S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/26/2017 - 09:06

మెల్బోర్న్, జనవరి 25: అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన మిర్జానా లూసిక్ బరోనీ 6-4, 3-6, 6-4 తేడాతో కరోలినా ప్లిస్కోవాపై సంచలన విజయాన్ని నమోదు చేసి, సెమీ ఫైనల్ చేరింది. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో ప్లిస్కోవా హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగింది. ఆమెను ఓడించడం లూసిక్ బరోనీకి సాధ్యం కాదని అంతా ఊహించారు. కానీ, అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఆమె విజయభేరి మోగించింది.

01/26/2017 - 09:05

న్యూఢిల్లీ, జనవరి 25: అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పద్మశ్రీ అవార్డుకు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీసహా మొత్తం ఎనిమిది మంది ఎంపికయ్యారు.

01/26/2017 - 09:04

కాన్పూర్, జనవరి 25: ఇంగ్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్ గురువారం నుంచి ప్రారంభం కానుండగా, ప్రధాన సమస్యలు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని వేధిస్తున్నాయి. టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను 4-0 తేడాతో చిత్తుచేసిన భారత్ ఆతర్వాత వనే్డ సిరీస్‌ను 2-1 ఆధిక్యంతో సొంతం చేసుకుంది.

01/25/2017 - 01:06

మెల్బోర్న్, జనవరి 24: ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో స్విస్ దిగ్గజం, ప్రపంచ మాజీ నెంబర్ వన్ ఆటగాడు రోజర్ ఫెదరర్ సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. మంగళవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అతను వరుస సెట్ల తేడాతో జర్మనీకి చెందిన మిషా జ్వెరెవ్‌ను మట్టికరిపించాడు.

01/25/2017 - 01:02

మెల్బోర్న్, జనవరి 24: ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో సెమీఫైనల్ బెర్తు కోసం హైదరాబాద్ బ్యూటీ క్వీన్ సానియా మీర్జా, రోహన్ బొపన్న అమీతుమీ తేల్చుకోనున్నారు. మంగళవారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లలో వీరిద్దరూ తమతమ భాగస్వాములతో కలసి ప్రత్యర్థులను ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు.

01/25/2017 - 01:01

ముంబయి, జనవరి 24: ఇరానీ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో రెస్ట్ఫా ఇండియా జట్టు టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్ పోరులో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో రంజీ చాంపియన్ గుజరాత్‌ను మట్టికరిపించి విజేతగా నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో అజేయ డబుల్ సెంచరీతో సత్తా చాటుకుని ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కెరీర్‌లో అత్యుత్తమ స్కోరు నమోదు చేసుకున్న వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా రెస్ట్ఫా ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు.

01/25/2017 - 00:59

దుబాయ్, జనవరి 24: శ్రీలంక రాజధాని కొలంబోలో ఫిబ్రవరి 7 నుంచి 21వ తేదీ వరకు జరిగే ఐసిసి ప్రపంచ కప్ క్రికెట్ క్వాలిఫయర్స్‌లో పాల్గొనే భారత మహిళా జట్టుకు మిథాలీ రాజ్ సారథ్యం వహించనుంది. మొత్తం పది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్‌లో భారత్‌తో పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు ముఖ్యమైనవి.

01/24/2017 - 00:54

కోల్‌కతా, జనవరి 23: భారత ఓపెనర్లు ఫామ్‌లోకి వస్తారని, ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కెప్టెన్ విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. మరో ఐదు నెలల్లో, ఇంగ్లాండ్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీకి అన్ని విధాలా సిద్ధమవుతామని అన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టి-20 తాము సన్నద్ధం కావడానికి ఉపయోగపడుతుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

01/24/2017 - 00:52

బిసిసిఐకి పాలనాధికారులను సుప్రీం కోర్టు మంగళవారం నియమించనుంది. బోర్డు తరఫు లాయర్లు తొమ్మిది మందితో కూడిన జాబితాను సమర్పించగా, అంత భారీ సంఖ్యలో అబ్జర్వర్లు అవసరం లేదని కోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇలావుంటే ముంబయ వాంఖడే స్టేడియంలోని బోర్డు ప్రధాన కార్యాలయానికి సోమవారం చేరుకున్న కోశాధికారి అనిరుద్ధ్ చౌదరి పలువురితో చర్చలు జరిపాడు.

01/24/2017 - 00:50

న్యూఢిల్లీ, జనవరి 23: ఇంగ్లాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌లో పాల్గొనే భారత జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. ఇది వరకే ప్రకటించిన జట్టు నుంచి రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు విశ్రాంతినిచ్చి, వారి స్థానాల్లో లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా, ఆఫ్ స్పిన్నర్ పర్వేజ్ రసూల్‌ను ఎంపిక చేశారు.

Pages