం.

07/06/2016 - 01:44

ట్రినిడాడ్, జూలై 5: కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సిపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో జమైకా తల్లావాస్ జట్టు కెప్టెన్ క్రిస్ గేల్ విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి ట్రిన్బాగో నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గేల్ తనదైన శైలిలో బ్యాట్ ఝళిపించి 54 బంతుల్లో అజేయంగా 108 పరుగులు సాధించి టి-20 ఫార్మాట్‌లో 18వ శతకాన్ని నమోదు చేసుకున్నాడు.

07/05/2016 - 05:03

లండన్, జూలై 4: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ మహిళల సింగిల్స్ టైటిల్ రేసులో ఉన్న మూడో సీడ్ అగ్నిస్కా రద్వాన్‌స్కా అనూహ్యంగా ప్రీ క్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది. ర్యాంకింగ్స్‌లో 13వ స్థానంలో ఉన్న డొనినికా సిబుల్కొవా 6-3, 5-7, 9-7 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగిన రద్వాన్‌స్కాను ఆత్మరక్షణలోకి నెట్టిన సిబుల్కొవా తొలి సెట్‌ను సులభంగా గెల్చుకుంది.

07/05/2016 - 04:57

లండన్: కెరీర్‌లో 17 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు సాధించిన ప్రపంచ మూడో ర్యాంక్ ఆటగాడు రోజర్ ఫెదరర్ తన ఖాతాలో మరో టైటిల్‌ను గెల్చుకున్న దిశగా ముందడుగు వేశాడు. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ నాలుగో రౌండ్‌లో అతను స్టీవ్ జాన్సన్‌ను 6-2, 6-3, 7-5 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్ చేరాడు.

07/05/2016 - 04:56

న్యూఢిల్లీ, జూలై 4: రియో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత బృందానికి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఒలింపిక్స్‌కు వెళ్లి విజేతలుగా తిరిగిరావాలంటూ వారికి వీడ్కోలు పలికారు. మానెక్‌షా సెంటర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో రియోకు వెళ్లే భారత బృందంతో ప్రధాని భేటీ అయ్యారు. హాజరైన ప్రతి ఒక్కరినీ ఆయన స్వయంగా కలవడం విశేషం. కొంత మంది అథ్లెట్లు ప్రధానితో సెల్ఫీలు దిగారు.

07/05/2016 - 04:55

యూగేన్, జూలై 4: ఉసేన్ బోల్ట్ చిరకాల ప్రత్యర్థి జస్టిన్ గాట్లిన్ రియో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదంచాడు. జమైకా క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో అతను 100 మీటర్ల లక్ష్యాన్ని 9.8 సెకన్లలో చేరుకొని స్వర్ణ పతకాన్ని సాధించాడు. ట్రైవాన్ బ్రోమెల్ 9.84 సెకన్లతో రెండో స్థానాన్ని ఆక్రమించగా, 9.98 సెకన్లలో గమ్యాన్ని చేరిన మార్విన్ బ్రాసీకి కాంస్య పతకం లభించింది.

07/05/2016 - 04:55

బెంగళూరు, జూలై 4: టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడుకు తాను కళ్లెం వేయనని టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే స్పష్టం చేశాడు. అయితే, భారత దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నామన్న విషయాన్ని ఆటగాళ్లంతా గుర్తుంచుకోవాలని, గీత దాటకూడదని కుంబ్లే హితవు పలికాడు.

07/05/2016 - 04:54

బెంగళూరు, జూలై 4: టెస్టులకు తాము ఎంత వరకు సమాయత్తమయ్యామో, తమ సత్తా ఏమిటో త్వరలోనే తేలుతుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. కోహ్లీ నాయకత్వంలో భారత జట్టు రానున్న కొద్దికాలంలో ఏకంగా 17 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ముందుగా వెస్టిండీస్ టూర్‌కు వెళ్లి, అక్కడ నాలుగు మ్యాచ్‌ల్లో పోటీపడుతుంది.

Pages