S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/16/2017 - 01:14

వెల్లింగ్టన్, ఫిబ్రవరి 15: ఇటీవల కాలంలో చక్కటి ఫామ్‌ను కొనసాగిస్తున్న న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ కండరాలు బెణకడంతో కొంతకాలం విశ్రాంతి తీసుకోవడం అనివార్యమైంది. దీనితో అతను దక్షిణాఫ్రికాతో ఈనెల 17న జరిగే ఏకైక టి-20 మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ టూర్‌లో దక్షిణాఫ్రికా ఐదు వనే్డలు, మరో మూడు టెస్టులు కూడా ఆడుతుంది.

02/16/2017 - 01:12

ముంబయ, ఫిబ్రవరి 15: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2017 షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) బుధవారం విడుదల చేసింది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌తోపాటు ఫైనల్ కూడా హైదరాబాద్‌లోనే జరగనుండడం విశేషం. ఏప్రిల్ 5న హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో డిఫెం డింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్, రన్నరప్ రాయల్ చా లెంజర్స్ బెంగళూరు జట్లు ఢీ కొంటాయ.

02/16/2017 - 01:12

ముంబయి, ఫిబ్రవరి 15: భారత్‌తో జరగబోయే నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సిద్ధమయ్యేందుకు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కసరత్తు చేస్తున్నది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్, ఇతర సభ్యులు బుధవారం ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. సోమవారం రాత్రి ముంబయి చేరుకున్న ఆసీస్ క్రికెటర్లు ఒక రోజు విరామం తీసుకున్న తర్వాత, బుధవారం నెట్స్‌కు హాజరయ్యారు.

02/16/2017 - 01:11

కొలంబో, ఫిబ్రవరి 15: మహిళల క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో సూపర్ సిక్స్ స్థాయిలో మొదటి మ్యాచ్‌ని దక్షిణాఫ్రికాపై గెల్చుకున్న భారత్ శుభారంభం చేసింది. మిథాలీ రాజ్, మోనా మెష్రామ్ అర్ధ శతకాలతో రాణించడంతో 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 205 పరుగులు సాధించిన భారత్ ఆతర్వాత దక్షిణాఫ్రికాను 46.4 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌట్ చేసి, 49 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది.

02/16/2017 - 01:10

ముంబయి, ఫిబ్రవరి 15: ముస్తాక్ అలీ టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో బుధవారం సౌత్‌జోన్‌ను ఢీకొన్న ఈస్ట్‌జోన్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇశాంక్ జగ్గీ విజృంభణ ఈస్ట్‌ను విజయపథంలో నడిపించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన సౌత్‌జోన్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 178 పరుగులు సాధించింది.

02/15/2017 - 01:41

ముంబయి, ఫిబ్రవరి 14: పసికూన బంగ్లాదేశ్‌పై సోమవారం హైదరాబాద్‌లో ఘనవిజయం సాధించి సత్తా చాటుకున్న భారత క్రికెట్ జట్టే ఈ నెల 23వ తేదీ నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లను ఆడనుంది. అయితే లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా గాయంతో బాధపడుతుండటంతో అతనికి ఈ జట్టులో చోటు కల్పించలేదు.

02/15/2017 - 01:39

టెహ్రాన్ (ఇరాన్), ఫిబ్రవరి 14: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జరుగుతున్న మహిళల ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో ‘తెలుగు తేజం’ ద్రోణవల్లి హారిక శుభారంభాన్ని సాధించింది. ఈ టోర్నమెంట్‌లో నాలుగో సీడ్ గ్రాండ్ మాస్టర్‌గా బరిలోకి దిగిన హారిక తొలి రౌండ్ పోరులో బంగ్లాదేశ్‌కు చెందిన షమీమా అక్తర్ లిజాను మట్టికరిపించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది.

02/15/2017 - 01:38

మొనాకో, ఫిబ్రవరి 14: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ వా టీమిండియా ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను బౌలింగ్‌లో డాన్‌బ్రాడ్‌మన్‌తో పోల్చడమే కాదు, రాబోయే భారత పర్యటన సందర్భంగా ఆస్ట్రేలియా క్రికెటర్లు అధిగమించాల్సిన ఆటగాడు అతనేనని కూడా అభిప్రాయ పడ్డాడు.

02/15/2017 - 01:36

కొలంబో, ఫిబ్రవరి 14: ప్రపంచ మహిళల వనే్డ క్రికెట్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అగ్రస్థానానికి చేరువైంది.

02/15/2017 - 01:35

నాగ్‌పూర్, ఫిబ్రవరి 14: భారత అండర్-19 జట్టుతో రెండు మ్యాచ్‌ల యూత్ టెస్టు క్రికెట్ సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (విసిఎఎస్)లో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ అండర్-19 జట్టు కెప్టెన్ మ్యాక్స్ హోల్డెన్ (170)తో పాటు ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ జార్జ్ బర్ట్‌లెట్ (179) అద్భుత ప్రదర్శనతో సత్తా చాటుకున్నారు.

Pages