S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/30/2017 - 08:26

బెంగళూరు, మే 29: యువ ఆటగాడు మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత హాకీ జట్టు జర్మనీకి సోమవారం బయలుదేరి వెళ్లింది. జూన్ ఒకటి నుంచి జర్మనీలో ప్రారంభమయ్యే మూడు దేశాల ఇన్విటేషనల్ టోర్నమెంట్‌లో ఈ జట్టు పాల్గొంటుంది. 18 మంది సభ్యులతో కూడిన జట్టు కెంపెగౌడ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి జర్మనీకి బయలుదేరిందని భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) ఒక ప్రకటనలో తెలిపింది.

05/30/2017 - 08:26

న్యూఢిల్లీ, మే 29: కరడుగట్టిన పాకిస్తాన్ క్రికెట్ అభిమాని మహమ్మద్ బషీర్ టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు. ‘చాచా చికాగో’గా అందరికీ సుపరచితుడైన అతను పాక్ క్రికెట్ అభిమాని. ఆ జట్టు ఎక్కడ మ్యాచ్‌లు ఆడినా వెళతాడు. మద్దతు ప్రకటిస్తాడు. అదే సమయంలో అతనికి భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంటే వల్లమాలిన అభిమానం. ఒక్కోసారి ధోనీ పేరు, అతని బొమ్మలు ఉన్న దుస్తులను ధరించి ప్రత్యక్షమవుతాడు.

05/30/2017 - 08:25

లండన్, మే 29: ఇటీవల వివిధ సందర్భాల్లో మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగే వామప్ మ్యాచ్‌లో మళ్లీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నీకి సిద్ధమయ్యేందుకు భారత్ మొదటి వామప్ మ్యాచ్‌ని న్యూజిలాండ్‌తో ఆడింది. అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యాన్ని కనబరచింది.

05/29/2017 - 05:46

పారిస్, మే 28: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మొదటి రోజే సంచలన ఫలితం నమోదైంది. మహిళల సింగిల్స్‌లో జర్మనీకి చెందిన టాప్ సీడ్ ఏంజెలిక్ కెర్బర్ మొదటి రౌండ్‌లోనే ఓటమిపాలై నిష్క్రమించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 45వ స్థానంలో ఉన్న రష్యా క్రీడాకారిణి ఎకతరీన మకరోవా 6-2, 6-2 తేడాతో విజయభేరి మోగించి, కెర్బర్‌కు షాకిచ్చింది.

05/29/2017 - 05:44

లండన్, మే 28: చాంపియన్స్ ట్రోఫీకి వెళ్లిన టీమిండి యాలో సహజంగానే విరాట్ కోహ్లీని స్టార్ అట్రాక్షన్‌గా పేర్కొంటారు. కానీ, న్యూజిలాండ్, భారత్ వామప్ మ్యా చ్‌ని తిలకించడానికి వచ్చిన అభిమానులు కోహ్లీ కంటే ధోనీకే ఎక్కువ మద్దతు ప్రకటించడం గమనార్హం. అతని పేరుతో ప్లకార్డులు ప్రదర్శించి, అతని పట్ల తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

05/29/2017 - 05:43

పారిస్: రెండుసార్లు వింబుల్డన్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న పెట్రా క్విటోవా సుమారు ఆరు నెలల తర్వాత మళ్లీ అంతర్జాతీయ టోర్నీలో అడుగుపెట్టి, శుభారంభం చేసింది. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ మొదటి రౌండ్‌లో 15వ ర్యాంకర్ క్విటోవా ఎలాంటి ఇబ్బంది లేకుండా గెలిచింది. జూలియా బెసెర్ప్‌ను ఆమె 6-3, 6-2 తేడాతో ఓడించి, రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టింది.

05/29/2017 - 05:43

పారిస్: ప్రపంచ మాజీ నంబర్ వన్ వీనస్ విలియమ్స్ ఫ్రెంచ్ ఓపెన్‌లో 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో పదో స్థానంలో ఉన్న ఆమె 1997లో మొదటిసారి ఈ టోర్నమెంట్‌లో అడుగుపెట్టింది. 2011 సంవత్సరాన్ని మినహాయిస్తే, అప్పటి నుంచి ఇప్పటి వరకూ క్రమం తప్పకుండా రోలాండ్ గారోస్‌కు హాజరవుతునే ఉంది.

05/29/2017 - 05:42

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ 1968లో ‘ఓపెన్ టోర్నీ’గా మారిన తర్వాత మహిళల సింగిల్స్‌లో ఒక టాప్ సీడ్ తొలి రౌండ్‌లో పరాజయాన్ని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. నంబర్ వన్ క్రీడాకారిణిగా టోర్నీలోకి అడుగుపెట్టిన కెర్బర్ అందరి అంచనాలను తారుమారు చేస్తూ, మొదటి రౌండ్ నుంచే నిష్క్రమించింది. ఈ టోర్నీలో ఆమె 2012లో క్వార్టర్ ఫైనల్స్ చేరింది. రోలాండ్ గారోస్‌లో ఆమెకు అదే అత్యుత్తమ ప్రదర్శన.

05/29/2017 - 05:41

ది ఓవల్ (లండన్), మే 28: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌కు సిద్ధమవుతున్న భారత్ టాప్ ఫామ్‌లో ఉన్నట్టు నిరూపించుకుంది. న్యూజిలాండ్‌ను ఆదివారం వామప్ మ్యాచ్‌లో తలపడిన టీమిండియా అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యాన్ని కనబరచి, 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా రద్దయిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థిని భారత్ 38.4 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌట్ చేరింది.

05/29/2017 - 05:41

సౌతాంప్టన్, మే 28: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మరో వివాదంలో చిక్కుకుంది. ఈసారి కూడా బాల్ ట్యాంపరింగ్‌కు సంబంధించిందే కావడం గమనార్హం. మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో వనే్డలో ఈ సంఘట చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, 33వ ఓవర్‌లో బంతి ఆకారం మారినట్టు అంపైర్లు క్రిస్ గఫానీ, రాబ్ బెయిలీ గుర్తించారు.

Pages