S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/19/2017 - 07:19

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: భారత బాక్సర్లు జితేందర్ కుమార్, అఖిల్ కుమార్ ప్రొఫెషనల్ బాక్సింగ్ ఫైట్స్‌కు సిద్ధమయ్యారు. ఏప్రిల్ ఒకటి నుంచి వీరు తమతమ ప్రత్యర్థులతో ఆరేసి ఫైట్స్‌లో పోరాడతారు. ఆసియా క్రీడల్లో పతకం సాధించిన జితేందర్, కామనె్వల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ అఖిల్ ఇటీవలే ప్రొఫెషనల్స్‌గా మారారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించలేకపోయినప్పటికీ, వీరు చూపిన ప్రతిభ అందరినీ ఆకట్టుకుంది.

02/19/2017 - 07:18

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటిటిఎఫ్) ఆధ్వర్యంలో జరుగుతున్న ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు శరత్ కమల్ సెమీ ఫైనల్ చేరాడు. నువ్వా? నేనా? అన్న చందంగా జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో అతను పాల్ డ్రింక్‌హాల్‌ను 11-4, 10-12, 9-11, 11-6, 11-9, 9-11, 13-11 తేడాతో అతి కష్టం మీద విజయం సాధించాడు.

02/18/2017 - 02:21

ముంబయి, ఫిబ్రవరి 17: భారత్ ‘ఎ’తో శుక్రవారం ప్రారంభమైన మూడు రోజుల వామప్ మ్యాచ్ మొదటి రోజు ఆటలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ విజృంభణ కొనసాగింది. ఆట ముగిసే సమయానికి, తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లకు 327 పరుగులు చేసింది. నిజానికి ముగ్గురు బ్యాట్స్‌మెన్ అవుట్‌కాగా, సెంచరీలతో విజృంభించిన కెప్టెన్ స్టీవెన్ స్మిత్, షాన్ మార్ష్ తమ సహచరులకు బ్యాటింగ్ ప్రాక్టీస్‌ను ఇవ్వడానికి రిటైర్డ్ అవుటయ్యారు.

02/18/2017 - 00:48

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: భారత టేబుల్ టెన్నిస్ సీనియర్ ఆటగాడు శరత్ కమల్ ఐటిటిఎఫ్ ఇండియన్ ఓపెన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్ చేరాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 62వ స్థానంలో ఉన్న అతను ప్రీ క్వార్టర్స్‌లో 24వ ర్యాంకర్ యూటో మురమత్సును 11-8, 11-7, 11-4, 14-16, 11-5 తేడాతో ఓడించాడు.

02/18/2017 - 00:47

మెల్బోర్న్, ఫిబ్రవరి 17: ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం చివరి వరకూ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి బంతిని చామర కపుగడేర బౌండరీకి తరలించి, లంకను గెలిపించాడు. టాస్ గెలిచి శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోగా, ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌కు దిగి 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 168 పరుగులు చేసింది.

02/18/2017 - 00:46

ఆక్లాండ్, ఏప్రిల్ 17: న్యూజిలాండ్‌తో జరిగిన ఏకైక టి-20 మ్యాచ్‌ని దక్షిణాఫ్రికా 78 పరుగుల తేడాతో కైవసం చేసుకుంది. స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ ఐదు వికెట్లు సాధించి, కివీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను తీవ్రంగా దెబ్బతీశాడు. తన బౌలింగ్ ప్రతిభతో జట్టును గెలిపించిన తాహిర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తన బ్యాటింగ్ బలంపై విపరీతమైన నమ్మకంతో ఫీల్డింగ్‌ను ఎంచుకుంది.

02/18/2017 - 00:45

కొలంబో, ఫిబ్రవరి 17: మహిళల ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ సూపర్ సిక్స్‌లో గురువారం బంగ్లాదేశ్‌ను ఢీకొన్న భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఓపెనర్ మోనా మెష్రామ్, కెప్టెన్ మిథాలీ రాజ్ అజేయ అర్ధ శతకాలతో రాణించి, భారత్ విజయాన్ని సులభతరం చేశారు. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.

02/18/2017 - 00:43

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ఫీల్డింగ్‌లో మార్పులుచేర్పుల నుంచి బంతి దిశ, వేగాన్ని నిర్దేశించుకునే వరకూ బౌలర్లకు కెప్టెన్ విరాట్ కోహ్లీ పూర్తి స్వేచ్ఛనిస్తాడని భారత పే సర్ ఉమేష్ యాదవ్ అన్నాడు. శుక్రవారం అతను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కోహ్లీను బౌలర్ల పక్షపాతిగా అభివర్ణించాడు. సమయానుకూలంగా వ్యూహాల్లో మార్పులను బౌలర్లు కోరుకున్నప్పుడు కోహ్లీ సానుకూలంగా స్పందిస్తాడని చెప్పాడు.

02/18/2017 - 00:42

తెహ్రాన్ (ఇరాన్), ఫిబ్రవరి 17: భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఇక్కడ జరుగుతున్న మహిళల ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ఇంటర్నేషనల్ మాస్టర్ పద్మినీ రావత్ కూడా ప్రీ క్వార్టర్స్‌లో అడుగుపెట్టడం విశేషం. దినారా సడుకసొవాతో తలపడిన హారిక చక్కటి ఎత్తుగడలతో ప్రత్యర్థిని ఆత్మరక్షణలోకి నెట్టింది.

02/17/2017 - 01:38

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ఈసారి కొత్త ఒరవడికి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) శ్రీకారం చుట్టింది. ఎనిమిది జట్లు పోటీపడే 10వ ఐపిఎల్‌లో ఒక్కో జట్టు హోం గ్రౌండ్‌లో ఆడే తొలి మ్యాచ్‌లకు ముందు ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. వీటి కోసం ప్రతిపాదనలను ఆహ్వానించింది.

Pages