S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/20/2017 - 12:26

బెంగళూరు: పదో అంచె పోటీల కోసం బెంగళూరు వేదికగా సోమవారం ఆటగాళ్ల వేలం జరిగింది. ఐపీఎల్‌-10లో ఇంగ్లండ్‌ ఆటగాడు బెన్‌ స్టోక్స్‌ రికార్డు ధర పలికాడు. ఆల్‌రౌండర్‌ అయిన స్టోక్స్‌ను రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌ ఈ సీజన్‌లోనే అత్యధికంగా 14.5కోట్లకు కొనుగోలు చేసింది.

02/20/2017 - 08:13

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: మహేంద్ర సింగ్ ధోనీపై రైజింగ్ పుణే సూపర్‌జెయంట్స్ వేటు వేసింది. అతనిని కెప్టెన్సీ నుంచి తప్పించి, ఆ స్థానంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌ను నియమిస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవలే పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి వైదొలగిన ధోనీకి ఇప్పుడు ఐపిఎల్ ఫ్రాంచైజీ నాయకత్వం కూడా చేజారింది.

02/20/2017 - 07:59

ముంబయి, ఫిబ్రవరి 19: భారత్ ‘ఎ’ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ అజేయ డబుల్ సెంచరీతో రాణించడాన్ని మినహాయిస్తే, ఆస్ట్రేలియాతో జరిగిన వామప్ మ్యాచ్ చివరి రోజు ఆట పేలవంగా సాగి, డ్రాగా ముగిసింది. నాలుగు వికెట్లకు 176 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజైన ఆదివారం ఉదయం ఆటను కొనసాగించిన భారత్ ‘ఎ’ 403 పరుగులకు ఆలౌటైంది.

02/20/2017 - 07:59

కొలంబో, ఫిబ్రవరి 19: మహిళల ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ చివరి సూపర్ సిక్స్ మ్యాచ్‌లో భారత్‌తో ఢీకొన్న పాకిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో చిత్తయింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ను ఎక్తా బిస్త్ దారుణంగా దెబ్బతీసింది. ఆమె మెరుపు బౌలింగ్‌ను కుదేలైన పాక్ 43.4 ఓవర్లలో 67 పరుగులకే కుప్పకూలింది. ఎక్తా 10 ఓవర్లు బౌల్ చేసి, కేవలం 8 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టింది.

02/20/2017 - 07:58

బెంగళూరు, ఫిబ్రవరి 19: ఈసారి ఐపిఎల్‌లో అవకాశం కోసం చాలా మంది కొత్త ఆటగాళ్లు ఎదురుచూస్తున్నారు. భారతీయుల విషయానికి వస్తే, పలువురు యువ ఆటగాళ్లు ఐపిఎల్‌లో, తద్వారా టీమిండియాలో అడుగుపెట్టాలని ఆశిస్తున్నారు. ఎడమచేతివాటం ఫాస్ట్ బౌలర్ నటరాజన్ ఇటీవల జరిగిన అంతర్ రాష్ట్ర టి-20 టోర్నమెంట్‌లో పది వికెట్లు పడగొట్టి ఫ్రాంచైజీలను ఆకట్టుకుంటున్నాడు.

02/20/2017 - 07:57

పదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఆటగాళ్ల వేలానికి రంగం సిద్ధమైంది. సోమవారం జరిగే వేలంలో 350 మందికిపైగా ఆటగాళ్లు జాబితాలో ఉంటే, 76 మందికి మాత్రమే అవకాశం దక్కుతుంది. దీనితో, ఎవరు ఐపిఎల్ కుటుంబంలోకి వస్తారు? ఎవరికి నిరాశ ఎదురవుతుంది? అనే ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి. వేలం జాబితాలో ఉన్న ఆటగాళ్లకు కనీస ధర (బేస్ ప్రైస్) 10 నుంచి 2 కోట్ల రూపాయల వరకు ఉంది.

02/20/2017 - 07:56

బెంగళూరు, ఫిబ్రవరి 19: ఈసారి ఐపిఎల్‌లో ఆల్‌రౌండర్లకు ఫ్రాంచైజీలు పెద్దపీట వేయడం ఖాయం. టి-10 ఫార్మాట్‌లో స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ కంటే ఆల్‌రౌండర్లు ఉంటేనే మేలన్న విషయం చాలా సందర్భాల్లో రుజువైంది. అందుకే, ఈసారి ఆల్‌రౌండర్లకు ఫ్రాంచైజీలు ప్రాధాన్యం ఇస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఆతర్వాతి ఆస్థినం ఫాస్ట్ బౌలర్లది. స్పిన్నర్లకు భారీ ధర పలికే అవకాశం లేదని అంటున్నారు.

02/19/2017 - 07:23

ముంబయి, ఫిబ్రవరి 18: ముస్తాక్ అలీ టి-20 అంతర్ మండల క్రికెట్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను ఈస్ట్ జోన్ కైవసం చేసుకుంది. యువ సంచలన ఆటగాడు విరాట్ సింగ్, అనుభవజ్ఞుడు ఇశాంక్ జగ్గీ అర్థ శతకాలతో రాణించగా, వెస్ట్ జోన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌ని ఈస్ట్ ఎనిమిది వికెట్ల ఆధిక్యంతో సొంతం చేసుకుంది. రౌండ్ రాబిన్ విధానంలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో ప్రత్యేకంగా ఫైనల్ అంటూ ఉండదు.

02/19/2017 - 07:20

ముంబయి, ఫిబ్రవరి 18: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు రోజుల వామప్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ‘ఎ’ నాలుగు వికెట్లకు 176 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 85 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. మొదటి రోజు ఆటలో ఆస్ట్రేలియా ఐదు వికెట్లకు 327 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఉదయం ఆటను కొనసాగించి, 434 పరుగుల వద్ద మాథ్యూ వేడ్ (64) వికెట్‌ను చేజార్చుకుంది.

02/19/2017 - 07:20

ముంబయి: కీలక మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ విశేష ప్రతిభ కనబరచింది. సౌత్ జోన్‌తో జరిన చివరి రౌండ్ రాబిన్ మ్యాచ్‌లో చివరి వరకూ పోరాడి, రెండు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ మొదలయ్యే సమయానికి సౌత్, సెంట్రల్ జోన్స్ చెరి రెండు విజయాలు (నాలుగు పాయింట్లు) సాధించి, సమవుజ్జీగా ఉన్నాయి. దీనితో, చివరి రౌండ్ రాబిన్ మ్యాచ్‌ని గెలిచిన జట్టు రన్నరప్‌గా నిలవడం ఖాయమైంది.

Pages