S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/30/2015 - 06:40

అడెలైడ్, నవంబర్ 29: క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులను దక్కించుకున్న ఆస్ట్రేలియా మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 138 సంవత్సరాల టెస్టు క్రికెట్ చరిత్రలో మొదటిసారి జరిగిన డే/నైట్ మ్యాచ్‌ని మూడు వికెట్ల తేడాతో కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 208 పరుగులకు ఆలౌట్ చేసిన ఆసీస్ తర్వాత 187 పరుగుల లక్ష్యాన్ని 51 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి అందుకుంది.

11/30/2015 - 06:38

మాడ్రిడ్, నవంబర్ 29: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో బ్రెజిల్ స్టార్ ఆటగాడు నేమార్‌కు ఎందుకు విపరీతమైన క్రేజ్ ఉందో చెప్పడానికి స్పానిష్ సాకర్ లీగ్ లా లిగాలో రియల్ సోసిడాడ్‌తో జరిగిన మ్యాచ్ స్పష్టం చేసింది. రెండు గోల్స్ సాధించిన అతను బార్సిలోనా 4-0 తేడాతో తిరుగులేని విజయాన్ని సాధించడంలో కీలక భూమిక పోషించాడు. మ్యాచ్ 22వ నిమిషంలో అతను కొట్టిన ఫ్లయింగ్ కిక్ అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.

11/30/2015 - 06:38

న్యూఢిల్లీ, నవంబర్ 29: ఇథియోపియాకు చెందిన బిర్హాను లెగెసె, కెన్యా అథ్లెట్ సింథియా లిమో ఆదివారం ఇక్కడ జరిగిన ఢిల్లీ హాఫ్ మారథాన్ రన్ టైటిళ్లు కైవసం చేసుకున్నారు. పురుషుల విభాగంలో లెగెసె తన సహచరుడు మోసినెట్ జెరెమీ కంటే 25 సెకన్లు ముందుగా లక్ష్యాన్ని చేరుకొని విజేతగా నిలిచాడు. తడెసె ఎరీకి మూడో స్థానం దక్కింది. మహిళల విభాగంలో కెన్యా క్లీన్ స్వీప్ చేసింది.

11/30/2015 - 06:37

బెర్లిన్, నవంబర్ 29: ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్‌లో కొత్త చాంపియన్ అవతరించాడు. 11 సంవత్సరాలుగా తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న వ్లాదిమీర్ క్లిచ్కో దూకుడుకు అడ్డుకట్ట వేసిన 27 ఏళ్ల టైసన్ ఫ్యూరీ ప్రపంచ హెవీవెయిట్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు.

11/30/2015 - 06:36

కొచ్చి, నవంబర్ 29: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఆదివారం ప టిష్టమైన గోవా ఫుట్‌బాల్ క్లబ్‌ను ఢీకొన్న కేరళ బ్లా స్టర్స్ చిత్తయంది. 5-1 తేడాతో ఈ మ్యాచ్‌ని కైవసం చేసుకున్న గోవా పాయంట్ల పట్టికలో రెండో స్థానికి చేరింది. డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికో కోల్‌కతా 23 పాయంట్లతో అగ్రస్థానాన్ని ఆక్రమించగా గోవా ఖాతాలో ఇప్పుడు 22 పాయంట్లు ఉన్నాయ.

11/29/2015 - 16:01

గత రెండు సంవత్సరాలుగా మేకావు ఓపెన్ టైటిల్ సాధిస్తూ వచ్చిన తెలుగు తేజం సింధు ఆదివారం జరిగిన ఫైనల్ లో జపాన్ క్రీడాకారిణి మితాని పై గెలిచి టైటిల్ ను నిలబెట్టుకుంది. స్కోర్ : 21-9, 21-13, 21-14

11/29/2015 - 06:46

రాయ్‌పూర్, నవంబర్ 28: హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యుఎల్) ఫైనల్స్ టోర్నమెంట్‌లో శనివారం భారత్, జర్మనీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరు జట్లు చెరొక గోల్ చేశాయ. ఒలింపిక్ చాంపియన్ జర్మనీకే ఈ మ్యాచ్‌లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశే్లషకులు అభిప్రాయపడ్డారు. అయతే, భారత ఆటగాళ్లు సమష్టిగా కృషి చే యడంతో డ్రా సాధ్యమైంది.

11/29/2015 - 06:25

దుబాయ్, నవంబర్ 28: పాకిస్తాన్‌తో చివరి వరకూ ఉత్కంఠగా సాగిన రెండో టి-20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ షహీద్ అఫ్రిదీ చివరి క్షణాల్లో చెలరేగి, ఎనిమిద బంతుల్లోనే ఒక ఫోర్, మూడు సిక్సర్లతో 24 పరుగులు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు సాధించింది.

11/29/2015 - 06:25

న్యూఢిల్లీ, నవంబర్ 28: భారత్, దక్షిణాఫ్రి కా జట్ల మధ్య డిసెంబర్ 3 నుంచి ప్రారంభం కానున్న చివరి, నాలుగో టెస్టుకు ఆతిథ్యం ఇ వ్వనున్న ఫిరోజ్ షా కోట్లా మైదానాన్ని బిసిసి ఐ పిచెస్ అండ్ గ్రౌండ్స్ కమిటీ చైర్మన్ దల్జీత్ సింగ్ శనివారం పరిశీలించాడు. వికెట్‌పై ప గుళ్లు, పచ్చిక వంటి అంశాలను క్షుణ్ణంగా అ ధ్యయనం చేశాడు.

11/29/2015 - 06:25

కివీస్‌పై ఆస్ట్రేలియాకు స్వల్ప ఆధిక్యం పోటాపోటీగా సాగుతున్న డే/నైట్ టెస్టు

Pages