S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/31/2017 - 01:07

బిసిసిఐలో నాది నైట్‌వాచ్‌మన్ పాత్ర. బోర్డుకు ఎన్నికైన కార్యవర్గంతో కలిసి పాలనా వ్యవహారాలు సజావుగా సాగేలా చూడడమే నా బాధ్యత. సుప్రీం కోర్టు నాపై నమ్మకం ఉంచి, ఒక బాధ్యతను అప్పచెప్పింది. అత్యున్నత న్యాయ స్థానం తీసుకున్న నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే. బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడానికి సర్వశక్తులు ఒడ్డాల్సిందే. నేను క్రికెట్ ప్రేమికుడ్ని.

01/31/2017 - 01:05

బిసిసిఐలో ఉత్తమ పాలనకు కృషి చేస్తాం. సుప్రీం కోర్టు మాకు అప్పగించిన బాధ్యత ఇదే. దీనినే మా కమిటీ ఎలాంటి పొరపాట్లు లేకుండా సక్రమంగా నిర్వర్తిస్తుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం నన్ను ఈ పనికి ఎంపిక చేయడం ఎంతో ఆనందంగా ఉంది. దీనిని నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. బిసిసిఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి, కోశాధికారి అనిరుద్థ్ చౌదరితో చర్చించిన తర్వాతే ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుంది.

01/31/2017 - 01:03

మెల్బోర్న్, జనవరి 30: హోరాహోరీగా జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌లో రాఫెల్ నాదల్‌ను ఓడించి, కెరీర్‌లో 18వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను సాధించిన ఫెదరర్ త్వరలోనే అంతర్జాతీయ కెరీర్‌గు గుడ్‌బై చెప్పనున్నాడా? ఐదేళ్ల విరామం తర్వాత గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను అందుకున్న అతను ఈ విజయంతోనే కెరీర్‌కు గుడ్‌బై చెప్తాడా? నాదల్‌పై విజయం సాధించిన అనంతరం ఫెదరర్ చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు కారణమవుతున్నాయి.

01/31/2017 - 01:03

నాగపూర్, జనవరి 30: వయసు అనేది కేవలం అంకెలకు మాత్రమే పరిమితమయ్యే అంశమని, తన మనసుకు మాత్రం దాని ప్రభావం లేదని భారత వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో జాతీయ జట్టుకు సెలక్టర్లు అతనిని ఎంపిక చేసినప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. 37 ఏళ్ల ఆటగాడి నుంచి ఏం ఆశించి జట్టులోకి తీసుకున్నారంటూ సెలక్టర్లను చాలా మంది నిలదీశారు. అయితే, తన ఎంపిక సరైనదేనని అతను నిరూపించాడు.

01/30/2017 - 02:18

మెల్బోర్న్‌లో ఆదివారం జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఫైనల్‌లో రాఫెల్ నాదల్‌ను ఓడించి టైటిల్ సాధించిన స్విట్జర్లాండ్ వీరుడు రోజర్ ఫెదరర్

01/30/2017 - 00:58

మెల్బోర్న్, జనవరి 29: వెటరన్ ఆటగాడు, స్విట్జర్లాండ్ సూపర్ స్టార్ రోజర్ ఫెదరర్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. 35 ఏళ్ల వయసులోనూ తన ఫిట్నెస్ స్థాయిని నిరూపిస్తూ, కెరీర్‌లో 18వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం ఇక్కడ చివరి వరకూ హోరాహోరీగా జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో అతను చిరకాల ప్రత్యర్థి, ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్‌ను 6-4, 3-6, 6-1, 3-6, 6-3 తేడాతో ఓడించాడు.

01/30/2017 - 00:57

నాగపూర్, జనవరి 29: ఇంగ్లాండ్‌తో ఆదివారం జరిగిన రెండో టి-20 మ్యాచ్‌ని గెల్చుకున్న భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌పై ఆశలు సజీవంగా నిలబెట్టుకుంది. చివరి బంతి వరకూ అంతులేని ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో 145 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన ఇంగ్లాండ్ ఐదు పరుగుల తేడాతో ఓడింది. జస్‌ప్రీత్ బుమ్రా చివరి ఓవర్‌ను అద్భుతంగా వేసి, భారత్ విజయంలో ప్రధాన భూమిక పోషించాడు.
రాహుల్ పోరాటం

01/30/2017 - 00:55

మెల్బోర్న్: మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో క్రొయేషియాకు చెందిన ఇవాన్ డోడింగ్‌తో కలిసి ఆడిన సానియా మీర్జా ఫైనల్‌లో ఓటమిపాలైంది. సానియా, డోడింగ్ జోడీ ఆదివారం జరిగిన ఫైనల్‌లో అబిగెల్ స్పియర్స్, జువాన్ సెబాస్టియన్ కబాల్ జోడీ చేతిలో 2-6, 4-6 తేడాతో పరాజయం పాలయ్యారు. కెరీర్‌లో ఇప్పటి వరకూ ఆరు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను కైవసం చేసుకున్న సానియా ఏడో టైటిల్ సాధిస్తుందని అభిమానులు ఆశించారు.

01/30/2017 - 00:53

లక్నో, జనవరి 29: సయ్యద్ మోదీ స్మారక బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, తెలుగు తేజం పివి సింధు కైవసం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ విజేతగా నిలిచాడు. కాగా, మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్‌కు రెండో స్థానమే దక్కింది.

01/30/2017 - 00:52

న్యూఢిల్లీ, జనవరి 29: భారత అండర్-19 క్రికెట్ జట్టు ట్రైనర్ రాజేష్ సావంత్ తన హోటల్ గదిలో మృతి చెందాడు. అతని మృతికి గుండెపోటు కారణమై ఉంటుందని పోలీస్ అధికారులు తెలిపారు. అయితే, పోస్టుమార్టం నివేదిక వచ్చిన అందిన తర్వాతే వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. సావంత్ హఠాన్మరణంపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ జోహ్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు.

Pages