S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/04/2017 - 00:46

మెల్బోర్న్, ఫిబ్రవరి 3: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని తమ ప్రధాన శత్రువుగా ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్ మైఖేల్ హస్సీ అభివర్ణించాడు. అయితే, అతనిని రెచ్చగొడితే దారుణ పరాభవాలు తప్పవని త్వరలో భారత్‌లో పర్యటించే ఆస్ట్రేలియా క్రికెటర్లను హెచ్చరించాడు. ఈనెల 23 నుంచి మొదలయ్యే సిరీస్‌లో కోహ్లీని ఎంత త్వరగా పెవిలియన్‌కు పంపాలనే విషయంపై కసరత్తు చేయాలని, పటిష్టమైన వ్యూహరచనతో ముందుకు వెళ్లాలని సూచించాడు.

02/04/2017 - 00:44

పుణే, ఫిబ్రవరి 3: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఎఐటిఎ) అధ్యక్షుడిగా పాలనా వ్యవహారాల్లో అపారమైన అనుభవం ఉన్న ప్రవీణ్ మహాజన్ ఎన్నికయ్యాడు. శుక్రవారం ఇక్కడ జరిగిన సర్వసభ్య సమావేశం ఎన్నికైన అతను 2020 వరకూ పదవిలో ఉంటాడు.

02/04/2017 - 00:44

సెయింట్ జోన్స్, ఫిబ్రవరి 3: వెస్టిండీస్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టువర్ట్ లా ఎంపికయ్యాడు. రెండేళ్లపాటు అమల్లో ఉండే ఒప్పందాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి)తో కుదుర్చుకోవడం ఎంతో ఆనందంగా ఉందని 48 ఏళ్ల లా ఒక ప్రకటనలో తెలిపాడు. తన కోచింగ్ కెరీర్‌లో ఇది ఒక మైలురాయిలా నిలిచిపోతుందని పేర్కొన్నాడు.

02/04/2017 - 00:43

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ, ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న భారత మాజీ బాక్సర్, ఆసియా క్రీడల పతక విజేత డింకో సింగ్‌కు అండగా నిలుస్తామని కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ హామీ ఇచ్చారు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (ఎయిమ్స్)లో చికిత్స పొందుతున్న డింకో సింగ్ వైద్యానికయ్యే ఖర్చులను చెల్లించలేక, ఇటీవలే ఇంటిని అమ్మేశాడని వచ్చిన వార్తలపై గోయల్ స్పందించారు.

02/04/2017 - 00:43

పుణే, ఫిబ్రవరి 3: న్యూజిలాండ్‌తో శుక్రవారం మొదలైన డేవిస్ కప్ ఆసియా/ ఓషియానియా గ్రూప్-1 డేవిస్ కప్ పోటీల్లో భారత్ శుభారంభం చేసింది. రెండు సింగిల్స్‌లోనూ భారత ఆటగాళ్లు విజయాలు నమోదు చేసి, 2-0 ఆధిక్యాన్ని సంపాదించిపెట్టారు. తొలి మ్యాచ్‌లో యుకీ భంబ్రీ 6-4, 6-4, 6-3 ఆధిక్యంతో ఫిన్ టియర్నీని ఓడించాడు. మరో మ్యాచ్‌లో రాంకుమార్ రామనాథన్ 6-3, 6-4, 6-3 తేడాతో జోస్ స్ట్థామ్‌పై గెలిచాడు.

02/03/2017 - 05:14

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రపంచ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ మూడు విభాగాల్లో మూడు స్థానాలను ఆక్రమించాడు. టి-20లో నంబర్ వన్ స్థానంలో ఉన్న అతను టెస్టుల్లో రెండు, వనే్డ ఇంటర్నేషనల్స్ ఫార్మాట్‌లో మూడు స్థానాల్లో కొనసాగుతున్నాడు. మొత్తం మీద ఒకటి, రెండు, మూడు స్థానాలను దక్కించుకొని ప్రత్యేకతను చాటుకున్నాడు.

02/03/2017 - 01:17

దుబాయ్, ఫిబ్రవరి 2: టి-20 ఫార్మాట్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా వెలుగుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్, బ్యాటింగ్ విభాగంలో అతను టెస్టుల్లో రెండు, వనే్డల్లో మూడు స్థానాల్లో ఉన్నాడు. టి-20 ఫార్మాట్‌లో కోహ్లీ 799 పాయింట్లతో నంబర్‌వన్‌గా నిలవగా, ఆరోన్ ఫించ్ (771), గ్లేన్ మాక్స్‌వెల్ (783) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

02/03/2017 - 01:15

పుణే, ఫిబ్రవరి 2: భారత వెటరన్ టెన్నిస్ స్టార్, 43 ఏళ్ల లియాండర్ పేస్ మరో రికార్డును సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. గురువారం నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే డేవిస్ కప్ పోరులో విష్ణువర్ధన్ భాగస్వామిగా అతను డబుల్స్ విభాగంలో పోటీపడతాడు. ఇప్పటికే డేవిస్ కప్‌లో ఎక్కువ కాలం ఆడిన ఆటగాడిగా పేస్ రికార్డు సృష్టించాడు. అతను 25 సంవత్సరాలుగా ఈ పోటీల్లో ఆడుతున్నాడు.

02/03/2017 - 01:14

పాట్నా, ఫిబ్రవరి 2: టాప్ షట్లర్లు సైనా నెహ్వాల్, పివి సింధు గురువారం నుంచి ప్రారంభం కానున్న 81 సీనియర్ జాతీయ చాంపియన్‌షిప్స్ నుంచి వైదొలిగారు. సైనా ఇటీవలే మలేసియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ టైటిల్‌ను సాధించిన విషయం తెలిసిందే. ఫైనల్‌లో ఆమె పోర్న్‌పవీ చొచువనాను 22-20, 22-20 తేడాతో ఓడించింది.

02/03/2017 - 01:12

నాపీర్, ఫిబ్రవరి 2: న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య గురువారం జరగాల్సిన రెండో వనే్డ ఇంటర్నేషనల్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా బౌల్ కాకుండానే రద్దయింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకూ ఇక్కడ భారీ వర్షం కురిసింది. ఆతర్వాత వర్షం తగ్గినప్పటికీ, అవుట్ ఫీల్డ్ మొత్తం బురదమయం కావడంతో, అంపైర్లు పలుమార్లు పరీక్షించారు. చివరికి పరిస్థితులు ఆటకు అనువుగా లేవని ప్రకటించారు.

Pages