S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/17/2017 - 01:22

న్యూఢిల్లీ, మే 16: భారత్, లెబనాన్ జట్ల మధ్య వచ్చేనెల 7న జరగాల్సిన స్నేహపూర్వక ఫుట్‌బాల్ మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. ఆటగాళ్లకు వీసా లభించలేదని, అందుకే ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు వారు రాలేకపోతున్నారని లెబనాన్ ఫుట్‌బాల్ సమాఖ్య సమాచారం అందించిందని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్‌ఎఫ్) మంగళవారం ఒక ప్రకటనో తెలిపింది.

05/17/2017 - 01:21

లునావదా (గుజరాత్), మే 16: పఠాన్ సోదరులు యూసుఫ్, ఇర్ఫాన్ మరో అకాడెమీని తెరిచారు. క్రికెట్ అకాడెమీ ఆఫ్ పఠాన్ (క్యాప్) పేరుతో ఇప్పటికే మూడు క్రికెట్ అకాడెమీలను నిర్వహిస్తున్న వారు మంగళవారం మరో అకాడెమీని ప్రారంభించారు. త్వరలోనే దేశంలోని మరో ఐదు నగరాల్లో ‘క్యాప్’ను ఆరంభించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ప్రకటించారు.

05/17/2017 - 01:20

ప్యూకెకొ (న్యూజిలాండ్), మే 16: న్యూజిలాండ్ జట్టుతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు వెళ్లిన భారత మహిళల హాకీ జట్టు వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. రెండు రోజుల క్రితం జరిగిన మొదటి మ్యాచ్‌లో 1-4 తేడాతో పరాజయాన్ని చవిచూసిన భారత్ మరోసారి దారుణంగా విఫలమైంది. ఈసారి ఏకంగా 2-8 తేడాతో ఓడింది.

05/17/2017 - 01:19

పారిస్, మే 16: కెరీర్‌లో 18 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన మాజీ నంబర్ వన్ ఆటగాడు రోజర్ ఫెదరర్ ఈసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడడం లేదు. మోకాలి గాయం పూర్తిగా తగ్గకపోతే, ఇటీవల కాలంలో వెన్నునొప్పి కూడా తోడుకాడవంతో రొలాండ్ గారోస్ టోర్నీకి హాజరుకారాదని అతను నిర్ణయించుకున్నట్టు టోర్నీ అధికారులు ప్రకటించారు.

05/16/2017 - 01:12

పోచెఫ్‌స్ట్రూమ్, మే 15: నాలుగు దేశాల మహిళల వనే్డ క్రికెట్ టోర్నమెంట్‌లో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌ని భారత జట్టు ఐర్లాండ్‌పై ఏకంగా 249 పరుగుల భారీ తేడాతో గెల్చుకుంది. దీప్తి శర్మ 188 పరుగులు సాధించి రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించగా, మరో ఓపెనర్ పూనమ్ రావత్ కూడా శతకాన్ని సంధించడంతో భారత్ 50 ఓవర్లలో మూడు వికెట్లకు 358 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

05/16/2017 - 01:11

వెస్టిండీస్‌తో రూసోలో జరిగిన చివరి, మూడో టెస్టు మ్యాచ్‌ని 101 పరుగుల తేడాతో గెల్చుకొని, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 ఆధిక్యంతో సొంతం చేసుకున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు సాధించిన పాక్ ఆతర్వాత వెస్టిండీస్‌ను 247 పరుగులకు ఆలౌట్ చేసింది.

05/16/2017 - 01:08

మడ్రిడ్ (స్పెయిన్)లో జరిగిన మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఫైనల్‌లో డామినిక్ థియెమ్‌ను 7-6, 6-4 తేడాతో ఓడించి టైటిల్ సాధించిన రాఫెల్ నాదల్

05/16/2017 - 01:05

న్యూఢిల్లీ, మే 15: ఐపిఎల్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడుతున్న పాండ్య సోదరులు హార్దిక్, కృణాల్ ఒకరిపై ఒకరు ట్విటర్లో చేసుకున్న వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్ వీరేందర్ సెవాగ్ స్పందించాడు. ఇద్దరికీ చురకలు వేశాడు. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఐపిఎల్ గ్రూప్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ తొమ్మిది పరుగుల తేడాతో గెలిచింది.

05/16/2017 - 01:04

తమ కుమార్తె గ్రేసియా పుట్టిన రోజు సందర్భంగా సోమవారం న్యూఢిల్లీలో జరిగిన నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆదరణ కోల్పోయిన తల్లు కోసం ప్రత్యేకంగా ఒక ఫౌండేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన భారత క్రికెటర్ సురేష్ రైనా, అతని భార్య ప్రియాంక రైనా.

05/16/2017 - 01:03

సిడ్నీ, మే 15: క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ), ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం (ఎసిఎ) మధ్య వివాదం మరింత ముదురుతున్నది. నిన్నటి వరకూ రాజీ ప్రయత్నాలు చేసిన ఎసిఎ ఇప్పుడు ఎదురుదాడికి సిద్ధమైంది. ఆటగాళ్ల కాంట్రాక్టు మొత్తాన్ని పెంచాల్సిందేనని ఎసిఎ డిమాండ్ చేసింది. ఒకవేళ సమస్యకు తెరపడకపోతే, రాబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.

Pages