S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/18/2016 - 04:44

బెంగళూరు, మే 17: రాయల్ చాలెంజర్స్ బెంగ ళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బుధవారం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లే ఆడేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీ ఎడమ చేతికి బలమైన గాయం తగిలింది. చేతి బొటనవేలు, చూపుడు వేలుకు మధ్య ఉన్న భాగం చిట్లడంతో ఏడెనిమిది కుట్లు కూడా వేశారు.

05/18/2016 - 04:44

మొహాలీ, మే 17: కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియా హార్డ్ హిట్టర్ గ్లేన్ మాక్స్‌వెల్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించడం ఖాయమైన పంజాబ్ గ్రూప్ దశలో మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వీటిలో ఒకటి బుధవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరులో ఆడుతుంది. 21న విశాఖపట్నంలో జరిగే చివరి గ్రూప్ మ్యాచ్‌లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌ను ఢీ కొంటుంది.

05/18/2016 - 04:43

న్యూఢిల్లీ, మే 17: రెజ్లర్లు కోర్టులో కాదు.. శిక్షణా స్థలంలో ఉండాలని సుశీల్ కుమార్, నర్సింగ్ యాదవ్‌లకు ఢిల్లీ హైకోర్టు హితవు పలికింది. రియో ఒలింపిక్స్‌కు ఎవరిని పంపాలనే విషయంలో అత్యవరసమైతేనే జోక్యం చేసుకుంటామని స్పష్టం చేసింది. పోటీదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ)ని ఆదేశించింది.

05/18/2016 - 04:42

న్యూఢిల్లీ, మే 17: చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే 18 మందితో కూడిన భారత హాకీ జట్టుకు గోల్‌కీపర్ శ్రీజేష్ నాయకత్వం వహించనున్నాడు. వచ్చేనెల 10 నుంచి 17 వరకు లండన్‌లో జరిగే ఈ టోర్నీ నుంచి రెగ్యులర్ కెప్టెన్ సర్దార్ సింగ్‌కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. అతని స్థానంలో జట్టు పగ్గాలను శ్రీజేష్‌కు అప్పగించారు.

05/18/2016 - 04:41

కోల్‌కతా, మే 17: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, పించ్ హిట్టర్ ఎబి డివిలియర్స్‌లో ఒకరు బ్యాట్‌మన్‌కాగా, మరొకరు సూపర్‌మన్ అని అదే జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న వెస్టిండీస్ సూపర్ స్టార్ క్రిస్ గేల్ వ్యాఖ్యానించాడు. వీరిద్దరూ 12 మ్యాచ్‌ల్లో 1,349 పరుగులు జోడించారని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గుర్తుచేశాడు. కోహ్లీ, డివిలియర్స్ ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నాడు.

05/17/2016 - 07:33

అహ్మదాబాద్, మే 16: భారత టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన రెండో బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పిన దీపక్ శోధన్ అహ్మదాబాద్‌లోని తన స్వగృహంలో మృతి చెందాడు. భారత టెస్టు క్రికెటర్లలో జీవించి ఉన్న వారిలో ఎక్కువ వయసుగల ఆటగాడిగా గుర్తింపు పొందిన 87 శోధన్ కొంత కాలంగా కేన్సన్ వ్యాధితో బాధపడుతున్నాడు.

05/17/2016 - 07:29

న్యూఢిల్లీ, మే 16: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం కోసం నర్సింగ్ యాదవ్‌తో ట్రయల్ బౌట్ కోసం డిమాండ్ చేస్తున్న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ తనకు న్యాయం చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. పురుషుల రెజ్లింగ్ 74 కిలోల విభాగంలో ఒకరిని రియో ఒలింపిక్స్‌కు పంపే అవకాశం భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ)కి ఉంది.

05/17/2016 - 07:27

మోహాలీ, మే 16: ఒకే ఓవర్‌లో మళ్లీ ఆరు సిక్సర్లు కొడతానని భారత బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు. కేన్సన్ వ్యాధికి చికిత్స పొందుతున్న 17 మంది పిల్లలు పిసిఎ స్టేడియంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడిన మ్యాచ్‌ని చూసేందుకు ప్రత్యేకంగా వచ్చారు. ఆ మ్యాచ్‌లో యువీ 24 బంతులు ఎదుర్కొని అజేయంగా 42 పరుగులు సాధించి సన్‌రైజర్స్‌కు విజయాన్ని అందించిన విషయం తెలిసిందే.

05/17/2016 - 07:25

కోల్‌కతా, మే 16: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సోమవారం జరిగిన ఐపిఎల్ గ్రూప్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తయింది. బెంగళూరు ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 183 పరుగులు చేయగలిగింది. అయితే, బౌలింగ్‌లో దారుణంగా విఫలమైంది. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ చెలరేగిపోగా, అతనికి మద్దతుగా డివిలియర్స్ నిలిచాడు.

05/17/2016 - 07:24

లండన్, మే 16: శ్రీలంక ఫాస్ట్ బౌలర్ ధమ్మిక ప్రసాద్ గురువారం నుంచి హెడింగ్లేలో ఇంగ్లాండ్‌తో మొదలుకానున్న మొదటి టెస్టుకు దూరమయ్యాడు. భుజం గాయం కారణంగా అతను ఈ మ్యాచ్‌లో ఆడడం లేదని శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి) ఒక ప్రకటనలో పేర్కొంది. ఎసెక్స్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు ప్రసాద్ భుజానికి గాయమైంది. అది పూర్తిగా తగ్గకపోవడంతో అతనికి విశ్రాంతినివ్వాలని నిర్ణయించినట్టు ఎస్‌ఎల్‌సి తెలిపింది.

Pages