S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/17/2016 - 07:23

రోమ్, మే 16: రోమ్ మాస్టర్స్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌ను బ్రిటన్ ఆటగాడు ఆండీ ముర్రే గెల్చుకున్నాడు. ఫైనల్‌లో అతను ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్‌ను 6-3, 6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించి సంచలనం సృష్టించాడు. క్లే కోర్టుపై జొకోవిచ్‌పై ముర్రేకు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. ఇలావుంటే, మహిళల విభాగంలో ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ టైటిల్ సాధించింది.

05/17/2016 - 07:21

విశాఖపట్నం (స్పోర్ట్స్), మే 16: ఐపిఎల్ ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌ను ఎదుర్కోవడానికి జహీర్ ఖాన్ నాయకత్వంలోని ఢిల్లీ డేర్‌డెవిల్స్ అస్తశ్రస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నది.

05/17/2016 - 07:20

కున్హాన్ (చైనా), మే 16: మహిళల బాడ్మింటన్ టీం చాంపియన్‌షిప్ ఉబెర్ కప్ టోర్నమెంట్‌లో భారత్ శుభారంభం చేసింది. పురుషుల విభాగంలో థామస్ కప్ కోసం జరుగుతున్న పోరులో మొదటి రోజున థాయిలాండ్‌తో తలపడిన భారత్ 2-3 తేడాతో పరాజయాన్ని ఎదుర్కోగా, మహిళల జట్టు 5-0 తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుచేయడం విశేషం.

05/16/2016 - 06:49

చండీగఢ్, మే 15: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపిఎల్ ప్లే ఆఫ్‌లో స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకుంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ అర్ధ శతకం, చివరిలో యువరాజ్ సింగ్ అద్భుత బ్యాటింగ్ నైపుణ్యం సన్‌రైజర్స్‌ను పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని సంపాదించిపెట్టాయి. ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున షహీం ఆమ్లా చేసిన పోరాటం వృథాకాగా, ఆ జట్టు ఐపిఎల్ నుంచి నిష్క్రమించింది.

05/16/2016 - 06:47

కోల్‌కతా, మే 15: వర్షం కురిసి ఆటకు అంతరాయం ఏర్పడినప్పుడు విజేతను నిర్ణయించడానికి లేదా లక్ష్యాన్ని నిర్ధారించడానికి అనుసరిస్తున్న డక్‌వర్త్ లూయిస్ విధానంపై రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ కోచ్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టెఫెన్ ఫ్లెమింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీనిని మించిన పరమ చెత్త విధానం మరొకటి లేదని వ్యాఖ్యానించాడు.

05/16/2016 - 06:46

బార్సిలోనా, మే 15: స్పానిష్ సాకర్ చాంపియన్‌షిప్ ‘లా లిగా’ టైటిల్‌ను బార్సిలోనా కైవసం చేసుకుంది. గ్రనడాతో జరిగిన మ్యాచ్‌ని 3-0 తేడాతో గెల్చుకొని, మొత్తం 91 పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. లూయిస్ సౌరెజ్ హ్యాట్రిక్‌తో రాణించి బార్సిలోనాకు టైటిల్‌ను సాధించిపెట్టాడు. ఈ టోర్నీలో బార్సిలోనా విజేతగా నిలవడం ఇది 24వ సారి.

05/16/2016 - 06:45

విశాఖపట్నం (స్పోర్ట్స్), మే 15: డిఫెండింగ్ చాంపియన్ గా ఐపిఎల్‌లో బరిలోకి దిగిన ముంబయ ఇండియన్స్ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలిచాయ. ఆదివారం ఢిల్లీ డేర్‌డెవి ల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు 80 పరుగుల భారీ తే డాతో విజయభేరి మోగించింది.

05/16/2016 - 06:45

కున్షాన్ (చైనా), మే 15: థామస్ కప్ కోసం పురుషుల విభాగంలో జరిగే పోటీల్లో మొదటి రోజు భారత్‌కు చుక్కెదురైంది. థాయిలాండ్‌తో తలపడిన భారత్ 2-3 తేడాతో ఓడింది. సింగిల్స్ విభాగంలో సాయి ప్రణీత్, సౌరభ్ వర్మ విజయాలను నమోదు చేయగా, అజయ్ జయరాం చివరి వరకూ పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. మొదటి మ్యాచ్‌లో బరిలోకి దిగిన అజయ్ జయరామ్ 16-21, 21-12, 14-21 తేడాతో తనోన్‌సాక్ సయెసమ్‌బూన్సుక్ చేతిలో పరాజయాన్ని చవిచూశాడు.

05/16/2016 - 06:44

న్యూఢిల్లీ, మే 15: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) పాలక కమిటీ డిప్యూటీ చైర్మన్‌గా భారత విశ్రాంతి న్యాయమూర్తి ముకుల్ ముద్గల్ ఎంపికైనట్టు సమాచారం. అయితే, ఈ విషయంపై తనకు ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం లభించలేదని ముద్గల్ తెలిపారు.

05/15/2016 - 01:14

బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, ఎబి డివిలియర్స్ కలిపి మొత్తం 20 సిక్సర్లు బాదారు. ఇందులో కోహ్లీ 8 సిక్సర్లు కొట్టగా, డివిలియర్స్ 12 సిక్సర్లు సాధించాడు. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్ జాబితాలో అతనికి మూడో స్థానం దక్కింది.

Pages