S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/04/2017 - 01:43

భోపాల్, మార్చి 3: బెలారస్‌తో స్వదేశంలో జరుగుతున్న ఐదు టెస్టుల హాకీ సిరీస్‌లో భారత మహిళా జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో 5-1 గోల్స్ తేడాతో బెలారస్‌ను మట్టికరిపించిన భారత జట్టు తాజాగా శనివారం ఇక్కడ జరిగిన రెండో మ్యాచ్‌లో 2-1 గోల్స్ తేడాతో ప్రత్యర్థులను ఓడించి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.

03/04/2017 - 01:42

అకపుల్కో, మార్చి 3: మెక్సికో ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో టాప్‌సీడ్ నోవాక్ జొకోవిచ్ అనూహ్యంగా మరోసారి ఘోర పరాజయం పాలయ్యాడు. కాగా, మాజీ నంబర్ వన్ క్రీడాకారుడు రాఫెల్ నాదల్ జపాన్ క్రీడాకారుడు యోషిహితో నిషియోకాపై వరస సెట్లలో విజయం సాధించి సెమీఫైనల్స్‌లో స్థానం సాధించాడు. ప్రపంచ ర్యాకింగ్స్‌లో నంబర్ 2 స్థానంలో ఉన్న జొకోవిచ్‌కు ఈ ఏడాదిలో ఇది రెండో ఓటమి.

03/04/2017 - 01:40

మల్హెయిమ్ అన్‌డెర్ రర్ (జర్మనీ), మార్చి 3: జర్మన్ ఓపెన్ గ్రాండ్‌ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత టాప్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ పోరాటం ముగిసింది. ఈ టోర్నీలో 12వ సీడ్‌గా బరిలోకి దిగిన శ్రీకాంత్ శుక్రవారం తెల్లవారు జామున ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్ చేతిలో ఓటమి పాలయ్యాడు.

03/03/2017 - 03:02

దుబాయ్, మార్చి 2: స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రపంచ మాజీ నెంబర్ వన్ ఆటగాడు రోజర్ ఫెదరర్‌కు దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఊహించని షాక్ ఎదురైంది. ఈ టోర్నీలో మూడో సీడ్‌గా బరిలోకి దిగిన ఫెదరర్ గురువారం ఇక్కడ

03/03/2017 - 01:19

హైదరాబాద్, మార్చి 2: భాగ్యనగరంలో రెండవ క్రికెట్ అకాడమీని ప్రారంభిస్తున్నట్లు హైదరాబాద్ స్టైలిష్ బ్యాట్స్‌మన్, టీమిండియా మాజీ ఆటగాడు వివిఎస్.లక్ష్మణ్ గురువారం ప్రకటించాడు. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో దీనిని ఏర్పాటు చేస్తున్నానని, ఏప్రిల్ 3వ తేదీన ప్రారంభమయ్యే సమ్మర్ క్యాంప్‌తో ఈ అకాడమీలో ట్రైనింగ్ సెషన్ మొదలవుతుందని అతను విలేఖరులకు వెల్లడించాడు.

03/03/2017 - 01:17

దుబాయ్, మార్చి 2: దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత నెంబర్ వన్ డబుల్స్ ఆటగాడు రోహన్ బొపన్న, అతని కొత్త భాగస్వామి మార్సిన్ మట్కోవ్‌స్కీ (పోలెండ్) సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు.

03/03/2017 - 01:15

న్యూఢిల్లీ, మార్చి 2: పుణె టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఘోరపరాజయం పాలయిన కోహ్లీ సేనకు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ గట్టి మద్దతుగా నిలిచాడు. ‘గత పది నెలల కాలంలో భారత జట్టు అద్భుతంగా రాణించింది. ప్రతి మ్యాచ్‌నీ గెలిచింది. అయితే ఇప్పుడు వాళ్లు తిరిగి పుంజుకొని గట్టిగా శ్రమించాలి. సొంతగడ్డపైన కూడా ఏ జట్టయినా ఓటమి పాలవుతుంది. గతంలో చాలా జట్లు కూడా ఓటమి పాలయ్యాయి. ఇదే మొదటిసారి కాదు.

03/03/2017 - 01:14

బెంగళూరు, మార్చి 2: నాలుగైదు మ్యాచ్‌లలో విఫలమైనప్పటికీ ఎంతో అనుభవం ఉన్న మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అజింక్య రహానేను జట్టునుంచి తొలగించే ప్రశే్న లేదని టీమిండియా చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే స్పష్టం చేశాడు. పుణెలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో రహానే తొలి ఇనంగ్స్‌లో 13, రెండో ఇన్నింగ్స్‌లో 18 పరుగులు మాత్రమే చేయడం తెలిసిందే.

03/03/2017 - 01:12

న్యూఢిల్లీ, మార్చి 2: కాలిగాయానికి శస్త్ర చేయించుకుని నాలుగు నెలల విశ్రాంతి తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టబోతున్న మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ తాను ఎవరికీ పోటీ కాదని, తనకు తానే పోటీ అని అన్నాడు. భారత జట్టులో స్థానం కోసం అజింక్య రహానే, కరుణ్ నాయర్‌లతో రోహిత్ శర్మ పోటీ పడుతున్న విషయం తెలిసిందే.

03/03/2017 - 01:10

భోపాల్, మార్చి 2: భారత మహిళా హాకీ జట్టు మరోసారి సత్తా చాటుకుంది. గురువారం ఇక్కడ జరిగిన తొలి టెస్టులో 5-1 గోల్స్ తేడాతో బెలారస్ జట్టును మట్టికరిపించింది. భారత మహిళా జట్టు గత ఏడాది ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ సాధించిన తర్వాత మళ్లీ మైదానంలోకి దిగడం ఇదే తొలిసారి.

Pages