S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/03/2017 - 01:11

బెంగళూరు, ఫిబ్రవరి 2: భారత యువ లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్‌పై కెప్టెన్ విరాట్ కోహ్లీసహా పలువురు క్రికెటర్లు, అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి, మూడో టి-20లో అసాధారణ ప్రతిభ కనబరచిన చాహల్ 25 పరుగులకే ఆరు వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సంపాదించుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గానూ అతను ఎంపికయ్యాడు.

02/03/2017 - 01:10

చెన్నై, ఫిబ్రవరి 2: రికీ భుయ్ ఒంటరి పోరాటం కొనసాగించి, 44 ఓవర్లలో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 61 పరుగులు చేసినప్పటికీ, కెప్టెన్ హనుమ విహారి (37) తప్ప మిగతా వారు రాణించలేకపోవడంతో ఆంధ్ర జట్టు ఓటమిపాలైంది. ముస్తాక్ అలీ అంతర్ రాష్ట్ర టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా, సౌత్‌జోన్ విభాగంలో తమిళనాడుతో పోటీపడిన ఆంధ్ర 37 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది.

02/03/2017 - 01:08

బెంగళూరు, ఫిబ్రవరి 2: పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగిన మహేంద్ర సింగ్ ధోనీ టీచర్ అవతారం ఎత్తాడు. టెస్టు కెప్టెన్‌గా కొంత అనుభవం ఉన్నప్పటికీ, వనే్డ, టి-20 ఫార్మాట్లలో జట్టుకు మొదటిసారి పూర్తికాల సారథిగా బాధ్యతలు నిర్వరిస్తున్న విరాట్ కోహ్లీకి పాఠాలు చెప్తున్నాడు. తానే స్వయంగా సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ, అంతా తానై నడిపిస్తున్నాడు ‘జార్ఖండ్ డైనమెట్’ ధోనీ.

02/03/2017 - 01:06

దర్బన్, ఫిబ్రవరి 2: శ్రీలంకతో జరిగిన రెండో వనే్డ ఇంటర్నేషనల్‌లో డేవిడ్ మిల్లర్, ఫఫ్ డుప్లెసిస్ శతకాలతో కదం తొక్కడంతో దక్షిణాఫ్రికా 121 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఈ జట్టు 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 307 పరుగులు చేసింది. మిల్లర్ 98 బంతుల్లోనే 117 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. డుప్లెసిస్ 120 బంతులు ఎదుర్కొని 105 పరుగులు చేశాడు.

02/02/2017 - 09:32

బెంగళూరు, ఫిబ్రవరి 1: సిరీస్‌ను ఖరారు చేసే చివరి, మూడో టి-20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చిత్తుగా ఓడింది. యుజువేంద్ర చాహల్ కేవలం 25 పరుగులకే ఆరు వికెట్లు పడగొట్టి, భారత్ ఘన విజయానికి తోడ్పడ్డాడు. ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ని గెల్చుకున్న విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా మూడో మ్యాచ్‌నీ సొంతం చేసుకొని, సిరీస్‌ను 2-1 తేడాతో తన ఖాతాలో వేసుకుంది.

02/02/2017 - 09:31

సిడ్నీ, ఫిబ్రవరి 1: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్‌పై ఏడాది సస్పెన్షన్ వేటు పడింది. ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) నిబంధనలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అతను తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. 2015లో వరుసగా మూడు పర్యాయాలు తాను ఎప్పుడు, ఎక్కడ ఉంటాననే విషయాన్ని అతను తెలియచేయలేదని వాడా ప్రకటించింది.

02/02/2017 - 09:30

సిడ్నీ, ఫిబ్రవరి 1: పించ్ హిట్టర్‌గా పేరు పొందిన క్రిస్ లిన్‌కు ఆస్ట్రేలియా టి-20 జట్టులో స్థానం దక్కింది. శ్రీలంకతో ఆసీస్ మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్ ఆడుతుంది. మొదటి మ్యాచ్ 17న అడెలైడ్‌లో, రెండో మ్యాచ్ 19న గీలాంగ్‌లో, చివరిదైన మూడో మ్యాచ్ అడెలైడ్‌లో జరుగుతాయి. కాగా, ఇటీవల జరిగిన బిగ్ బాష్‌లో బ్రిస్బేన్ హీట్స్‌కు వెన్నుముకగా నిలిచిన క్రిస్ లిన్ మెడనొప్పి కారణంగా సెమీ ఫైనల్‌లో ఆడలేదు.

02/02/2017 - 09:29

ముంబయి, ఫిబ్రవరి 1: అండర్-19 క్రికెట్ వనే్డ సిరీస్‌పై భారత్ ఆశలు సజీవంగా నిలిచాయి. ఓపెనర్ హిమాంశు రాణా, వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ హార్విక్ దేశాయ్ అర్ధ శతకాలతో రాణించడంతో భారత్ మెరుగైన స్కోరు సాధించగలిగింది. ఆతర్వాత కెప్టెన్ అనుకుల్ రాయ్ మూడు వికెట్లు పడగొట్టి, భారత్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 287 పరుగులు చేసింది.

02/02/2017 - 09:28

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర ప్రభుత్వం ఇది వరకు ప్రకటించిన విధంగానే క్రీడలకు బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యం ఇచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో క్రీడలకు 1,943 కోట్ల రూపాయలు కేటాయించారు. నిరుడు ఇది 1,592 కోట్ల రూపాయలుకాగా, ఈ ఏడాది 350 కోట్ల రూపాయలు పెంచడం గమనార్హం.

02/01/2017 - 00:10

బెంగళూరు, జనవరి 31: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల అంతర్జాతీయ ట్వంటీ-20 క్రికెట్ సిరీస్‌లో కీలకమైన చివరి మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చేందుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సిద్ధమైంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌లలో ఇరు జట్లు చెరో విజయాన్ని అందుకుని సమ ఉజ్జీలుగా నిలిచిన విషయం విదితమే.

Pages