S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/21/2017 - 01:47

కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ గుజరాత్ లయన్స్
కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో శుక్రవారం రాత్రి 8 గంటలకు మొదలు

04/21/2017 - 01:45

ఇండోర్, ఏప్రిల్ 20: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో గురువారం జరిగిన 22వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై ముంబయి ఇండియన్స్ విజయభేరి మోగించింది. హషీం ఆమ్లా సూపర్ సెంచరీతో ప్రత్యర్థి ముందు పంజాబ్ 199 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. అయతే, ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన ముంబయ 15.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

04/21/2017 - 01:42

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: భారత బాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పివి సింధు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి చేరింది. ఐదు నుంచి ఆమె రెండు స్థానాలను మెరుగుపరచుకొని, మూడో స్థానాన్ని అందుకోగా, మరో హైదరాబాదీ, మాజీ ప్రపంచ నంబర్ వన్ సైనా నెహ్వాల్ ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉంది.

04/21/2017 - 01:38

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సుప్రీం కోర్టు నుంచి ఊరట లభించింది. ధోనీని విష్ణుమూర్తి అవతారంగా చూపిస్తూ, అతను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న వివిధ ఉత్పత్తులను అతని చేతుల్లో ఉన్నట్టు ఒక పత్రిక కవర్ పేజీపై ఫొటోను ముద్రించడంతో వివాదం మొదలైన విషయం తెలిసిందే. ‘విష్ణు’ వివాదంపై ఇంతకు ముందు కర్నాటకలో కేసు నమోదైంది.

04/21/2017 - 01:37

పారిస్, ఏప్రిల్ 20: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రష్యా బ్యూటీ మరియా షరపోవా ఆడే విషయంపై నెలకొన్న సస్పెన్స్‌కు వచ్చేనెల 15వ తేదీన తెరపడనుంది. నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగించి, డోప్ పరీక్షలో పట్టుబడిన షరపోవాపై సస్పెన్షన్ వేటు పడింది. శిక్షా కాలాన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఆమె తిరిగి అంతర్జాతీయ కెరీర్‌ను మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నది.

04/21/2017 - 01:36

బార్సిలోనా, ఏప్రిల్ 20: చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ టైటిల్ ఫేవరిట్ బార్సిలోనాకు జువెంటాస్ బ్రేక్ వేసింది. బార్సిలోనాతో క్వార్టర్ ఫైనల్స్ రెండో లెగ్ మ్యాచ్‌ని జువెంటాస్ డ్రా చేసుకుంది. ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. కాగా, క్వార్టర్స్‌లో జరిగిన ఇతర దశల్లో వచ్చిన ఫలితాల ఆదారంగా జువెంటాస్‌కు సెమీస్‌లో స్థానం దక్కింది.

04/21/2017 - 01:35

మెల్బోర్న్, ఏప్రిల్ 20: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) గురువారం ప్రకటించింది. ఈ జట్టులో నలుగురు ఫాస్ట్ బౌలర్లు, మిచెల్ స్టార్క్, జేమ్స్ పాటిన్సన్, జొష్ హాజెల్‌వుడ్, పాట్ కమిన్స్ స్థానం సంపాదించారు. ఈ ఏడాది జూన్ ఒకటి నుంచి 18 వరకు జరిగే చాంపియన్స్ టోర్నీకి ఎంపికైన 15 మంది సభ్యుల బృందంలో హార్డ్ హిట్టర్ క్రిస్ లిన్ కూడా ఉన్నాడు.

04/21/2017 - 01:34

చాంగ్‌జో (చైనా), ఏప్రిల్ 20: ఇక్కడ జరుగుతున్న చైనా మాస్టర్స్ గ్రాండ్ ఫ్రీ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్ పోరాటానికి తెరపడింది. పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో భారత ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్, హర్షీల్ డానీ తమతమ ప్రత్యర్థుల చేతిలో ఓటమిపాలై నిష్క్రమించారు. చివరి వరకూ గట్టిపోటీనిచ్చిన కశ్యప్‌ను మూడో సీడ్ క్వియావో బిన్ 21-10, 20-22, 21-13 తేడాతో ఓడించి ముందంజ వేశాడు.

04/21/2017 - 01:33

లాస్ ఏంజిల్స్, ఏప్రిల్ 20: టెన్నిస్ సూపర్ స్టార్ సెరెనా విలియమ్స్ గర్భవతి కాదా? ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం సెరెనా గర్భవతి అని ప్రచారం జరిగింది. మరో 20 నెలల్లో తొలి బిడ్డకు తల్లికాబోతున్నదన్న వార్త అత్యంత వేగంగా ప్రచారమైంది. కానీ, హఠాత్తుగా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను సెరెనా డిలీట్ చేసింది. దీనితో టెన్నిస్ ప్రపంచంలో గందరగోళం నెలకొంది.

04/20/2017 - 03:41

హైదరాబాద్, ఏప్రిల్ 19:ఐపిఎల్‌లో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. సన్‌రైజర్స్ కూడా ఇప్పటి వరకూ అదే విధానాన్ని అనుసరించింది. అయితే, బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ నెగ్గిన తర్వాత బ్యాటింగ్‌కు మొగ్గు చూపింది. నిరుడు అత్యధిక పరుగులు చేసి, ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్న ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు.

Pages