S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/01/2017 - 01:20

ఇపో (మలేసియా), ఏప్రిల్ 30: ప్రతిష్ఠాత్మక అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ని భారత్ 3-0 తేడాతో గెలిచింది. డిఫెండర్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నమెంట్ మొదటి మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్‌ను ఢీకొన్న భారత్ 2-2గా డ్రా చేసుకుంది.

05/01/2017 - 01:18

లండన్‌లో జరిగిన హెవీవెయిట్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ ఫైట్‌లో ప్రత్యర్థి వ్లాదిమీర్ క్లిచ్కోపై రైట్ హుక్ సంధిస్తున్న బ్రిటిష్ బాక్సర్ ఆంథోనీ జాషువా. ఈ ఫైట్‌ను 11వ రౌండ్ వద్ద నిలిపేసిన న్యాయమూర్తులు జాషువాను విజేతగా ప్రకటించారు. 41 ఏళ్ల క్లిచ్కోపై మొదటి నుంచి ఆధిపత్యం కనబరచిన 27 ఏళ్ల జాషువా తన బలమైన పంచ్‌లతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఒక్క పరాజయం కూడా లేకుండా 19 ఫైట్స్‌ను పూర్తి చేశాడు.

05/01/2017 - 01:15

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తప్పనిసరిగా ఆడాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) పాలనా వ్యవహారాలను చూసేందుకు సుప్రీం కోర్టు నియమించిన అధికారుల కమిటీ (సిఒఎ) సభ్యుడు, ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ స్పష్టం చేశాడు. ఎనిమిది జట్లు తలపడే ఈ టోర్నమెంట్ ఇంగ్లాండ్‌లో జూన్ ఒకటిన మొదలవుతుంది. అందులో పాల్గొనే మిగతా దేశాలు ఇప్పటికే తమతమ జట్లను ప్రకటించాయి.

05/01/2017 - 01:13

ఉహాన్, ఏప్రిల్ 30: ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను ప్రపంచ నంబర్ వన్ తాయ్ జూ ఇంగ్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఆమె రెండో సీడ్ అకానే యమాగుచీని 18-21, 21-11, 21-18 తేడాతో ఓడించింది. మొదటి సెట్‌ను కోల్పోయినప్పటికీ ఏ మాత్రం ఒత్తిడికి గురికాకుండా, మిగతా రెండు సెట్లలో అద్వితీయ ప్రతిభ కనబరచి విజేతగా నిలిచింది.

04/30/2017 - 08:54

పుణే చేతిలో చావుదెబ్బతిన్న బెంగళూరు

04/30/2017 - 08:50

స్టట్‌గార్ట్, ఏప్రిల్ 29: నిషిద్ధ మాదక ద్రవ్యా లను వాడినందుకు 15 నెలల నిషేధాన్ని పూర్తి చేసుకొని, తిరిగి కెరీర్‌ను మొదలుపెట్టిన రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా స్టట్‌గార్ట్ డబ్ల్యుటిఎ టెన్నిస్ టోర్నమెంట్ సెమీ ఫైనల్‌లో జర్మనీ క్రీడాకారిణి క్రిస్టినా మ్లాడెనొవిచ్ చేతిలో 6-3, 5-7, 4-6 తేడాతో ఓటమిపాలైంది.

04/30/2017 - 08:50

పుణే, ఏప్రిల్ 29: ఇంత దారుణంగా ఓడిన తర్వాత ఒక కెప్టెన్‌కు మాట్లాడేందుకు ఏముంటుందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ వాపోయాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత అతను మాట్లాడుతూ విజయం సాధించాల్సిన మ్యాచ్‌లో పరాజయాన్ని ఎదుర్కొన్నామని అన్నాడు. బ్యాటింగ్‌లో రాణించలేక విఫలమై, చేతులారా ఓటమిని కొనితెచ్చుకున్నామని వ్యాఖ్యానించాడు. ప్లే ఆఫ్ దశకు చేరుకునే ఆశలు ఇక లేవని అన్నాడు.

04/30/2017 - 08:48

రాజ్‌కోట్, ఏప్రిల్ 29: చివరి వరకూ ఉత్కంఠ రేపిన ఐపిఎల్ 35వ మ్యాచ్ సూపర్ ఓవర్‌తో ముగిసింది. ఈ మ్యాచ్‌లో గుజరా త్ లయన్స్‌పై ముంబయ ఇండియన్స్ విజయం సాధించింది. అంతకు ముందు, తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్ల లో 9 వికెట్లకు 153 పరుగులు సాధించగా, ఆతర్వాత ముంబయ 20 ఓవర్లలో సరిగ్గా 153 పరుగులు చేసి ఆలౌటైంది.

04/29/2017 - 01:11

కోల్‌కతా, ఏప్రిల్ 28: ఈడెన్ గార్డెన్స్ మైదానంలో శుక్రవారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 గ్రూప్ మ్యాచ్‌లో గౌతం గంభీర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్‌కు సునాయాస విజయాన్ని సాధించిపెట్టాడు. ప్రత్యర్థిని 160 పరుగులకు కట్టడి చేసిన నైట్ రైడర్స్ ఆతర్వాత మరో 22 బంతులు మిగిలి ఉండగానే, మూడు వికెట్ల నష్టంతో లక్ష్యాన్ని ఛేదించింది.

04/29/2017 - 01:08

రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ సంఘం మైదానంలో
శనివారం సాయంత్రం 4 గంటలకు మ్యాచ్ మొదలు

Pages