S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/24/2017 - 00:48

మెల్బోర్న్, జనవరి 23: జపాన్ సూపర్ స్టార్ కెయ్ నిషికొరీని ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ పురుషుల సింగిల్స్ నాలుగో రౌండ్‌లో అతి కష్టం మీద ఓడించిన ప్రపంచ మాజీ నంబర్ వన్, ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడినప్పటికీ నిషికొరీ నుంచి అతనికి గట్టిపోటీ ఎదురైంది.

01/24/2017 - 00:47

మెల్బోర్న్: వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో బరిలోకి దిగిన ఉజ్బెకిస్తాన్ ఆటగాడు డెనిస్ ఇస్టోమిన్ దూకుడుకు రష్యా స్టార్ గ్రిగరీ దిమిత్రోవ్ కళ్లెం వేశాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 117వ స్థానంలో ఉన్న ఇస్టోమిక్ రెండో రౌండ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.

01/24/2017 - 00:45

ముంబయి, జనవరి 23: రంజీ చాంపియన్స్ గుజరాత్‌తో జరుగుతున్న ఇరానీ ట్రోఫీ మ్యాచ్‌లో రెస్ట్ఫా ఇండియా విజయంపై ఆశలు సజీవంగా నిలబెట్టుకుంది. వృద్ధిమాన్ సాహా అజేయ సెంచరీతో క్రీజ్‌లోనిలదొక్కుకోవడం, కెప్టెన్ చటేశ్వర్ పుజారా అతనికి అండగా నిలవడంతో, 379 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న రెస్ట్ఫా ఇండియా జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లకు 266 పరుగులు చేసింది.

01/24/2017 - 00:43

మెల్బోర్న్, జనవరి 23: మహిళల సింగిల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంక్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నది. నాలుగో రౌండ్‌లో బార్సరా స్ట్రయికోవాను 7-5, 6-4 తేడాతో ఓడించిన ఆమె క్వార్టర్ ఫైనల్స్ చేరింది. నిరుటి విజేత, ప్రపంచ నంబర్ వన్ ఏంజెలిక్ కెర్బర్ ఓటమిపాలై నిష్క్రమించడంతో, ఈసారి టైటిల్ సాధించే అవకాశాలను సెరెనా మెరుగుపరచుకుంది.

01/24/2017 - 00:42

క్రైస్ట్‌చర్చి, జనవరి 23: రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్ చేసింది. ఇక్కడ జరిగిన రెండో టెస్టును తొమ్మిది వికెట్ల తేడాతో గెల్చుకొని, సిరీస్‌ను 2-0 తేడాతో సాధించింది. మూడో రోజు ఆట వర్షం కారణంగా రద్దయినప్పటికీ, కివీస్ ఎలాంటి ఇబ్బంది లేకుండా గెలవడం విశేషం.

01/24/2017 - 00:40

కొలంబో, జనవరి 23: శ్రీలంకతో జరిగే నాలుగు దేశాల క్రికెట్ టోర్నమెంట్‌లో ఆడేందుకు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అంగీకరించింది. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి) సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాలుగున శ్రీలంక 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది.

01/24/2017 - 00:40

జైపూర్, జనవరి 23: లోధా కమిటీ సిఫార్సులు యాభై ఏళ్ల క్రితమే వచ్చి ఉంటే ఎంతో బాగుండేదని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, లెజెండరీ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ వ్యాఖ్యానించాడు. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) మొత్తం చాలాకాలంగా స్వార్థపూరిత వ్యక్తులతో నిండిపోయిందని సోమవారం పిటిఐతో మాట్లాడుతూ అన్నాడు. సుప్రీం కోర్టు జోక్యంతోనే ఇప్పుడు బిసిసిఐ ప్రక్షాళన సాధ్యమవుతున్నదని చెప్పాడు.

01/24/2017 - 00:39

లక్నో, జనవరి 23: క్వాలిఫయింగ్ మ్యాచ్‌లతో, మంగళవారం నుంచి ప్రారంభం కానున్న సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో పాల్గొనరాదని భారత స్టార్ సైనా నెహ్వాల్ నిర్ణయించుకుంది. మలేసియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ టైటిల్‌ను సాధించిన ఆమె, వచ్చేనెలాఖరులో మొదలయ్యే జర్మనీ ఓపెన్‌లో పాల్గొంటానని ప్రకటించింది.

01/23/2017 - 04:21

సరవాక్ (మలేసియా), జనవరి 22: భారత బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఇక్కడ జరిగిన మలేసియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఆమె పొర్న్‌పవీ చొచువాంగ్‌ను 22-20, 22-20 తేడాతో ఓడించింది. రెండు సెట్లలోనూ సైనా చివరి వరకూ పోరాడాల్సి వచ్చింది.

01/23/2017 - 01:14

భారత సారథి విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేసింది. ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి, మూడో వనే్డలో హాఫ్ సెంచరీ చేసే క్రమంలో అతను కెప్టెన్‌గా తన 17వ ఇన్నింగ్స్‌లోనే 1,000 పరుగుల మైలురాయిని దాటాడు. ఎబి డివిలియర్స్ దక్షిణాఫ్రికా జట్టుకు నాయకత్వం వహిస్తూ 18 ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగులను పూర్తిచేయగా, అంతకంటే వేగంగా ఈ ఫీట్‌ను ప్రదర్శించి కోహ్లీ రికార్డు సృష్టించాడు.

Pages