S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/22/2017 - 01:12

పుణె, ఫిబ్రవరి 21: టీమిండియా తురుపుముక్క అయిన ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌నుంచి తాను నేర్చుకోవలసింది ఎంతో ఉందని ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ అన్నాడు. అంతేకాదు తన బౌలింగ్‌ను మెరుగుపర్చుకోవడం కోసం అతని బౌలింగ్‌ను నిశితంగా గమనిస్తున్నట్లు కూడా అతను చెప్పాడు. ‘అశ్విన్ బౌలింగ్‌ను నేను చాలా చూశాను. అతను ప్రపంచస్థాయి బౌలర్.

02/22/2017 - 01:11

చండీగఢ్, ఫిబ్రవరి 21: అంతర్జాతీయ వార్షిక హాకీ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధమైంది. ఉత్తమ ఆటగాళ్లు, గోల్‌కీపర్లు, రైజింగ్ స్టార్లు, కోచ్‌లు, అంపైర్ల ప్రతిభను గుర్తించి వారిని సత్కరించేందుకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) గురువారం చండీగఢ్‌లో ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

02/22/2017 - 01:09

టెహ్రాన్, ఫిబ్రవరి 21: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జరుగుతున్న మహిళల ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్ మాస్టర్, ‘తెలుగు తేజం’ ద్రోణవల్లి హారిక సెమీఫైనల్‌కు చేరువైంది. క్వార్టర్ ఫైనల్స్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి గేమ్‌లో ఆమె జార్జియాకి చెందిన ననా జగ్నిద్జేపై విజయం సాధించింది. రెండు గేముల మినీ మ్యాచ్‌లో హారిక తొలి గేమ్‌లోనే ప్రత్యర్థిని మట్టికరిపించడం విశేషం.

02/21/2017 - 01:21

బెంగళూరు, ఫిబ్రవరి 20: పదవ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) వేలంలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు జాక్‌పాట్ దక్కింది. ఎవరూ ఊహించని విధంగా అతనిని రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ ఫ్రాంచైజీ 14.50 కోట్ల రూపాయలు వెచ్చించి సొంతం చేసుకుంది. ఈసారి ఐపిఎల్‌లో ఇదే అత్యధిక ధర. పుణే యాజమాన్యం వేలం జరుగుతున్న సమయంలో కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌ను సంప్రదిస్తునే ఉంది.

02/21/2017 - 01:18

బెంగళూరు: అఫ్గానిస్థాన్ యువ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అర్మాన్ అర్మాన్ ఐపిఎల్‌లో కొత్త చరిత్రకు తెరతీశాడు. సోమవారం జరిగిన వేలంలో నాలుగు కోట్ల ధరతో సంచలనం సృష్టించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ భారీ మొత్తాన్ని చెల్లించి రషీద్‌ను తన అమ్ముల పొదిలో చేర్చుకుంది. ఆల్‌రౌండర్ మహమ్మద్ నబీని కూడా సన్‌రైజర్స్ జట్టు కొనుగోలు చేసింది.

02/21/2017 - 01:17

బెంగళూరు: భారత టెస్టు క్రికెటర్లు చటేశ్వర్ పుజారా, ఇశాంత్ శర్మలకు ఫ్రాంచైజీలు షాకిచ్చాయి. అవసరమైతే ఓపెనర్‌గా, లేకపోతే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా సేవలు అందించే సత్తావున్న పుజారాకు 50 లక్షల రూపాయలు, ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మకు రెండు కోట్ల రూపాయలను బేస్ ప్రైస్‌గా నిర్ణయించారు. కానీ, అదే ధరకు తీసుకోవడానికి కూడా ఫ్రాంచైజీలు ముందుకు రాలేదు.

02/21/2017 - 01:15

బెంగళూరు: బెన్ స్టోక్స్, టైమల్ మిల్స్‌కు ఎవరూ ఊహించని ధర పలికితే, చటేశ్వర్ పుజారా, ఇశాంత్ శర్మసహా చాలా మంది పేరుపొందిన క్రికెటర్లకు ఈసారి ఐపిఎల్‌లో చోటు దక్కలేదు. సోమవారం నాటి వేలంలో ఏ జట్టూ ఆసక్తి చూపని ఆటగాళ్లలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ రాస్ టేలర్ (బేస్ ప్రైస్ 50 లక్షలు), భారత జాతీయ జట్టుకు క్రమంగా దూరమైన ఇర్ఫాన్ పఠాన్ (బేస్ ప్రైస్ 50 లక్షలు) వంటి ప్రముఖులు ఉన్నారు.

02/21/2017 - 01:15

బెంగళూరు: నిరుడు భారత క్రికెటర్లలో అత్యధిక ధర పొందిన ఎడమచేతి వాటం స్పిన్నర్ పవన్ నేగీ ఈసారి కోటి రూపాయలతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. నిరుడు వేలంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు అతనికి ఏకంగా 8.5 కోట్ల రూపాయలు చెల్లించింది. అప్పట్లో 30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలానికి వెళ్లిన అతనికి అంత భారీ మొత్తం లభించడం నిరుడు చర్చనీయాంశమైంది.

02/21/2017 - 01:14

కొలంబో, ఫిబ్రవరి 20: మహిళల ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి భారత్ సిద్ధంగా ఉంది. ఈరెండు జట్లు ఇప్పటికే ఐసిసి ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ టోర్నీలో పాల్గొనే అర్హత సంపాదించాయి. దీనితో, మంగళవారం జరిగే క్వాలిఫయర్స్ ఫైనల్ ఫలితం ఇరు జట్లపై ఎలాంటి ప్రభావం చూపదు.

02/20/2017 - 12:37

షార్జా: పాకిస్థాన్ లెజెండ‌రీ ఆల్‌రౌండ‌ర్ షాహిద్ అఫ్రిది మొత్తానికి క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 21 ఏళ్ల కెరీర్‌కు ముగింపు ప‌లుకుతూ ఆదివారం రాత్రి రిటైర్మెట్ ప్ర‌క‌టించాడు. ఇప్ప‌టికే టెస్టులు, వ‌న్డేల నుంచి త‌ప్పుకున్న అఫ్రిది.. 2016లో జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు పాక్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు. అయితే టోర్నీలో పాక్ విఫ‌ల‌మ‌వ‌డంతో కెప్టెన్‌గా త‌ప్పుకున్న అఫ్రిది..

Pages