S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/15/2017 - 01:33

ముంబయి, ఫిబ్రవరి 14: ముంబయిలోని హిల్ స్ప్రింగ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్న కుష్ భగత్‌కు ప్రపంచ చదరంగ సమాఖ్య (ఫైడ్) మంగళవారం క్యాండిడేట్ మాస్టర్ (సిఎం) టైటిల్‌ను ప్రదానం చేసింది. భగత్ గత ఆరు నెలల నుంచి వివిధ ప్రముఖ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబర్చి సత్తా చాటుకోవడంతో అతడిని ఈ టైటిల్ వరించింది.

02/15/2017 - 01:33

వెల్లింగ్టన్, ఫిబ్రవరి 14: నేపియర్‌లో వచ్చే నెల దక్షిణాఫ్రికాతో జరగాల్సిన నాలుగో వన్‌డే మ్యాచ్‌కి వేదిక అయిన మెక్‌లీన్ పార్క్ మైదానంలో డ్రైనేజి వ్యవస్థ సరిగా లేని కారణంగా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఆ మ్యాచ్ వేదికను హామిల్టన్‌కు మార్చింది.

02/15/2017 - 01:32

ముంబయి, ఫిబ్రవరి 14: భారత్‌తో త్వరలో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ సందర్భంగా భారత ఆటగాళ్లతో మాటల యుద్ధానికి దిగాలా వద్దా అనే విషయాన్ని జట్టులోని ఆటగాళ్లకే వదిలిపెట్టాలనుకుంటున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ చెప్పాడు. మా జట్టులో ప్రతి వ్యక్తీ తాను ఎలా ఆడాలనుకున్నాడో ఆలాగే ఆడతాడని నేను అనుకొంటున్నాను.

02/15/2017 - 01:31

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: భారత సీనియర్ హాకీ జట్టు సభ్యుడు సందీప్ సింగ్ దేశంలో గౌరవ డాక్టరేట్‌ను పొందిన రెండవ హాకీ ఆటగాడిగా ఆవిర్భవించాడు. మైదానంలో అత్యంత ప్రమాదకరమైన డ్రాగ్-్ఫ్లకర్‌గా ఖ్యాతి పొందిన సందీప్ సింగ్‌ను దేశ్ భగత్ యూనివర్శిటీ (పంజాబ్‌లోని ఫతేఘర్ సాహిబ్ జిల్లా అమోహ్‌లోని ప్రైవేటు విద్యాసంస్థ) గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.

02/15/2017 - 01:30

జంషెడ్‌పూర్, ఫిబ్రవరి 14: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఈ నెల 17 నుంచి 23వ తేదీ వరకు ప్రపంచ కప్ రోల్‌బాల్ నాలుగో ఎడిషన్ పోటీలను నిర్వహించనున్నారు. డిఫెండింగ్ చాంపియన్ భారత్ సహా 45 దేశాలకు చెందిన దాదాపు 700 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

02/14/2017 - 01:35

హైదరాబాద్, ఫిబ్రవరి 13: బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టును భారత్ 208 పరుగుల తేడాతో గెల్చుకుంది. అయితే, తన స్థాయితో పోలిస్తే, ఎన్నో రెట్లు ఎక్కువగా శ్రమించి, చివరి వరకూ పోరాడిన ‘పసికూన’ బంగ్లాదేశ్ ఈ టెస్టును కోల్పోయినప్పటికీ అందరి ప్రశంసలు అందుకుంది. టీమిండియాను భారత్‌లో ఎదుర్కొని, మ్యాచ్‌ని చివరి రోజు వరకూ దొర్లించడమే బంగ్లాదేశ్ ప్రతిభకు నిదర్శనం.

02/14/2017 - 01:31

హైదరాబాద్: భారత్‌లో పర్యటిస్తూ ఒక జట్టు రెండు ఇన్నింగ్స్‌లోనూ వంద కంటే ఎక్కువ ఓవర్లు బ్యాట్ చేయ డం 2012 తర్వాత ఇదే మొదటిసారి. 2012 నాగపూర్ టెస్టు లో చివరిసారి ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 145.5, రెం డో ఇన్నింగ్స్‌లో 154 ఓవర్లు ఆడింది. ఇప్పుడు ముష్ఫికర్ ర హీం నాయకత్వంలోని బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 127.5, రెండో ఇన్నింగ్స్‌లో 103.3 ఓవర్లు బ్యాటింగ్ చేసిం ది.

02/14/2017 - 01:28

భారత్ మొదటి ఇన్నింగ్స్: 166 ఓవర్లలో 6 వికెట్లకు 687 డిక్లేర్డ్ (మురళీ విజయ్ 100, చటేశ్వర్ పుజారా 83, విరాట్ కోహ్లీ 204, ఆజింక్య రహానే 82, వృద్ధిమాన్ సాహా 106 నాటౌట్, రవీంద్ర జడేజా 60 నాటౌట్, మెహదీ హసన్ మీర్జా 2/165, తైజుల్ ఇస్లాం 3/156).

02/14/2017 - 01:26

కొలంబో, ఫిబ్రవరి 13: మహిళల ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో స్పిన్నర్ పూనమ్ యాదవ్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ బౌలింగ్ విశే్లషణతో విజృంభించి, భారత్ విజయంలో ముఖ్య భూమిక పోషించింది. ఆమె బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోయిన జింబాబ్వే 28.5 ఓవర్లలో 60 పరుగులకే ఆలౌట్‌కాగా, నామమాత్రపు లక్ష్యాన్ని భారత్ తొమ్మిది ఓవర్లలో, కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది.

02/14/2017 - 01:22

హైదరాబాద్, ఫిబ్రవరి 13: తమ దృష్టి మొత్తం ఆస్ట్రేలియాతో జరగబోయే నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌పైనే కేంద్రీకృతమైందని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టును గెల్చుకున్న తర్వాత, ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డును స్వీకరించిన అతను మాట్లాడుతూ ఆసీస్‌తో ఈనెల 23 నుంచి పుణేలో మొదలయ్యే మొదటి టెస్టు కోసం ఎదురుచూస్తున్నామని అన్నాడు.

Pages