S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/26/2017 - 08:34

ముంబయి, ఏప్రిల్ 25: ఐపిఎల్‌లో ముంబయి ఇండియన్స్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మకు మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు. సోమవారం ఇక్కడ రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను అంపైర్ నిర్ణయం పట్ల అసమ్మతిని వ్యక్తం చేయడమే ఇందుకు కారణం.

04/26/2017 - 08:31

జొహానె్నస్‌బర్గ్, ఏప్రిల్ 25: మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న దక్షిణాఫ్రికా బౌలర్ లోన్వాబో సొత్సోబ్ (33)పై వేటు పడింది. ఈ ఆరోపణలపై సుదీర్ఘ దర్యాప్తు జరిపించిన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సిఎస్‌ఎ) తక్షణమే అతడిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

04/26/2017 - 08:30

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ఆదాయం పంపిణీ విధానంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి)కి, బిసిసిఐకి మధ్య వివాదం కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా బిసిసిఐ అధ్యక్షుడి హోదాలో ఐసిసి చైర్మన్ పదవి చేపట్టిన శశాంక్ మనోహర్ తీరుపై బిసిసిఐ భగ్గుమంటోంది. బిసిసిఐ ఆదాయానికి గండి కొట్టేందుకు మనోహర్ పన్నుతున్న ఎత్తులకు బిసిసిఐ సైతం అదే స్థాయిలో పై ఎత్తులు వేస్తోంది.

04/26/2017 - 08:29

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: డోపింగ్ టెస్టులో విఫలమైనాడన్న ఆరోపణపై ప్రముఖ భారతీయ ఫుట్‌బాల్ గోల్‌కీపర్ సుబ్రతా పాల్‌పై మంగళవారం తాత్కాలికంగా నిషేధం విధించారు. అయితే మరోసారి ధ్రువీకరణ శాంపిల్ టెస్టును కోరి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని ఆయన అన్నాడు. గత నెల పోటీలు లేని సమయంలో నిర్వహించిన డోపింగ్ టెస్టులో పౌల్ విఫలమయ్యాడని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) కార్యదర్శి కుశాల్ దాస్ చెప్పాడు.

04/26/2017 - 08:28

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: యుఎస్ ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్‌లో భారత్ తన పోరాటాన్ని ఘనంగా ముగించింది. లాస్ వెగాస్‌లో జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో భారత్ మొత్తం 16 పతకాలను కైవసం చేసుకుంది. వీటిలో మూడు పసిడి పతకాలు, రెండు రజత పతకాలు, మరో 11 కాంస్య పతకాలు ఉన్నాయి.

04/26/2017 - 08:28

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్‌కు ఐపిఎల్‌లో అవకాశం లభించింది. ఐపిఎల్-2017 ట్వంటీ-20 టోర్నమెంట్‌లో తీవ్రమైన వైఫల్యాలతో సతమతమవుతున్న గుజరాత్ లయన్స్ యాజమాన్యం వెస్టిండీస్ ఆటగాడు డ్వెయిన్ బ్రావో స్థానంలో ఇర్ఫాన్ పఠాన్‌ను తమ జట్టులో చేర్చుకుంది. ఫిబ్రవరిలో జరిగిన ఐపిఎల్ ఆటగాళ్ల వేలంలో అమ్ముడు పోని ప్రముఖ ఆటగాళ్లలో ఇర్ఫాన్ పఠాన్ ఒకడు.

04/25/2017 - 00:38

బెంగళూరు, ఏప్రిల్ 24: నిరుటి రన్నరప్‌గా ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో బరిలోకి దిగినప్పటికీ, వైఫల్యాల బాటలో నడుస్తున్న రాయల్ చారెంజర్స్ బెంగళూరుకు మంగళవారం నాటి మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని ఈ జట్టు ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో చావుదెబ్బతిన్నది.

04/25/2017 - 00:35

కింగ్‌స్టన్, ఏప్రిల్ 24: వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ తన తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లకు 201 పరుగులు చేసింది. అంతకు ముందు వెస్టిండీస్ 286 పరుగులకు ఆలౌటైంది. మొదటి రోజు ఆటలో విండీస్ 7 వికెట్లకు 244 పరుగులు చేసింది. రెండో రోజు ఆటకు వర్షం వల్ల అంతరాయం కలిగింది.

04/25/2017 - 00:35

ముంబయ, ఏప్రిల్ 24: పదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో హాట్ ఫేవరిట్ ముంబయ ఇండియ న్స్‌కు రైజింగ్ పుణే సూపర్‌జెయంట్స్ షాకిచ్చింది. ఆరు వ రుస విజయాలు సాధించిన ముంబయ దూకుడుకు బ్రేక్ వేసి, మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది.

04/25/2017 - 00:34

టెస్టు క్రికెట్‌లో 10,000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో యూనిస్ ఖాన్ చోటు దక్కించుకున్నాడు. ఈ ఘనతను అందుకున్న 13వ బ్యాట్స్‌మన్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. టెస్టుల్లో పదివేల పరుగుల హీరోలు వీరే..

Pages