S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/06/2017 - 00:09

లక్నో, జనవరి 5: ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్ (పిబిఎల్)లో భాగంగా గురువారం ఢిల్లీ ఏసర్స్‌పై అవాధే వారియర్స్ తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచింది. సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ తమతమ ప్రత్యర్థులను ఓడించి, అవాధే విజయంలో కీలక భూమిక పోషించడం విశేషం.

01/06/2017 - 00:08

న్యూఢిల్లీ, జనవరి 5: జాతీయ క్రీడాభివృద్ధి కోసం కేంద్రం ఏర్పాటు చేసిన తొమ్మిది మంది సభ్యులతో కూడిన ప్యానెల్‌లో ఏస్ షూటర్ అభినవ్ బింద్రాకు చోటు దక్కింది. దేశంలో సమగ్ర క్రీడాభివృద్ధికి అవసరమైన విధివిధానాలను ఈ ప్యానెల్ సిఫార్సు చేస్తుంది. ఈ కమిటీకి అధ్యక్షుడిగా కేంద్ర క్రీడా శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ వ్యవహరిస్తాడు.

01/06/2017 - 00:06

కేప్‌టౌన్, జనవరి 5: శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 282 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకోగా, జొహానె్నస్‌బర్గ్‌లో ఈనెల 12 నుంచి మొదలుకానున్న చివరిదైన మూడో టెస్టుకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. దక్షిణాఫ్రికా రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్‌కు దిగి, మొదటి ఇన్నింగ్స్‌లో 392 పరుగులు సాధించింది.

01/06/2017 - 00:06

సిడ్నీ, జనవరి 5: ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న చివరి, మూడో టెస్టు మ్యాచ్‌ని వర్షం వెంటాడుతున్నది. మ్యాచ్ మూడో రోజైన గురువారం ఆటలో పాక్ సీనియర్ ఆటగాడు యూనిస్ ఖాన్ సెంచరీ చేయడం విశేషం. భారీ జల్లుల కారణంగా మరోసారి ఆటంకం తప్పలేదు. 54 ఓవర్ల ఆట సాధ్యంకాగా, పాకిస్తాన్ తన మొదటి ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్లకు 271 పరుగులు చేసింది.

01/05/2017 - 08:02

న్యూఢిల్లీ, జనవరి 4: భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకున్న మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ కెరీర్‌కు తెరపడింది. టెస్టు జట్టు సారథిగా ఇది వరకే తప్పుకొన్న అతను వనే్డ, టి-20 ఫార్మాట్స్‌లోనూ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్తున్నట్టు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కి రాసిన లేఖలో పేర్కొన్నాడు.

01/05/2017 - 07:58

న్యూఢిల్లీ, జనవరి 4: లోధా కమిటీ సిఫార్సులు సక్రమంగా అమలు జరిగేందుకు వీలుగా బిసిసిఐలో ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తామని సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయానికి మద్దతు పెరుగుతున్నది. మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని అంటూ, దేశంలో క్రికెట్ ఒక గాడిన పడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

01/05/2017 - 07:57

నాగపూర్, జనవరి 4: రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో జార్ఖండ్‌ను 123 పరుగుల తేడాతో ఓడించిన గుజరాత్ ఫైనల్ చేరింది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో గుజరాత్ 390 పరుగులు చేస్తే, జార్ఖండ్ గట్టి సమాధానమిస్తూ, 408 పరుగులు సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో 18 పరుగులు వెనుకబడిన గుజరాత్ రెండో ఇన్నింగ్స్‌లో గొప్పగా ఆడలేకపోయింది. 252 పరుగులకే ఆలౌటైంది.

01/05/2017 - 08:15

సిడ్నీ, జనవరి 4: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ ఎదురీదుతున్నది. హ్యాండ్‌కోమ్ సెంచరీతో రాణించడంతో, ఆసీస్ ఎనిమిది వికెట్లకు 538 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా, అందుకు సమాధానంగా తొలి ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన పాకిస్తాన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది.

01/05/2017 - 07:56

న్యూఢిల్లీ, జనవరి 4: పరిస్థితులు చక్కబడే వరకు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఎవరి మార్గదర్శకంలో పని చేస్తుంది? ఎవరు బోర్డును ఎవరు నడిపిస్తారు? లోధా కమిటీ చేసిన సిఫార్సులు నూటికి నూరు శాతం అమలు చేసే బాధ్యతను ఎవరు స్వీకరిస్తారు? ఈ ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి.

01/04/2017 - 01:20

చెన్నై, జనవరి 3: భారత్‌కు ప్రాతినిధ్యం వహించాల్సి వచ్చినప్పుడు తమకిష్టమైన టోర్నమెంట్‌లనే ఎంపిక చేసుకునే ఆటగాళ్లను సహించేది లేదన్న స్పష్టమైన సంకేతాలనిచ్చేందుకే గాయం సాకుతో స్పెయిన్‌తో జరిగిన పోటీనుంచి తప్పుకున్న రోహన్ బొపన్నను డేవిస్ కప్ బృందంనుంచి తప్పించినట్లు అఖిల భారత టెన్నిస్ అసోసియేషన్ (ఏఐటిఏ) అంటోంది.

Pages